హృతిక్ vs ఎన్టీఆర్ 'వార్ 2' రివ్యూ
స్టైల్ మిక్స్ యాక్షన్, మిస్సైన థ్రిల్లర్ ఎక్సపీరియన్స్?”;
మాజీ RAW ఏజెంట్ కబీర్ (హృతిక్ రోషన్) ఇప్పుడో దేశద్రోహి. అజ్ఞాతంలో జీవిస్తున్న వ్యక్తి. అతనిపై అతనిపై కలి కార్టెల్ అనే యాంటీ సోషల్ యాక్టివిటీ గ్రూప్ కన్నేస్తుంది. కబీర్‌ని తన కార్టెల్‌లో భాగం చేసుకుని భారతదేశాన్ని గుప్పెట్లోకి తీసుకోవాలనేది కలి పన్నాగం పన్నుతుంది. అలాగే కబీర్‌ను తమలో చేర్చుకోవడానికి ఒక షరతు పెడుతుంది — అతని గురువు, గాడ్‌ఫాదర్‌లాంటి సునీల్ లూథ్రా(అశుతోష్ రాణా) ను అంతం చేయడం.
కబీర్ ఆ మిషన్‌ను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేస్తాడు. దీంతో ఆగ్రహించిన RAW కొత్త చీఫ్ విక్రాంత్ కౌల్ (అనిల్ కపూర్), భారత ప్రభుత్వ అనుమతితో ఎలైట్ ఆపరేషన్స్ టీమ్‌ను ఏర్పాటు చేస్తాడు. ఆ టీమ్‌ను నడిపే స్పెషల్ ఆప్స్ ఆఫీసర్ విక్రమ్ చలపతి (ఎన్టీఆర్) సీన్ లోకి వస్తాడు. విక్రమ్ కు ఈ మిషన్ కేవలం డ్యూటీ మాత్రమే కాదు — ఒక సీక్రెట్ పర్సనల్ ఛాలెంజ్ కూడా.
అంతేకాదు ఆ టీమ్ లో లూథ్రా కూతురు వింగ్ కమాండర్ కావ్య లూథ్రా (కియారా అడ్వాణీ) కూడా ఉంటుంది. ఈ క్రమంలో కబీర్ కోసం విక్రమ్ టీమ్ మొదలుపెట్టిన వేట ఎలా సాగింది? కబీర్ దేశద్రోహిగా ఎందుకు మారాడు? అతనికీ, కావ్యకీ ఉన్న సంబంధం ఏమిటి? కబీర్... లూథ్రాని చంపడం వెనక వేరే కారణాలేమైనా ఉన్నాయా? కబీర్‌కి విక్రమ్ ఎవరో తెలిశాక ఏం చేశాడు? కలి కార్టెల్ వెనకున్న ఉన్నది ఎవరు?వంటి విషయాలు తెలియాలంటే సినిమా (War2 Movie) చూడాల్సిందే!
విశ్లేషణ
సినిమా మొదటి సీన్స్ లోనే డైరెక్టర్ “ఇది ఇద్దరు హీరోల కథ” అని క్లియర్‌గా సెట్ చేసేయడం దాకా బాగుంది. ఇది స్పై థ్రిల్లర్‌లోని హై కాన్సెప్ట్ హుక్ ఎలిమెంట్. అయితే, ప్రమోషనల్ క్యాంపెయిన్‌లో క్రియేట్ చేసిన “హీరో ఎవరు? విలన్ ఎవరు?” అనే మైండ్ గేమ్, స్క్రీన్‌ప్లేలో సగం వరకు మాత్రమే సస్టైన్ చేయగలిగారు. ఇలాంటి కథలకు అవసరమైన హై-స్టేక్స్ మిషన్ (High-Stakes Mission)మిస్సయ్యారు. Mission: Impossible series లో కనపడే స్క్రీన్ ప్లే ప్రేక్షకులకు మొదటి నుంచే ఇది ఒక ‘సర్వైవల్ ఆర్ డిసాస్టర్’ సిట్యుయేషన్ అని ఫీల్ వచ్చేలా ఉండాలి. కానీ అలాంటిదేమీ ఇందులో రాసుకోలేదు.
డైరెక్టర్ అప్పటికీ ఎమోషన్స్‌పై ఫోకస్ పెట్టినా, అవి కృత్రిమంగా అనిపించడం వల్ల ఎమోషనల్ ఆర్క్ వర్క్ అవ్వలేదు. కబీర్-కావ్య సీన్స్ రొటీన్‌గా ఉన్నాయి, ఇది స్పై జానర్‌లోని పర్సనల్ స్టేక్స్ని వదిలేసినట్టే. దేశభక్తి సన్నివేశాలు కూడా గతంలో చూసిన జానర్ ట్రోప్స్ని రిపీట్ చేస్తాయి, కొత్తదనం లేదు. అలాగే ఇలాంటి కథలకు అత్యవసరమైన మల్టీ-లేయర్డ్ ట్విస్ట్స్ (Multi-layered Twists) లేవు. ప్రతి ట్విస్ట్ మరొక రహస్యాన్ని తెరపైకి తెస్తూ, కథలో కొత్త మలుపులు ఇవ్వాల్సింది పోయి బోర్ కొట్టించటం మొదలెట్టాయి.
