"అవినీతి పాఠశాలలో మోదీయే మాస్టారు"

మోదీ దేశంలో అవినీతి పాఠశాల నడుపుతున్నారని, పాఠాలను ఆయనే బోధిస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు.

Update: 2024-04-20 07:38 GMT

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. ఎలక్టోరల్ బాండ్ల గురించి ప్రస్తావిస్తూ.. మోదీ దేశంలో అవినీతి పాఠశాల నడుపుతున్నారని, అందులో పాఠాలను ఆయనే బోధిస్తున్నారని మండిపడ్డారు.

‘నరేంద్ర మోదీ దేశంలో 'అవినీతి పాఠశాల' నడుపుతున్నారు.అవినీతి శాస్త్రం అనే సబ్జెక్ట్‌ను అతనే బోధిస్తున్నారు" అని రాహుల్ గాంధీ ఎక్స్‌లో పేర్కొన్నారు. దాడుల ద్వారా విరాళాల సేకరణ ఎలా జరుగుతుందో, విరాళాలు తీసుకున్న తర్వాత కాంట్రాక్టులు ఎలా పంపిణీ చేస్తారో ప్రధాని బోధిస్తున్నారని కాంగ్రెస్ మాజీ చీఫ్ పేర్కొన్నారు.

అవినీతిపరులను కడిగే వాషింగ్ మెషీన్ ఎలా పని చేస్తుందో.. ఏజెన్సీలను రికవరీ ఏజెంట్లుగా మార్చి ‘బెయిల్ అండ్ జైల్’ గేమ్ ఎలా ఆడవచ్చో మోదీకి బాగా తెలుసన్నారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా ఇదే ప్రకటనను ఎక్స్‌లో పంచుకున్నారు "హఫ్తా వాసులీ ప్రభుత్వాన్ని ఎన్నుకోవద్దు. మార్పును కోరుకోండని పేర్కొన్నారు. అవినీతిపరులకు బిజెపి "క్రాష్ కోర్సు" తప్పనిసరి చేసిందని, దానికి దేశం మూల్యం చెల్లిస్తోందని గాంధీ ఆరోపించారు.

భారత కూటమి అధికారంలోకి వస్తే ఈ 'అవినీతి పాఠశాల'ను మూసివేయిస్తామని, కోర్సును శాశ్వతంగా రద్దు చేస్తుందని చెప్పారు.

ఫిబ్రవరిలో ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని కొట్టివేస్తూ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. సుప్రీం ఆదేశాలతో ఎలక్టోరల్ బాండ్ల అధీకృత అమ్మకందారుగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బాండ్ల డేటాను బహిర్గతం చేసింది. ఎలక్టోరల్ బాండ్లను కాంగ్రెస్ క్విడ్ ప్రోకోగా అభివర్ణించింది. 

Tags:    

Similar News