విమానం కూలిన ఘటనలో ప్రాణాలతో బయటపడ్డ ఒకే ఒక్కడు

ఖాట్మండు విమానాశ్రయం నుంచి బయల్దేరిన విమానం టేకాఫ్ సమయంలో కూలిపోయింది. ఈ ఘటనలో ఒకే ఒక్కడు మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు.

Update: 2024-07-24 12:08 GMT

ఖాట్మండులో విషాదం చోటుచేసుకుంది. త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ నుంచి పోఖారాకు బయల్దేరిన శౌర్య ఎయిర్‌లైన్స్ విమానం టేకాప్ సమయంలో కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకే ఒక్కడు ప్రాణాలకు బయటపడ్డారు. ఇద్దరు విమాన సిబ్బందితో పాటు 17 మంది టెక్నీషియన్లు మరో విమానాన్ని రిపేరీ చేసేందుకు పోఖారాకు బయల్దేరారు. మొత్తం 19 మందితో గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే విమానం కూలిపోయింది. ఒక్కసారిగా మంటలు ఎగసిపడి, దట్టమైన పొగ కారణంగా 18 మంది చనిపోయారు. పైలట్ మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే కూలిన విమానం వద్దకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన పైలట్‌ను ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలి నుంచి 18 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ (TIA) ఒక ప్రకటన తెలిపింది.

నేపాల్ విమానాశ్రయంలో ఎయిర్ సేఫ్టీ సరిగా లేవని, పైలట్లకు అవసరమైన శిక్షణ లేదని నివేదికలు చెబుతున్నాయి. 2000 నుంచి విమానాలు, హెలికాప్టర్ ప్రమాదాల్లో దాదాపు 350 మంది చనిపోయారు. ఖట్మండ్ ఎయిర్ పోర్టు చుట్టూ ఎతైనా కొండలు ఉన్నాయి. పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ ఎయిర్‌బస్ ఖాట్మండుకు చేరుకునే సమయంలో కొండపైకి దూసుకెళ్లడంతో 167 మంది మరణించారు. జనవరి 2023లో కూడా 72 మంది ప్రయాణికులు చనిపోయారు. పైలట్‌లు పొరపాటున విద్యుత్‌ను సరఫరా నిలిపేయడంతో విమానం కూలిపోయింది. 

Tags:    

Similar News