ఫన్ ,ఎమోషన్ : 'చట్నీ సాంబార్' వెబ్ సిరీస్ రివ్యూ!

కేవలం క్రైమ్ వెబ్ సీరిస్ లనే స్ట్రీమ్ చేస్తే జనాలకు బోర్ కొడుతుందని ఓటీటిలు మెల్లిగా గుర్తిస్తున్నాయి. దాంతో జానర్స్ మారుస్తున్నాయి.

Update: 2024-07-30 06:02 GMT

కేవలం క్రైమ్ వెబ్ సీరిస్ లనే స్ట్రీమ్ చేస్తే జనాలకు బోర్ కొడుతుందని ఓటీటిలు మెల్లిగా గుర్తిస్తున్నాయి. దాంతో జానర్స్ మారుస్తున్నాయి. ఫన్, ఫ్యామిలీ ఎమోషన్స్ కు చెందిన సీరిస్ లకు ప్రయారిటీ ఇస్తున్నాయి. అలాగే సినిమాల్లో క్రేజ్ ఉన్న వాళ్లను ప్రధాన పాత్రల్లో పెట్టి సినిమా డైరక్టర్సే వెబ్ సీరిస్ లు డైరక్ట్ చేస్తున్నారు. దాంతో మంచి క్రేజ్ క్రియేట్ అవుతోంది. అలా మన ముందుకు వచ్చిన వెబ్ సీరిస్ చట్నీ సాంబార్ (Chutney Sambar). యోగిబాబు (Yogi Babu) ప్రధాన పాత్రలో ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడుగా పేరు తెచ్చుకున్న రాధామోహన్ డైరక్ట్ చేసిన ఈ సీరిస్ ఎలా ఉంది...చూడదగినదేనా, ఏ మేరకు మనలని నవ్వించింది?

కథేంటి

ఊటీలో రత్నస్వామి (నిళల్ గల్ రవి) కి 'అముద' పేరుతో ఒక హోటల్ ఉంటుంది. అక్కడ 'సాంబార్' చాలా ఫేమస్. దాని కోసమే ఎక్కడెక్కడ జనం వచ్చి తినిపోతూంటారు. అయితే ఆ సాంబార్ ఫార్ములా ఎవరికీ తెలియనివ్వకుండా జాగ్రత్త పడుతూంటాడు. ఇక ఆయనకు భార్య జయలక్ష్మి (మీరా కృష్ణన్) కొడుకు కార్తిక్ (చంద్రన్) కూతురు అముద (మైన నందిని) ఆమె భర్త .. అందరూ ఒకే ఇంట్లో ఉంటూంటారు. ఆ ఇంట్లో వంట మనిషి సోఫీ ( వాణి భోజన్). అంతా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్న సమయంలో ఆయనకు ప్రాంకియాజ్ కాన్సర్ రావటంతో ఇంక ఎంతో కాలం బ్రతకరని తెలుస్తుంది.

దాంతో చివరి రోజులకు దగ్గర పడుతున్న రత్నస్వామి తన కొడుకు కార్తీక్ ని పిలిచి ఓ కోరిక కోరుతాడు. అది ఆయన పెళ్లికు ముందు ముడిపడ్డ ఓ లవ్ స్టోరీకి చెందింది. ఆయన అప్పట్లో 'అముద' ఆమెను ప్రేమించి ఓ బిడ్డను కూడా కంటాడు. కానీ ఆ తర్వాత వాళ్లకు దూరం అవుతాడు. ఇప్పుడు అవన్నీ గుర్తు వచ్చి...అప్పుడు పుట్టిన కొడుకుని ఎలాగైనా చూడాలని ఉందని చెప్తాడు. ఆ కొడుకు ఇప్పుడు చెన్నైలో ఉంటున్నాడని క్లూ ఇస్తాడు. దాంతో కార్తీక్ తన బావని,మరో స్నేహితుడుని తీసుకుని తన తండ్రి మొదటి భార్య కొడుకుని పట్టుకురావాలని బయిలు దేరతాడు.

ఇక ఆ కొడుకు మరెవరో కాదు సచిన్ (యోగిబాబు). మొత్తానికి కష్టపడి అతన్ని కలుసుకుంటాడు. సచిన్ కి చెన్నై లో ఇడ్లీ బండి .. అతను చేసే చట్నీపెద్ద ఫేమస్. కార్తీక్ వెళ్లి తన అన్న అయిన సచిన్ ని కలుస్తాడు. కానీ సచిన్ కు తన తల్లిని మోసం చేసిన తండ్రిని కలవటం ఇష్టం ఉండదు. చాలా కోపం ఉంటుంది. రకరకాల ప్రయత్నాలు చేసి ఒప్పించి సచిన్ ని రత్నస్వామిని కలుస్తాడు. తన కొడుకుని చూస్తూనే రత్నస్వామి ప్రాణాలు వదులుతాడు. కార్తీక్ అప్పుడు సచిన్ ని 12 రోజులు కార్యక్రమాలు అయ్యేదాకా ఉండి తండ్రి ఆత్మకు శాంతి కల్పించమంటాడు. అయిష్టంగా ఒప్పుకున్న సచిన్ కు ఆ 12 రోజులు అక్కడే ఉండగలిగాడా..అందుకోసం అతను పెట్టిన కండీషన్స్ ఏమిటి... ఆ ఇంట్లో వాళ్లకు సచిన్ గురించిన నిజం తెలిస్తే ఎలా స్పందించారు అనే విషయాలు తెలియాలంటే సీరిస్ మొత్తం చూడాల్సిందే.