ఏదైమైనా శ్రీధర్ రాఘవన్ రాసిన స్క్రీన్‌ప్లే ఒక గొప్ప స్పై థ్రిల్లర్‌కి అవసరమైన టెన్షన్ అందించలేకపోయింది. కథలో ఉన్న మలుపులు ఊహించగలుగటం ప్రధాన సమస్య. కొన్ని ట్విస్టులు కన్‌ఫ్యూజన్ పెంచుతాయి కానీ స్టేక్స్ని పెంచటంలో విఫలం అయ్యాయి. ఇది స్పై థ్రిల్లర్‌లో మైనస్ — ఎందుకంటే ఆడియన్స్ “ఇంకేమి జరుగుతుందో?” అన్న ఉత్కంఠ కోల్పోవటం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఇన్ఫార్మేషన్ గేమ్ (The Information Game) స్పై థ్రిల్లర్స్ లో అవసరం . సమాచారం ఎవరి చేతిలో ఉందో, ఎవరు దాన్ని మానిప్యులేట్ చేస్తారో — ఇది క్లైమాక్స్‌ను డిఫైన్ చేసేది. అలాంటివి పట్టించుకోలేదు. మారిన ఆడియన్స్ కి తగినట్లు కథా,కథనాలు చూసుకోలేదు. దాంతో రొటీన్ స్పై థ్రిల్లర్ గా మారిపోయింది.
ఎవరెలా చేసారు..
యాక్షన్ థ్రిల్లర్స్ లో పవర్ ఫుల్ వెపన్ దాని కాస్టింగ్. అందుకు తగినట్లుగానే హృతిక్ రోషన్ తన ఎనిగ్మాటిక్ కబీర్ పాత్రను మళ్లీ పోషించారు — ఇది కేవలం ఫిజికల్ గా బల ప్రదర్శన మాత్రమే కాకుండా, ధైర్యాన్ని కూల్ గా ప్రదర్శించే నటన. ప్రతి ఎక్సప్రెషన్ లో ఉత్సాహం, ఆత్మవిశ్వాసం, అలాగే ఒక రకమైన వార్నింగ్ ను కూడా చూపిస్తాడు.
ఇక ఎన్టీఆర్ ...విక్రమ్‌గా ఎంట్రీ ఇస్తూనే ఫైర్‌వర్క్స్ మొదలవుతాయి. ఎన్టీఆర్ ఒక సహజంగానే మంచి నటుడు — కేవలం కళ్ల ద్వారానే అనేక ఎమోషన్స్ ని ఎక్సప్రెస్ చేయగల నటుడు. దాంతో వీరిద్దరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ చిత్రంలో అసలు హైలైట్. కానీ వీళ్లిద్దరూ కూడా కొంతదూరం వెళ్లిపోయాక స్క్రిప్టు సపోర్ట్ చేయక రొటీన్ గా అనిపించారు.
కియారా అద్వాణీ, అనిల్ కపూర్ లాంటి సపోర్టింగ్ కాస్ట్ తమ పాత్రల్లో చక్కగా నటించినా, వారు కొద్దిగా పరిమితంగానే అనిపిస్తాయి. కథాంశం ప్రధానంగా ఈ ఇద్దరు హీరోలపై కేంద్రీకరించబడటం వల్ల, వారిని లైట్ తీసుకున్నట్లు అనిపిస్తుంది.
టెక్నికల్ గా ..
యాక్షన్ ఈ జానర్‌లోని కీలక స్తంభం, ‘వార్ 2’లో ఇది ఒక విజయం. అనుభవజ్ఞులైన యాక్షన్ డైరెక్టర్లు, స్టంట్ కో-ఆర్డినేటర్లు కలసి రూపొందించిన ఈ హై-ఆక్టేన్ సన్నివేశాలు ఒక సహకార మాస్టర్‌పీస్.
అయాన్ ముఖర్జీ దర్శకత్వం మేకింగ్ వైజ్ బాగుంది.కానీ సినిమాలో థ్రిల్స్ ని ఇంపాక్ట్ ఇచ్చే విధంగా తీర్చిదిద్దలేకపోయారు. అలాగే ‘వార్ 2’ ఫస్ట్ హాఫ్ పేసింగ్ బాగుంది. సెకండాఫ్ రివర్స్ లో విసిగిస్తుంది. బెంజమిన్ జాస్పర్ ఫోటోగ్రఫీ సినిమాకు పెద్ద ప్లస్, ప్రీతమ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎనర్జీని నింపింది. కానీ పాటలు సోసోగా ఉన్నాయి.
ఫైనల్ థాట్:
‘వార్ 2’ ని ఒక స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ గా తీర్చి దిద్దే ప్రాసెస్ లో ...ఓ స్పై థ్రిల్లర్ కు ఉండాల్సిన మల్టీ-లేయర్డ్ సస్పెన్స్, మోరల్ క్లిష్టత (moral complexity), ట్విస్ట్ పాయింట్స్ ఇవ్వటం దర్శకుడు మర్చిపోయాడు.దాంతో చూసిన వారు కూడా అంతే స్పీడుగా ఈ సినిమాని మర్చిపోయే అవకాసం ఉంది.