క్రియేటర్లని తప్పించిన ‘తుంబాడ్ - 2’,ఎందుకిలా

మ్యాజిక్ రిపీట్ అవుతుందా… లేక కూలిపోతుందా?

Update: 2025-11-27 02:30 GMT

హారర్ జానర్‌ను కొత్త రీతిలో నిర్వచించిన ‘తుంబాడ్’ 2018లో పెద్ద విజయాన్ని సాధించకపోయినా, ఓటీటీలో మాత్రం కల్ట్ స్థాయికి ఎదిగింది. తాజాగా రీ–రిలీజ్‌లో కూడా కొత్త సినిమాలకన్నా ఎక్కువ వసూళ్లు సాధించి, తన మాస్ అండ్ మిస్టిక్‌ని మరోసారి ప్రూవ్ చేసింది. ఇదే సమయంలో—తుంబాడ్ విశ్వంలోని “ద్వారాలు మళ్లీ తెరుచుకోబోతున్నాయి” అన్న సంకేతాలతో ఫ్యాన్స్‌లో క్యూరియాసిటీ, ఎగ్జైట్మెంట్ రెండూ పీక్‌కి చేరాయి.

సీక్వెల్ అనౌన్స్… ఇంటర్నెట్ షాక్‌లో!

ఆ మధ్యన మేకర్స్‌ అధికారికంగా ‘తుంబాడ్ 2’ను ప్రకటించారు. హీరో–నిర్మాత సోహమ్‌ షా చిన్న టీజర్ వదిలారు. “కాలం ఎన్నటికీ ఆగదు… చరిత్ర పునరావృతం అవుతుంది… ఆ ద్వారాలు మళ్లీ తెరుచుకోబోతున్నాయి” అనే లైన్లు ఒకే సారి ఫ్యాన్స్‌లో థ్రిల్‌ను పెంచేశాయి. సోషల్ మీడియాలో కామెంట్లు ఊపందుకున్నాయి—“ఇండియన్ సినిమాల్లో బెస్ట్ మూవీకి సీక్వెల్ వస్తుందంటే ఆగలేం!” అని నెటిజన్లు ఫుల్ ఖుషీగా రియాక్ట్ అవుతున్నారు.

ఈసారి ఇంకెంత డార్క్? సోహమ్ షా హింట్

సీక్వెల్ గురించి సోహమ్ షా చెప్పిన మాటలు హైప్‌ని ఇంకా పెంచేశాయి— “తుంబాడ్ 2లో మరిన్ని ట్విస్టులు ఉంటాయి. అత్యాశకు పోతే ఎదురయ్యే పరిణామాలను మరింత లోతుగా, మరింత భయంకరంగా చూపించబోతున్నాం.”

ఈ ఒక్క లైన్ చాలనిపించింది… కథ ఎంత ఇంటెన్స్‌గా ఉండబోతోందో ఫ్యాన్స్ ఊహించేసుకున్నారు.

కానీ… షాకింగ్ ట్విస్ట్: ఒరిజినల్ టీమ్ OUT?

అసలు హడావిడి ఇక్కడ మొదలైంది. తుంబాడ్ 1కు క్రియేటివ్ సోల్‌లా పని చేసిన కీలక సభ్యులు సీక్వెల్‌లో లేరన్న విషయం బయటకు రావడంతో ఫ్యాన్స్ కన్‌ఫ్యూజ్ అయ్యారు. అదే క్రియేటివ్ డైరెక్టర్ కూడా స్పందించారు— ఇది నిజమైన కొనసాగింపులా అనిపించడం లేదు. ఒరిజినల్ స్పిరిట్‌ను మళ్లీ సృష్టించడం కష్టం అని ఆయన చెప్పిన మాటలు, అభిమానుల్లో టెన్షన్ పెంచేశాయి.

ఇంత స్ట్రాంగ్ కల్ట్ బేస్ ఉన్న సినిమా, సీక్వెల్‌గా “తుంబాడ్ 2” ప్రకటించగానే ప్రేక్షకుల్లో థ్రిల్ నార్మల్‌గానే ఉంది. కానీ నిజమైన షాక్ – “ఒరిజినల్ క్రియేటివ్ టీమ్ మొత్తంగా ఈ సీక్వెల్‌లో లేకపోవడం.” ఆనంద్ గాంధీ వ్యాఖ్యలు, రాహీ అనిల్ బర్వే ఎగ్జిట్ నోట్, అభిమానుల రియాక్షన్లు – ఇవన్నీ కలసి ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నను లేవనెత్తాయి:

తుంబాడ్ 2, అసలైన తుంబాడ్ స్ఫూర్తిని కంటిన్యూ చేస్తుందా? లేక ఫ్రాంచైజ్ పేరుతో కొత్త ప్రాడక్ట్ మాత్రమేనా? ఫ్యాన్స్ మధ్య ఒక హాట్ చర్చ ప్రారంభమైంది.

