చిరుతలకు ఇన్ఫెక్షన్స్.. నివారణకు విదేశీ అయింట్‌మెంట్..

చిరుతలు ఇన్ఫెక్షన్స్ బారినపడకుండా ఉండేందుకు జూ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టారు? వాటి రక్షణకు ఆయింట్‌మెంట్ ఏ దేశం నుంచి తెప్పించారు?

Update: 2024-06-30 08:50 GMT

మనుషులకు మళ్లే జంతువులకు అంటువ్యాధులు ప్రబలుతాయి. వర్షాకాలం ప్రారంభం కావడంతో కొన్ని సందర్భాల్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ బారిన పడి చనిపోతాయి కూడా. గతేడాది మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో మూడు చిరుతలు మృత్యువాతపడ్డాయి. పోస్టుమార్టం నిర్వహించిన వెటర్నరీ డాక్టర్లు వాటికి ‘సెప్టిసిమియా’గా పిలిచే బ్యాక్టీరియన్ ఇన్‌ఫెక్షన్ సోకిందని నిర్ధారించారు.

ఇక చిరుతల జనాభా అంతంత మాత్రంగానే ఉన్న మన దేశంలో ఉన్న వాటిని సంరక్షించుకునేందుకు జూ అధికారులు చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే దక్షిణాఫ్రికా నుంచి ఒక ఆయింట్ మెంట్ తెప్పించారు. యాంటీ ఎక్టో పారాసైట్ గా పిలిచే ఈ ఆయింట్‌మెంట్‌ను కునో నేషనల్ పార్క్‌లో 13 చిరుతల శరీరంపై అప్లై చేయనున్నారు.

దక్షిణాఫ్రికా నుంచి తెప్పించాం..

"మేము దక్షిణాఫ్రికా నుంచి 'యాంటీ ఎక్టో పారాసైట్ మెడిసిన్' (యాంటీ మాగ్గోట్) తెప్పించాం. ఈ వర్షాకాలం ప్రారంభంతో చిరుతల శరీరానికి పూయడం ప్రారంభిస్తాం. ఈ ఆయింట్ మెంట్ ప్రభావం మూడు నుంచి నాలుగు నెలల వరకు ఉంటుంది’’ అని KNP డైరెక్టర్ ఉత్తమ్ శర్మ ఆదివారం తెలిపారు.

దేశంలో అంతరించిపోయే అవకాశం ఉన్నచిరుత జాతులను రక్షించుకోవడం కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే సెప్టెంబరు 17, 2022న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరైన ఒక ఈవెంట్‌లో 8 నమీబియా చిరుతలను (ఐదు ఆడ, మూడు మగ) చిరుతలను KNPలోని క్వారంటైన్ ఎన్‌క్లోజర్‌లలోకి విడుదల చేశారు.

Tags:    

Similar News