ట్రేడ్ టాక్ : ఇక్కడ టిల్లుగాడు..అక్కడ గాడ్జిల్లా గాడు ర్యాంపేజ్

రెండు మూడు వారాల్లో చాలా సినిమాలు వచ్చినా కొన్ని మాత్రమే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం అవి థియేటర్లలో ఏ రేంజ్‌లో ర్యాంపేజ్ సృష్టిస్తున్నాయో తెలుసా..

By :  Admin
Update: 2024-04-01 10:57 GMT

ఎన్ని సినిమాలొచ్చినా ప్రేక్షకుడి మనసుకు నచ్చిన సినిమాలే వర్క్‌ఔట్ అవుతాయి. ఈ రెండు మూడు వారాల్లో మలయాళ డబ్బింగ్ ‘ప్రేమలు’ తప్పిస్తే జనాలను ఆకట్టుకుని డబ్బులు తెచ్చిపెట్టిన సినిమా లేదు. ఈ వారం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న సిద్దు జొన్నలగడ్డ ‘టిల్లు స్క్వేర్ ’, ది గోట్ లైఫ్ (ఆడుజీవితం) చిత్రాలు విడుదలయ్యాయి. ది గోట్ లైఫ్ (ఆడుజీవితం) డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుని థియేటర్ల వద్ద ప్రేక్షకులు కనపడటం లేదు. మరో ప్రక్క‘టిల్లు స్క్వేర్ ’ సూపర్ హిట్ టాక్‌తో కలెక్షన్లను రాబడుతోంది.

టిల్లూ స్క్వేర్ విషయానికి వస్తే... సూపర్ హిట్ డీజే టిల్లూకి సీక్వెల్‌గా వచ్చిన మూవీ ఇది. గతేడాది సెప్టెంబర్ నుంచి వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా.. మొత్తానికి శుక్రవారం (మార్చి 29) థియేటర్లలోకి వచ్చింది. సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ నటించిన ఈ మూవీ మార్నింగ్ షో నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. డీజే టిల్లు హిట్ అవడంతో ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలు ఉండటం కలిసొచ్చింది. ప్రస్తుతం ఐపీఎల్‌ సీజన్‌ నడుస్తున్నా కూడా 'టిల్లు స్క్వేర్‌' హిట్‌ టాక్‌తో దూసుకుపోతుంది. ఈ సినిమాకు మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 23.7 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు మూవీ టీమ్ ఇప్పటికే ప్రకటించింది. రెండు రోజులకు రూ.45.3 కోట్లు వచ్చినట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది. రూ.100 కోట్ల గ్రాస్ టార్గెట్‌ పెట్టుకున్న నిర్మాతకు ఈ సినిమా అంతకు మించి కలెక్షన్స్‌ తెచ్చిపెట్టే ఛాన్స్‌ ఉందంటున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక నిన్న(మార్చి 31) ఆదివారం కాబట్టి మరింత భారీ కలెక్షన్స్‌ వచ్చాయి.

ది గోట్ లైఫ్ (ఆడుజీవితం)

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ది గోట్ లైఫ్ (ఆడుజీవితం అని కూడా పిలుస్తున్నారు) మూవీ కూడా ఈ శుక్రవారమే (మార్చి 29) థియేటర్లలోకి వచ్చింది. 2008లో అనుకున్న సినిమా మొత్తానికి ఇప్పుడు రిలీజ్ అయింది. ఈ సర్వైవల్ థ్రిల్లర్ మలయాళంలో మరో రూ.100 కోట్ల కలెక్షన్ల మూవీగా నిలుస్తుందని భావిస్తున్నారు. తెలుగులోనూ ఈ సినిమాను డబ్ చేశారు. హైదరాబాద్‌లోనూ మేకర్స్ మంచి ప్రమోషన్లే నిర్వహించారు. సలార్ మూవీతో పృథ్వీరాజ్ తెలుగువారికి కూడా దగ్గరైన విషయం తెలిసిందే. అయితే మలయాళంలో సూపర్ హిట్టైన ఈ చిత్రం తమిళం, తెలుగులో డిజాస్టర్ అయింది.