తుంబాడ్ – నాలుగు కీలక పేర్లు

రాహీ అనిల్ బర్వే – ఆలోచన మొదలు పెట్టిన రచయిత–దర్శకుడు

ఆనంద్ గాంధీ – కో–రైటర్, క్రియేటివ్ డైరెక్టర్, ఎగ్జికటివ్ ప్రొడ్యూసర్

ఆదేశ ప్రసాద్ – కో–డైరెక్టర్, రైటర్

సోహమ్ షా – హీరో + నిర్మాత

ఈ నలుగురూ కలిసి చేసిన విజువల్ లాంగ్వేజ్, లోకల్ మైథాలజీ, గ్రడ్డి ప్రొడక్షన్ డిజైన్ – ఇవే తుంబాడ్‌ను సాధారణ హారర్ సినిమా నుండి ఆర్ట్–హౌస్–హారర్ కల్ట్ గా ఎలివేట్ చేశాయి.

ఈ బ్యాక్‌డ్రాప్‌లోనే సీక్వెల్‌కు వస్తే వీళ్లలో కొంతమంది మిస్సైతే ఆ గ్యాప్ స్పష్టంగా కనిపిస్తుంది.

రాహీ అనిల్ బర్వే ఎగ్జిట్: అధికారికంగానే..

తుంబాడ్ రీ–రిలీజ్ సమయంలో తుంబాడ్ 2 అనౌన్స్ చేసిన వెంటనే, డైరెక్టర్ రాహీ అనిల్ బర్వే ఓ నోట్ ద్వారా తాను సీక్వెల్‌లో భాగం కాదని ప్రకటించాడు. అదే సమయంలో తన తర్వాతి ప్రాజెక్ట్స్‌గా Gulkanda Tales, Raktabrahmand లాంటి వెబ్ సిరీస్‌లు, ఫిల్మ్స్ గురించి చెప్పాడు.

అంటే, తన ఫోకస్ ఇప్పుడు తన స్వంత ట్రైలజీ, కొత్త యూనివర్సెస్ మీద అని క్లియర్ సిగ్నల్ ఇచ్చాడు. పబ్లిక్ లెవెల్‌లో చూసుకుంటే, ఇది క్లీనుగా, కోర్డియల్ ఎగ్జిట్ లా కమ్యూనికేట్ చేశారు. సోహమ్ షా కూడా పబ్లిక్‌గా అతనికి విషెస్ చెప్తూ, ట్విట్టర్ (X) లో “మేరే భాయ్” అంటూ రిప్లై ఇచ్చాడు. అయితే ఓపెన్‌గా “ఫైట్” అంటూ ఎవరూ చెప్పకపోయినా, రాహీ సైలెంట్‌గా బయటకు రావడం, సోహమ్ లీడ్ తీసుకోవడం – ఇది పవర్ డైనమిక్స్ మార్పు సంకేతం.

ఆనంద్ గాంధీ – “నేను పార్ట్ ఆఫ్ సీక్వెల్ కాదు” అనేసరికి… ఇంకా హాట్ టాపిక్ అయ్యింది ఆనంద్ గాంధీ తాజా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో: “నాతో పాటు నా ఒరిజినల్ క్రియేటివ్ కొలాబరేటర్స్ ఎవరూ తుంబాడ్ 2 లో భాగం కావడం లేదు” అని స్పష్టంగా చెప్పాడు. అందుకే ఈ సీక్వెల్‌ను “మేమంతా కలిసి చేసిన సినిమాకు డైరెక్ట్ కంటిన్యుయేషన్‌గా భావించడం నాకు ఎమోషనల్‌గా కష్టం” అన్నాడు. అయినప్పటికీ, ఫ్యాన్స్‌తో ఉన్న ఆ ఎమోషనల్ కనెక్షన్‌ను గౌరవిస్తే చాలు అని హోప్ వ్యక్తం చేశాడు.

