ఇజ్రాయెల్ తన భూభాగాన్ని రక్షించుకోగలదా?

పశ్చిమాసియాలో ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ప్రారంభం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే భవిష్యత్ లో ఇజ్రాయెల్ తన భూభాగాన్ని రక్షించుకోగలదా? తాజాగా జరిగిన ..

By :  491
Update: 2024-10-03 06:15 GMT

పశ్చిమాసియాలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ప్రపంచం మొత్తం ఊపిరిబిగపట్టి చూస్తోంది. ఆరు నెలల కింద ఇజ్రాయెల్ పై ఇలాగే ఇరాన్ వందల కొద్ది క్షిపణులు ప్రయోగించింది. తిరిగి అక్టోబర్ 1న ఇజ్రాయెల్ పై 180 క్షిపణులు ప్రయోగించి ఇరాన్ కయ్యానికి కాలు దువ్వింది. ఇది ఈ సంవత్సరంలో రెండో అతిపెద్ద సైనిక చర్యగా సైనిక నిపుణులు చెబుతున్నారు.

ఇరాన్ మద్దతు గల ఉగ్రవాద సంస్థ హెజ్ బుల్లా - ఇజ్రాయెల్ మధ్య యుద్దం ప్రారంభమైన నేపథ్యంలో ఇరాన్ ఈ దుస్సాహానికి దిగింది. ఇందులో ఇంతకుముందు ఉపయోగించిన ఆయుధాల కంటే అత్యాధునికమైనవి ప్రయోగించింది. దీనితో రెండు దేశాల మధ్య యుద్దం ప్రారంభం అవుతుందని ప్రపంచం భయపెడుతోంది. ఇజ్రాయెల్ కనుక ఎదురుదాడి చేస్తే అందుకు అనుగుణంగా వైమానిక రక్షణ వ్యవస్థలను తమ దేశంలో మోహరించినట్లు సమాచారం.
ఇరాన్ క్షిపణి పరాక్రమం
నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ యూఎస్ ఆఫీస్ ప్రకారం, ఇరాన్ మధ్యప్రాచ్యంలో అతిపెద్ద బాలిస్టిక్ క్షిపణుల ఆయుధాలతో బలంగా ఉంది. ఇరాన్ తన ఆయుధశాలలో కనీసం 3,000 బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయని యుఎస్ ఎయిర్ ఫోర్స్ జనరల్ కెన్నెత్ మెకెంజీ 2023లో కాంగ్రెస్‌కు చెప్పారు. రాకెట్‌తో నడిచే బాలిస్టిక్ క్షిపణులు ఆర్టిలరీ రాకెట్ల కంటే వాతావరణంలో ఎక్కువ ఎత్తుకు ఎగురుతాయి. లక్ష్యాన్ని చేరుకోవడానికి ముందు వార్‌హెడ్ పేలోడ్ విడిపోయి లక్ష్యం వైపు వెళ్తాయి.
ఈ ఏడాది ఏప్రిల్ లో అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ ఓ వార్తా కథనాన్ని ప్రచురించింది. దీని ప్రకారం.. 1786 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇజ్రాయెల్ చేరుకునే కనీసం తొమ్మిది క్షిపణులు ఇరాన్ వద్ద ఉన్నాయని ఈ కథనం పేర్కొంది.
వాటిలో 'సెజిల్', గంటకు 17,000 కి.మీ కంటే ఎక్కువ వేగం, 2,500 కి.మీ పరిధిని కలిగి ఉన్న క్షిపణి.. 'ఖీబర్', 'హజ్ ఖాసెం' వరుసగా 2,000 కి.మీ.. 1,500-2,000 కి.మీ. ఇరాన్ ఆయుధశాలలోని ఇతర బాలిస్టిక్ క్షిపణులు 'షాహబ్-1', ఇది 300 కి.మీ. 700 కి.మీ పరిధితో 'జోల్ఫాఘర్' అలాగే 'షహాబ్-3' (800-1,000 కి.మీ.తో దూరంలోని లక్ష్యాలను ఇది గురి చూసి పేల్చగలదు.
