“మెగాస్టార్ రీ-రిలీజ్ తో చిన్న సినిమాల సీక్రెట్ ఫైట్?
అసలు గేమ్ ఎవరిది?
తెలుగు బాక్సాఫీస్ దగ్గర ఓ రూల్ ఉంది— స్టార్ హీరో రిలీజ్ అంటే ధూమ్, ధామ్. చిన్న సినిమాలు ఓకే రిజల్ట్ వచ్చాక చూద్దాంలే..రివ్యూలు చూసి వెళ్దాం లే అనే వెయిట్ మోడ్. ఒక్కోసారి ఈ రూల్ ని పక్కన పెట్టే పరిస్దితి కూడా వస్తుంది. చిన్న సినిమా కంటెంట్ పర్ఫెక్ట్‌గా కనెక్ట్ అయింది అంటే… స్టార్ హీరోల సినిమాలనే పక్కకు నెట్టేస్తుంది! ఇలాంటి రెవల్యూషన్ మనం ఈ మధ్యకాలంలో ‘కంచరపాలెం’, ‘రైటర్ పద్మనాభం’, ‘బేబి’ వంటి సినిమాలతో చూసాం.
ఈ వారం కూడా అలాంటి వాతావరణమే.
స్టార్ హీరోల హడావిడి లేదు… బాక్సాఫీస్ మొత్తం ఓపెన్ గ్రౌండ్.
ఇప్పుడు చిన్న సినిమాలే తమదైన స్టైల్ లో “ఇక్కడ మేమున్నాం” అని ప్రూవ్ చేసుకుంటాం అంటూ పోటీకి రెడీ.
ఈ వారం ఎన్నో ఏళ్లుగా వేచి ఉన్న చిన్న సినిమాలు ఇప్పుడు వరుసగా థియేటర్ లో దిగుతున్నాయి. నవంబర్ 24 రిలీజ్‌ల లిస్ట్ చూస్తే…
కథల మీదే బెట్టింగ్, కంటెంట్‌తోనే పోటీ!
▶ ప్రియదర్శి ‘ప్రేమంటే’: స్టార్ పవర్ లేదు… కానీ సుమ పవర్ ఉంది!
సినిమా మీద ఆసక్తి రేపినది ప్రియదర్శి కాదు… పోలీస్ ఆఫీసర్‌గా సుమ! మార్కెటింగ్ గిమ్మిక్ మాత్రమేనా? లేక కథే సపోర్ట్ చేస్తుందా?
ఈ సినిమాపై క్యూరియాసిటీ కంటెంట్ వల్లనా? లేక సుమ వల్లనా? సినిమా ఓపెన్ అయితేనే తెలుస్తుంది.
▶నరేష్ ‘12 ఏ రైల్వే కాలనీ’: కామెడీ కింగ్ నుంచి క్రైమ్ కింగ్‌గా జంప్!
చిన్న సినిమాల్లో బిగ్గెస్ట్ అడ్డంకి — బడ్జెట్ కాదు, పెర్ఫార్మెన్స్ + స్క్రీన్‌ప్లే. ఈసారి నరేష్ పూర్తిగా సెఫ్ జోన్ వదిలేసి డార్క్ థ్రిల్లర్‌లోకి డైవ్ అయ్యాడు. కొత్త తరహా స్క్రీన్‌ప్లే తో వస్తున్నారని చెప్తున్నారు. నరేష్ తన పంచ్‌లు, ఫన్ ఎక్స్‌ప్రెషన్స్… ఇవన్నీ పక్కన పెట్టి
నరేష్ ఇప్పుడు డార్క్ జోన్లోకి దూకాడు. సినిమా పట్టేస్తే ఇదే నరేష్ కెరీర్‌కు మరొక అల్లరి సక్సెస్ కంటే పెద్ద బ్రేక్ కావచ్చు.
▶ ‘రాజు వెడ్స్ రాంబాయి’: రీల్స్ సూపర్… థియేటర్‌లో రిజల్ట్ ఏంటి?
హడావిడి అంతా సోషల్ మీడియాలోనే అయిపోయింది. సాంగ్స్, రీల్స్, ‘క్లైమాక్స్ లీక్’ డ్రామా… యూత్‌లో బజ్ తీసుకొచ్చింది. కానీ అసలు టెస్ట్ ఇప్పుడే— మొబైల్ స్క్రీన్ హిట్ = సిల్వర్ స్క్రీన్ హిట్ అవుతుందా?
▶ గేమ్ చెడగొట్టడానికి మెగాస్టార్ ఎంట్రీ!
అన్ని కొత్త సినిమాల మీద మేజర్ ప్రెజర్ ఏంటంటే — చిరంజీవి ‘కొదమసింహం’ రీ-రిలీజ్! ఆ సినిమా సత్తా ఎలాంటిదో మీకు తెలుసు కదా… నాస్టాల్జియా + మెగాస్టార్ = బాక్సాఫీస్‌లో సైలెంట్ టైఫూన్.
అదే కాదు, సీనియర్ హీరో అర్జున్ ‘మఫ్టీ పోలీస్’,
బాలీవుడ్ నుండి ‘120 బహద్దూర్’ కూడా లో ప్రొఫైల్‌గా కానీ డైరెక్ట్ పోటీగా వస్తున్నాయి.
అంటే క్లారిటీ ఏంటి?
ఈ వారం స్టార్ పవర్ లేదంటే…
స్టోరీ పవర్‌తో ఎవరు గెలుస్తారు?
ప్రేక్షకులే ఇప్పుడు నిర్ణయించే జడ్జ్.
టాక్ పాజిటివ్ అయితే చిన్న సినిమాలూ డే–1 నుంచే దుమ్ము లేపగలవు!
ఈ వారం బాక్సాఫీస్ థీమ్ ఒక్కటే:
“సైలెంట్ వారం… కానీ షార్ప్ కాంపిటీషన్!”