“ఫాల్‌ అవుట్ లేదు” అని చెప్తున్న సోహమ్ షా

సోహమ్ షా మాత్రం ఇంటర్వ్యూలో స్పష్టంగా: “రాహీతో ఎలాంటి ఫాల్‌అవుట్ లేదు, అతను ఇప్పటికీ నా జీవితంలో కీలక వ్యక్తే” అని చెప్పారు.ఈ స్టేట్‌మెంట్‌తో మూడ్ రీ సెట్ అవుతుందా? పబ్లిక్ మాత్రం “అందరూ ఫ్రెండ్లీ, అందరూ హ్యాపీ, జస్ట్ డిఫరెంట్ పాత్స్.” అని చెప్పినా నమ్మలేం అంటున్నారు. వారు సోషల్ మీడియాలో డైరక్ట్ గా క్వచ్చిన్ చేస్తున్నారు. “ఎందుకు ఒరిజినల్ టీమ్‌ను బయట పంపారు?, ఏదైనా అంతర్గత వివాదమా?” అని అయితే ఇప్పటివరకు క్లారిటీ లేదు.

ఫ్యాన్స్ నుండి వచ్చే రియాక్షన్లు మరో లేయర్ చూపిస్తున్నాయి: “రాహీ లేకుంటే తుంబాడ్ 2 చూడాలన్న ఆసక్తి తగ్గింది”. “ఒరిజినల్ డైరెక్టర్ లేని సీక్వెల్‌పై నమ్మకం లేదు” అని కామెంట్లు వెల్లువెత్తాయి. అంటే ఫ్యాన్ పర్సెప్షన్ లెవెల్‌లో, ఇది క్లియర్‌గా “ఓనర్షిప్ క్రైసిస్.”

రిస్క్ #1

తుంబాడ్ గొప్పదనంలో సగం “అత్యాశ”ని మిథ్‌గా చూపిన ఫిలాసఫీ. అది: లొకల్ ఫోక్‌లోర్, క్లాస్, కాస్టు, కేపిటలిజం మీద సబ్టిల్ కామెంటరీ, డీప్ విజువల్ సింబలిజం కలగలిపి వచ్చింది. అదే ఫిలాసఫికల్ డెప్త్‌ని రీ–క్రియేట్ చేయడం తాజా టీమ్‌కు బిగ్ ఛాలెంజ్. చిన్న పొరపాటు చేస్తే, సినిమా “సాధారణ మిథలాజికల్ హారర్” లాంటిదై పోయే ఛాన్స్ ఉంది.

రిస్క్ #2 – విజువల్ లాంగ్వేజ్ మారిపోతే?

తుంబాడ్‌లో: కంటిన్యూగా కురిసే వర్షం, స్లో–పేస్డ్ ట్రాకింగ్ షాట్స్,, ప్రాక్టికల్ సెట్స్‌లో షూట్ చేసిన, చేతిలో తడిగా ఉన్నట్టు అనిపించే విజువల్స్ –

ఇవి అన్నీ కలిపి ఒక యూనిక్ టెక్స్చర్ ఇచ్చాయి. సీక్వెల్ ల ో మరింత CGI–హెవీ, స్టూడియో–ఫ్రెండ్లీ లుక్‌కు వెళ్లితే,విపరీతమైన లాస్ ఆఫ్ ఇమర్షన్ ఫీల్ రావొచ్చు. కథ బాగున్నా, “ఇది మనకు తెలిసిన తుంబాడ్ కాదు” అన్న ఎమోషన్‌కి దారితీస్తుంది.

ఏదైమైనా

“ఒక కొత్త–తరం ఇండియన్ ఆర్ట్–హౌస్ హారర్ మైలురాయి”కి వచ్చిన ఐడెంటిటీ క్రైసిస్ ఇది. ఒక “Ship of Theseus”–టైపు ప్రశ్న:

క్రియేటివ్ క్రూ మారిపోయిన తర్వాత కూడా, అదే బ్రాండ్ ఉన్నా అది ఇంకా “తుంబాడ్” నేనా? ఒరిజినల్ టీమ్ లేకుండా సీక్వెల్ చేయడం: హాలీవుడ్‌లో కూడా చూశాం – Alien 3, కొన్ని Terminator పార్ట్స్, Bourne సిరీస్‌లో, ఒరిజినల్ వాయిస్ దూరమైనప్పుడు క్వాలిటీ, బాక్స్ ఆఫీస్ రెండూ ఎఫెక్ట్ అయ్యాయి. కానీ మరోవైపు, కొత్త టీమ్‌లు వచ్చి, ఫ్రాంచైజ్‌ను రీ–ఇమాజిన్ చేసిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. కాబట్టి తుంబాడ్ 2 ఆ మాయను మళ్లీ సృష్టిస్తే – ఒరిజినల్ టీమ్ బయట ఉన్నా, ఫ్యాన్స్ వాటిని క్షమించేస్తారు. కొత్త సీక్వెల్ ని ఆదరిస్తారు.

Tags:    

Similar News