ఇరాన్ 'ఎమాడ్-1' వంటి క్షిపణులను కూడా అభివృద్ధి చేస్తోంది. ఇవి 2,000 కి.మీల పరిధిని లక్ష్యాలను తుత్తునియలు చేయగలవు. 1,500 నుంచి 2,500 కి.మీల మధ్య రేంజ్ కలిగిన 'సెజిల్', వాషింగ్టన్‌కు చెందిన ఎన్‌జిఓ ఆర్మ్స్ కంట్రోల్ అసోసియేషన్‌ను ఉటంకిస్తూ రాయిటర్స్ తెలిపింది.
అక్టోబర్ 1న ఇజ్రాయెల్‌లోకి..
ఆపరేషన్ ట్రూ ప్రామిస్ II లో భాగంగా ఇరాన్ అధునాతన బాలిస్టిక్ క్షిపణులను ఇజ్రాయెల్‌లోకి ప్రయోగించిందని, అవి ఘన, ద్రవ ఇంధనంతో కూడిన మిశ్రమంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇరాన్ మంగళవారం ఇస్ఫాహాన్ నుంచి ఇజ్రాయెల్‌లోకి 'హజ్ ఖాసెమ్', 'ఖైబర్ షెకాన్', 'ఫట్టా-1' (హైపర్‌సోనిక్ క్షిపణి) క్షిపణులను ప్రయోగించి ఉండవచ్చని నిపుణులు అనుమానిస్తున్నారు. దాడిలో ఉపయోగించినట్లు అనుమానించబడిన ద్రవ ఇంధన క్షిపణులు 'ఎమాద్', 'బదర్', 'ఖోర్రామ్‌షహర్' ఉన్నాయని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
లిక్విడ్ ప్రొపెల్లెంట్‌ను ఉపయోగించే 'షాహబ్-3' బాలిస్టిక్ క్షిపణి రూపాంతరాలను తాజా దాడిలో ఉపయోగించవచ్చని కొంతమంది ఆయుధ నిపుణులు కూడా చెప్పారు.
హైపర్సోనిక్ క్షిపణుల ఉపయోగం
బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్‌లను ఉపయోగించిన ఇజ్రాయెల్‌పై ఏప్రిల్‌లో జరిగిన దాడితో పోల్చితే ఇరాన్ మంగళవారం నాటి దాడిలో మరింత అధునాతన ఆయుధాలను మోహరించినట్లు తెలుస్తోంది. టెల్ అవీవ్ లోని పట్టణ ప్రాంతాలే లక్ష్యంగా ఇరాన్ హైపర్ సోనిక్ క్షిపణులు ప్రయోగించింది. ఇంతకుముందు ఏప్రిల్ లో జరిగిన దాడిలో సైనిక కేంద్రాలు మాత్రమే లక్ష్యంగా చేసుకునేది.
హైపర్సోనిక్ క్షిపణులు ధ్వని వేగం కంటే ఐదు రెట్ల వేగంతో (గంటకు 6,100 కి.మీ.) ప్రయాణించగలవు. ఇరాన్ తన మొట్టమొదటి దేశీయంగా తయారు చేసిన హైపర్‌సోనిక్ బాలిస్టిక్ క్షిపణులను జూన్ 2023లో ప్రదర్శించింది. ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) మూడు ఇజ్రాయెల్ సైనిక స్థావరాలను కూడా లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్లు తెలిసింది.
చాలా క్షిపణులను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు కూల్చివేసినట్లు ఇజ్రాయెల్ చెబుతుండగా, 90 శాతం క్షిపణులు తమ లక్ష్యాలను చేధించాయని IRGC పేర్కొంది.
రెస్టారెంట్లు, పాఠశాలలు దెబ్బతిన్నాయని BBC తన జెరూసలేం ప్రతినిధిని ఉటంకిస్తూ, కొన్ని సైనిక స్థావరాలు కూడా ధ్వంసం అయినట్లు తెలిపింది. వీటిలో ఒకటి టెల్ అవీవ్ సమీపంలోని ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ మొసాద్ ప్రధాన కార్యాలయం సమీపంలో పడింది.
ఇజ్రాయెల్ ఐరన్ డోమ్..
