ఈ వారం ఓటీటీ హంగామా:
బాక్సాఫీస్ ఖాళీ, కానీ ఓటిటీల్లో సడన్ ఫుల్ మాస్!
థియేటర్లలో ఈ వారం చెప్పుకోదగ్గ సినిమాలు ఏవీ లేవు. మూడు తెలుగు చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటి బజ్ అంతంత మాత్రంగా ఉంది. అయితే, ఆడియన్స్‌కి ఎంటర్టైన్‌మెంట్ కొరత ఉండదనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు సినిమాలు, సిరీస్‌లు, డబ్బింగ్ కంటెంట్ ఆల్ ఇన్ వన్ గా ఒక్కసారిగా ఓటిటీల్లో బ్లాస్ట్ అవుతున్నాయి.
సాధారణంగా ప్రతి శుక్రవారం సినిమాలు రిలీజ్ అయ్యేలా ఆడియన్స్ ఎదురుచూస్తారు. ఇప్పుడు అదే క్రేజ్ డైరెక్ట్‌గా ఓటిటీలకు షిఫ్ట్ అయింది. కొత్త సినిమాలు ఎప్పుడు ఓటిటిలలో స్ట్రీమింగ్ అవుతాయా అని వెతికే అలవాటు పెరిగిపోయింది. ఇక ఓటిటి ప్లాట్‌ఫామ్స్ కూడా దాన్ని మైండ్‌లో పెట్టుకుని, పోటాపోటీగా కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు రిలీజ్ చేస్తూ గట్టిగానే రేస్‌లో ఉన్నాయ్. ఒకవేళ ఒక ప్లాట్‌ఫాం కాస్త స్లో అయితే, ఇంకో ప్లాట్‌ఫాం ‘సడన్ స్ట్రీమింగ్’ తో షాక్ ఇవ్వటం ఇప్పుడు నార్మల్ అయిపోయింది.
ఈ వారం ఓటీటీ సర్‌ప్రైజ్‌లు(తెలుగు డబ్బింగ్ లు)
మహావతార్ నరసింహా (Netflix – సెప్టెంబర్ 19 నుంచి)
భారీ హైప్‌తో రిలీజైన డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్ మహావతార్ నరసింహా థియేటర్లలో కలెక్షన్స్ బీభత్సం చేసింది. రూ.340 కోట్లు దాటిన ఈ పాన్ ఇండియా మైథలాజికల్ డ్రామా ఇప్పుడు ఓటిటీలోకి వచ్చింది. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్.
ది ట్రయల్ సీజన్ 2 (Jio Hotstar – సెప్టెంబర్ 19 నుంచి)
కాజోల్ లీడ్‌లో వచ్చిన కోర్ట్ రూమ్ థ్రిల్లర్ ది ట్రయల్ కి భారీ రెస్పాన్స్ రావడంతో సీక్వెల్ సిద్ధమైంది. 7 భాషల్లో ఒకేసారి రిలీజ్ చేసి జియో హాట్‌స్టార్ గట్టిగానే ఎంట్రీ ఇచ్చింది.
ది సర్ఫర్ (Lionsgate Play – సెప్టెంబర్ 19 నుంచి)
నికోలస్ కేజ్ లీడ్‌లో వచ్చిన సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ ది సర్ఫర్. 2024లో మంచి రివ్యూలు తెచ్చుకున్న ఈ సినిమా ఇప్పుడు ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది.
ష్ సీజన్ 2 (Aha – సెప్టెంబర్ 19 నుంచి)
బోల్డ్ కంటెంట్‌తో తమిళంలో సూపర్ హిట్ అయిన ష్ ఇప్పుడు తెలుగు ఆడియన్స్ కోసం వచ్చింది. ఆహాలో స్ట్రీమింగ్ మొదలైన ఈ సిరీస్ అడల్ట్ ఎలిమెంట్స్‌తో మళ్లీ హీట్ పెంచబోతోంది.
ఐడీ: ది ఫేక్ (Saina Play – సెప్టెంబర్ 19 నుంచి)
మలయాళ సైబర్ క్రైమ్ థ్రిల్లర్ ఐడీ: ది ఫేక్ ఇప్పుడు డైరెక్ట్‌గా ఓటిటీలోకి వచ్చింది. ద్యాన్ శ్రీనివాసన్, దివ్య పిల్లై నటించిన ఈ సినిమా మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో డిజిటల్ ప్రీమియర్ అయింది.
వీటితో పాటు మిగతా భాషల్లో వస్తున్న సినిమాలు, సీరిస్ లు
నెట్‌ఫ్లిక్స్
సీ సెయిడ్ మేబీ- (హాలీవుడ్ మూవీ)- సెప్టెంబర్ 19
హంటెడ్ హోటల్-(యానిమేషన్ హారర్ సిరీస్)- సెప్టెంబర్ 19
బిలియనీర్స్ బంకర్- (హాలీవుడ్ మూవీ)- సెప్టెంబర్ 19
28 ఇయర్స్ లేటర్ (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 20
అమెజాన్ ప్రైమ్
జూనియర్ (కన్నడ డబ్బింగ్ సినిమా)- సెప్టెంబర్ 19(రూమర్ డేట్)
కాన్పిడెన్స్ క్వీన్ సీజన్-1(హాలీవుడ్ సిరీస్)- సెప్టెంబర్ 20
జియో హాట్‌స్టార్
పోలీస్ పోలీస్ (తమిళ వెబ్ సిరీస్) - సెప్టెంబరు 19
స్వైప్డ్ (ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబరు 19
సన్ నెక్స్ట్
ఇంద్ర (తమిళ సినిమా) - సెప్టెంబరు 19
మాటొండ హెలువే (కన్నడ మూవీ) - సెప్టెంబరు 19
ఆహా
జూనియర్- (కన్నడ సినిమా)- సెప్టెంబరు 19(రూమర్ డేట్)
జీ5
హౌస్‌మేట్స్ (తమిళ సినిమా) - సెప్టెంబరు 19
మనోరమ మ్యాక్స్
రండం.. యామం(మలయాళ మూవీ)- సెప్టెంబరు 19
థియేటర్లలో ఈ వారం
పెద్ద సినిమాలు లేకపోయినా, మంచు లక్ష్మీ దక్ష , అంకిత్ కొయ్య–నీలఖి చేసిన బ్యూటీ , విజయ్ ఆంటోని భద్రకాళి , అలాగే కన్నడ మూవీ వీర చంద్రహాస బాక్సాఫీస్‌లో లైట్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి.
ఫైనల్ గా..
ఓటిటీల క్రేజ్ రోజు రోజుకూ పెరుగుతుంది. ఆడియన్స్ ప్రతి వారం కొత్త కంటెంట్ కోసం ఎదురుచూస్తుంటే, ఓటిటి సంస్థలు ఆ విండోని వదులుకోవడం లేదు. అదే కారణంగా సడన్ స్ట్రీమింగ్ , మల్టీ లాంగ్వేజ్ రిలీజ్‌లు ఇప్పుడు కాంపిటిషన్‌లో నార్మల్ స్ట్రాటజీగా మారిపోయాయి. థియేటర్లలో హంగామా లేకపోయినా, ఓటిటీల్లో మాత్రం ఫుల్ హంగామా గ్యారంటీ!.