ఎలా ఉంది

యోగిబాబు ప్రధాన పాత్రలో వెబ్ సీరిస్ అనగానే ఖచ్చితంగా ఫన్ సీరిస్ అని , బాడీ షేమింగ్ ని బేస్ చేసుకునే నడిపే అవకాసం ఉందని భావిస్తాము. అయితే చట్నీ సాంబార్ డైరక్టర్ రాధామోహన్ రెగ్యులర్ కి భిన్నంగా వెళ్దామనుకున్నారు. పొటిన్షియల్ ఉన్న ప్రిమైజ్ తో, ఫ్యామిలీ డ్రామా గా దీన్ని తీర్చి దిద్దారు. రాధా మోహన్ అంటే ఎవరో కాదు గతంలో ప్రకాష్ రాజ్, త్రిష కాంబోలో ఆకాశమంత , ఆ తర్వాత అల్లు శిరీష్ తో గౌరవం, నాగ్ తో గగనం వంటి సినిమాలు తీసిన వాడే. సెన్సిటివ్ ఎలిమెంట్స్ తో సినిమాలు తీసే డైరక్టర్ గా పేరు తెచ్చుకున్న ఈ దర్శకుడు తీసిన ఈ సీరిస్ కొంచెం కొత్తగానే ఉందని చెప్పాలి. ఆరు ఎపిసోడ్స్ సాగే ఈ సీరిస్ రెగ్యులర్ క్రైమ్ సీరిస్ ల నుంచి రిలీఫ్ ఇస్తుంది.

గొప్ప కథ కాదు, అవుటాప్ ది భాక్స్ కాన్సెప్టు కాదు కానీ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉన్న సీరిస్ కావటంతో ఫ్యామిలీతో కూర్చుని ఓ సాయింత్రం కాలక్షేపం చేయినిస్తుంది. అయితే కొన్ని లోపాలు లేకపోలేదు. ఎడిటింగ్ హడావిడిగా చేసినట్లు అనిపిస్తుంది. ఆరు ఎపిసోడ్స్ లో ముగించాలని, చివరి ఎపిసోడ్ కు వచ్చేసరికి హడావిడి చేసారు. అలాగే క్యారక్టర్ ఛేంజ్ అందరూ ఊహించేదే. అదీ చివరి పది నిముషాల్లో అంటే బాగా సినిమాటెక్ గా అనిపించి అప్పటిదాకా ఉన్న రియలిస్టిక్ ఎప్రోచ్ మాయమవుతుంది. వన్ లైనర్స్ మాత్రం బాగా రాసారు. కొన్ని చోట్ల డైలాగులు వినపడనివ్వకుండా మ్యూజిక్ డామినేట్ చేస్తుంది.

మనం కాస్తంత ఓల్డ్ స్కూల్ డ్రామా ఫిల్మ్ లకు అబిమాని అయితే ఈ సీరిస్ పిచ్చ పిచ్చగా నచ్చుతుంది. ఫ్యామిలీ సెంటిమెంట్, ఎమోషన్స్ అన్ని బాగా ఎక్కేస్తాయి. అయితే ఇంకా ఈ రోజుల్లో ఈ మెలోడ్రామా సీన్స్ ఏమిటి అనుకుంటే కష్టమనిపిస్తుంది.

టెక్నికల్ గా కూడా ఈ సీరిస్ మంచి స్టాండర్డ్స్ లో ఉంది. రాధామోడన్ డైరక్షన్ నాచురాలిటికి దగ్గరిగా సాగింది. డైలాగులు బాగున్నాయి. యోగిబాబు చాలా బాగా చేసారు. ఊటీ లొకేషన్స్ చాలా బాగా ప్రెంజెంట్ చేసారు. ప్రసన్న కుమార్ కెమెరా వర్క్ కు మంచి మార్కులు పడతాయి. అలాగే అజేశ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సీరిస్ కు ఊతం ఇచ్చింది. తం జిజేన్ద్రన్ ఎడిటింగ్ కాస్త సాగతీసినట్లు అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

చూడచ్చా

ఫ్యామిలీతో కూర్చుని చూడదగ్గ సీరిస్. అసభ్యంత,హింస లేదు కాబట్టి పిల్లలతో కలిసి చూడవచ్చు. అయితే విరగబడి నవ్వాలనుకుంటే మాత్రం ఆ అవకాసం ఇవ్వదు.

ఎక్కడ చూడాలి

డిస్నీ హాట్ స్టార్ లో తెలుగులో ఉంది

Tags:    

Similar News