ఎంపురాన్ సినిమా విషయంలో ఏం జరుగుతోంది?

సినిమా తన స్వేచ్ఛను క్రమక్రమంగా కోల్పోతుందా?;

Update: 2025-04-02 13:42 GMT
ఎంపురాన్ సినిమా

తాజాగా కేరళలో విడుదలైన ‘ఎంపురాన్’ చిత్రం రాజకీయంగా, మతపరమైన వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంది. ఈ కారణంగా సినిమాలోని 24 సన్నివేశాలను తొలగించాల్సి వచ్చింది.

తరువాత కొన్ని సంభాషణలను కూడా మార్చాల్సి వచ్చింది. ఇలా జరగడం వల్ల సినిమా సృజనాత్మకత, స్వేచ్చను కోల్పోతుందనే చర్చకు దారి తీసింది. సినిమాను వెంటనే మార్చాలని చిత్ర నిర్మాతలు అనేక వర్గాల నుంచి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నారు. ఇది కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను లెవనెత్తింది.

ఈ వివాదంపై నటుడు మోహన్ లాల్ స్పందించి పత్రిక ప్రకటన విడుదల చేశారు. ‘‘నా సినిమాలు ఏ భావజాలం, రాజకీయ సమూహం లేదా మత సంస్థపై ద్వేషాన్ని ప్రొత్సహించకుండా చూసుకోవడం నా బాధ్యత’’ అని ఆయన అన్నారు.
ఈ చిత్రం వల్ల కలిగే బాధకు ఆయన చింతిస్తున్నట్లు, సమస్యలు సృష్టిస్తున్న అభ్యంతర భాగాలను తొలగించడానికి సిద్దంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. అయితే చాలామంది దర్శక నిర్మాతలు ఎంపురాన్ చిత్రానికి తమ మద్దతును ప్రకటించారు. ఎంపురాన్ సినిమా సమాజాన్ని ప్రతిబింబించిందని పేర్కొన్నారు.
సెన్సార్ బోర్డు నిర్ణయం..
ప్రస్తుతం ఈ సినిమాకు సెన్సార్ బోర్డు 24 కట్ లు సూచించిందని వార్తలు వస్తున్నాయి. వీటిలో సంభాషణలు మార్చడం, మతపరమైన రాజకీయ సున్నితత్వాన్ని రేకెత్తించే సన్నివేశాలను తొలగించడం వంటివి ఉన్నాయి.
ముందుముందు సినిమాను ప్రదర్శించడానికి ఇవి అడ్డంకులు అవుతాయనే భావంతో వీటిని తొలగించడానికి నిర్మాతలు చెబుతున్నారు. ఈ రకమైన స్వీయ సెన్సార్ షిప్ సినిమాలో కళాత్మక స్వేచ్ఛ, వాక్ స్వేచ్ఛను దెబ్బతీస్తుందని కొంతమంది వాదిస్తున్నారు.
ప్రముఖ విమర్శకుడు సీఎస్ వేంకటేశ్వరన్ మాట్లాడుతూ.. ఎంపురాన్ సినిమా ఏ వర్గామో, రాజకీయ పార్టీనే లక్ష్యంగా చేసుకోలేదని అన్నారు. అయినప్పటికీ చిత్ర నిర్మాతలు దీనికి అంగీకరించడం భారతీయ సినిమాలో సృజనాత్మకు హానికరమా అనే దానిపై చర్చలను కొనసాగిస్తున్నాయి. Full View
సెన్సార్ షిప్..
ఎంపురాన్ చుట్టూ ఉన్న వివాదం అనేక మంది ప్రముఖులను ఆకర్షించింది. ముఖ్యంగా సినిమాల నుంచి రాజకీయాల్లోకి వెళ్లిన సురేష్ గోపి సహ అనేక మంది ప్రజా ప్రముఖులను ఆకర్షించింది.
ఇది కళాత్మక స్వేచ్ఛపై దాడినా, సినిమా కంటెంట్ ను తప్పుగా అర్థం చేసుకోకుండా ఉండటానికి ఇది అవసరమైన చర్యనా? అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
సినిమాలు సమాజంలోని వాస్తవాలను ప్రతిబింబించేలా ఉండాలని వాదిస్తున్నారు. మరికొందరు బాధ్యతాయుతమైన కథ చెప్పడం ద్వారా ఎటువంటి హాని లేదా విభజన జరగకుండా చూసుకోవాలని పట్టుబడుతున్నారు.
ఎంపురాన్ వంటి సినిమాలు వ్యాపార ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్మించబడుతున్నాయని, సామాజిక వ్యాఖ్యానాన్ని ప్రొత్సహించే ఉద్దేశంతో కాదని సూచిస్తూ మితవాద గ్రూపులు కూడా దీనిపై దృష్టి సారించాయి.
రాజకీయ ఒత్తిడులు...
రాజకీయ, మతపరమైన ఒత్తిడి కారణంగా ‘ఎంపురాన్’ జరుగుతున్న మార్పులు చిత్ర నిర్మాణ సరిహద్దుల గురించి ఒక ప్రాథమిక ప్రశ్నను లెవనెత్తుతున్నాయి. బాధ్యతాయుతమైన చిత్ర నిర్మాణం, సృజనాత్మక వ్యక్తీకరణను అణచివేయడం మధ్య మనం ఎక్కడ గీతను గీస్తామని పలువురు విమర్శలు అంటున్నారు.
చలన చిత్ర నిర్మాణంలో వాక్ స్వాత్రంత్యం, కళాత్మక సమగ్రతను చాలామంది సమర్థిస్తుండగా, మరికొందరు సృజనాత్మక, సామాజిక బాధ్యత మధ్య సమతుల్యత అవసరమని వాదిస్తున్నారు. ఈ వివాదం ఫలితం భవిష్యత్, సమాజం వాటిని ఎలా స్వీకరిస్తుందో ఒక ఉదాహారణగా చూపెడుతున్నారు.


Tags:    

Similar News