కలియుగ పట్టణంలో...

తెలుగులో ఈ వారం రిలీజ్ అయిన మరో మూవీ ‘కలియుగ పట్టణంలో’. విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్ నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ శుక్రవారం రిలీజ్ అయ్యింది. రమాకాంత్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమా మదర్ సెంటిమెంట్‌తోపాటు థ్రిల్ అందించే మూవీ అని మేకర్స్ చెప్పినా జనం పట్టించుకోలేదు.

గాడ్జిల్లా వర్సెస్ కాంగ్: ది న్యూ ఎంపైర్

గతంలో వచ్చిన గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ మూవీ పెద్ద హిట్టు. ఇక్కడ మన ఇండియాలో కూడా బాగా ఆడింది. ఇప్పుడీ మాన్‌స్టర్‌వెర్స్ ఫ్రాంఛైజీ నుంచి ‘గాడ్జిల్లా వెర్సెస్ కాంగ్: ది న్యూ ఎంపైర్’ పేరుతో మరో మూవీ వచ్చింది. ఈ మూవీ కూడా ఇంగ్లీష్‌తోపాటు పలు ఇతర భాషల్లోనూ ఈ శుక్రవారం రిలీజ్ చేశారు. ఇందులో గాడ్జిల్లా, కాంగ్ కలిసి ప్రపంచానికి ఎదురైన ఓ కొత్త సవాల్‌‌ను అధిగమించడం చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమా తెలుగు వెర్షన్‌ను కూడా జనం బాగానే ఆదరిస్తున్నారు.

క్రూ (Crew)

కరీనా కపూర్ ఖాన్‌‌, కృతిసనన్‌‌, టబు లీడ్ రోల్స్‌‌లో తెరకెక్కిన హిందీ చిత్రం ‘క్రూ’. ఏక్తాకపూర్‌‌, రియాకపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘లూట్‌‌కేస్’ ఫేమ్ రాజేష్ కృష్ణన్ దర్శకుడు. ఈ సినిమాకు హిందీలో మంచి స్పందనే వస్తోంది. చిత్రం కథ ప్రకారం ..టబు, కరీనా, కృతి ఎయిర్‌‌‌‌ హోస్టెస్‌‌గా వర్క్ చేస్తుంటారు. ఈ ముగ్గురి జీవితంలోనూ ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. మరోవైపు వీళ్లు పనిచేస్తున్న ఎయిర్‌‌‌‌లైన్స్ సంస్థ దివాళా తీస్తుంది. అదే టైమ్‌‌లో గోల్డ్ స్మగ్లింగ్‌‌ చేస్తున్న వ్యక్తి నుంచి వీళ్లు బంగారు బిస్కెట్స్‌‌ దొంగతనం చేస్తారు. అది మొదలు వీళ్ల జీవితాల్లో కొత్త సమస్యలు మొదలవుతాయి. వాటన్నింటినీ ఫన్నీ‌గా చూపించారు. ఈ బ్యాక్‌‌డ్రాప్‌‌లో వచ్చే ట్విస్టులు, సిచ్యువేషనల్‌‌ కామెడీతో పాటు ముగ్గురు హీరోయిన్స్‌‌ గ్లామర్, కామిక్ టైమింగ్‌‌ ఆకట్టుకున్నాయి. ఇప్పటివరకూ ఇద్దరు లేదా ముగ్గురు హీరోలు కలిసి కామెడీ చేస్తే చూశాం. అందుకు భిన్నంగా హీరోయిన్స్‌‌ చేత ఇందులో కామెడీ చేయించడం ఇంప్రెస్ చేసింది. పంజాబీ నటుడు దిల్జీజ్‌‌ దోసాంజ్‌‌, కపిల్ శర్మ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. మార్చి 29న సినిమా విడుదల అయింది.


Tags:    

Similar News