ఇరాన్ క్షిపణులు ప్రయోగించిందని సమాచారం రాగానే ఇజ్రాయెల్ తన బహుళ లేయర్డ్ భద్రతా వ్యవస్థను అప్రమత్తం చేసింది. కంటిన్యూగా సైరన్లు మోగించడంతో బాంబు షెల్డర్లలోకి ప్రజలు పరుగులు తీశారు. అటువంటి దాడులను అడ్డుకోవడానికి ఐరన్ డోమ్ వంటి వ్యవస్థలు క్షిపణులు ప్రయోగించింది. మధ్య-శ్రేణి డేవిడ్ స్లింగ్ 100-200 కి.మీ దూరంలో ప్రయోగించే క్షిపణులను పేల్చివేయగలదు. విమానాలు, డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణులను ఛేదించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
మంగళవారం ఇరాన్ క్షిపణులను ఎవరు అడ్డుకున్నారు?
అయితే, ఇజ్రాయెల్ మిస్సైల్ డిఫెన్స్ ఆర్గనైజేషన్ (IMDO) మంగళవారం నాడు క్షిపణులను అడ్డగించేందుకు ఐరన్ డోమ్‌ను మోహరించే అవకాశం లేదని CNNకి తెలిపింది. ఏప్రిల్ దాడి సమయంలో ఐరన్ డోమ్ దేశాన్ని రక్షించినప్పటికీ, మంగళవారం నాటి దాడికి వ్యతిరేకంగా ఇజ్రాయెల్ కు చెందిన బహుళ-లేయర్డ్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉపయోగించారు. ఇరాన్ క్షిపణులను కూల్చివేయడానికి కనీసం 12 క్షిపణి నిరోధక ఆయుధాలను ప్రయోగించినట్లు యూఎస్ మిలిటరీ తెలిపింది. అయితే కొన్నింటిని జోర్డాన్ వైమానిక దళం అడ్డగించిందని, మరికొన్నింటిని UK ఫైటర్ జెట్‌లు అడ్డగించినట్లు ఆయా దేశాలు ప్రకటించాయి.
ఐరన్ డోమ్ బలంగా ఉందా?
ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) మంగళవారం దాడి సమయంలో చాలా క్షిపణులను ఇజ్రాయెల్ అధునాతన రక్షణ వ్యవస్థలు అడ్డగించాయని పేర్కొన్నాయి. అయితే భవిష్యత్ లో ఇరాన్ ప్రయోగించే ఆధునాతన ఆయుధాలను టెల్ అవీవ్ తట్టుకోగలదా? తనను రక్షించే సొంత వ్యవస్థలు ఆ దేశం అభివృద్ధి చేసుకోగలదా? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.
రాకెట్ల బారేజీని ప్రయోగిస్తే వ్యవస్థ అతలాకుతలం అవుతుందని, దీనివల్ల కొన్ని జారిపడి నష్టం వాటిల్లుతుందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఐరన్ డోమ్ ఇజ్రాయెల్‌పై తరచుగా హమాస్ చేస్తున్న క్షిపణి దాడులకు రక్షణగా ఉన్నప్పటికీ, మరింత శక్తివంతమైన హెజ్ బుల్లా ఇలాగే దాడులు చేస్తే ఇది తట్టు కోగలదా? ఇరాన్ మద్ధతు ఉన్న హెజ్ బుల్లా ప్రభుత్వం లో భాగం మాత్రమే కాదు.. అది హమాస్ కంటే వెయ్యి రెట్లు శక్తివంతమైనది. దీని దగ్గర దాదాపు 1. 5 లక్షల రాకెట్లు, క్షిపణులు ఉన్నాయి.
మంగళవారం నాటి దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ ప్రతిజ్ఞ చేసింది, అయితే ఇరాన్ క్షిపణులను కూల్చివేయడానికి సాయం చేయమని యుఎస్ ఈ ప్రాంతంలోని తన బలగాలను ఆదేశాలు జారీ చేసింది. ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లో అమెరికా భారీగా పెట్టుబడులు పెట్టగా, జో బైడెన్ ప్రభుత్వం ఇజ్రాయెల్‌కు ఆ దేశపు వాయు, క్షిపణి రక్షణ వ్యవస్థలకు సహాయం చేయడానికి కాంగ్రెస్‌ను 14.3 బిలియన్ డాలర్లు కేటాయించేలా చేస్తామని హమీ ఇచ్చింది.



Tags:    

Similar News