క్రేజీ సైన్స్ ఫిక్షన్ : 'ప్రాజెక్ట్ Z' (ఆహా) మూవీ రివ్యూ!

సందీప్ కిషన్ కొంతకాలం క్రితం తమిళంలో చేసిన చిత్రం 'మాయావన్' .ఈ సినిమా ఇప్పుడు తెలుగులో ప్రాజెక్టు 'ప్రాజెక్ట్ Z' టైటిల్ తో డబ్బింగ్ అయ్యి వచ్చింది.

Update: 2024-06-01 17:51 GMT

సందీప్ కిషన్ కొంతకాలం క్రితం తమిళంలో చేసిన చిత్రం 'మాయావన్' . అక్కడ బాగానే వర్కవుట్ అయిన ఈ సినిమా ఇప్పుడు తెలుగులో ప్రాజెక్టు 'ప్రాజెక్ట్ Z' టైటిల్ తో డబ్బింగ్ అయ్యి వచ్చింది. సైన్స్ ఫిక్షన్ జోనర్‌గా నడిచే ఈ సినిమాలో మన తెలుగుకు పరిచయం ఉన్న చాలా మంది నటులు ఉన్నారు. అలాగే హీరోయిన్‌గా లావణ్య త్రిపాఠి కూడా కనిపిస్తుంది. అలాగే ఒక కీలకమైన పాత్రలో జాకీష్రాఫ్ కనిపిస్తాడు. ఈ చిత్రం 'ఆహా 'లో అందుబాటులోకి వచ్చింది. తాజాగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా, ఎలా ఉందో చూద్దాం.

స్టోరీ లైన్

చైన్నైలో పోలీస్ ఆఫీస్ గా పనిచేసే కుమార్ (సందీప్ కిషన్) కి చిన్నప్పటి నుంచి రక్తం చూస్తే భయం. అయితే పోలీస్ అవ్వటంతో రక్తం చూడకతప్పదు. ఈ క్రమంలో ఓ సారి ఓ మర్డర్ జరగటం చూసి ఆ హంతకుడిని పట్టుకుందామనుకుంటే అతను చనిపోతాడు. దాంతో అతన్ని కొంతకాలం పాటు డిపార్ట్‌మెంట్ ప్రక్కన పెడుతుంది. దాంతో సైకాలజిస్ట్ అనిత ( లావణ్య త్రిపాఠి) దగ్గర ట్రీట్‌మెంట్ తీసుకుంటూ ఉంటాడు. ఆ తరువాత డ్యూటీలో చేరిన కుమార్ కి ఒక కేసు చాలెంజ్‌గా మారుతుంది.

సిటీలో వరస హత్యలు జరుగుతూంటాయి. అయితే మర్డర్ చేసిన ప్రదేశంలో హంతకుడు రక్తం అంటిన తన చేతులను అక్కడి గోడకి రాస్తుంటాడు. ఆ రక్తం చూడగానే కుమార్ అదోలా అయిపోతుంటాడు. ఆ మర్డర్స్ విషయం ఇన్విస్టిగేట్ చేస్తే ... చనిపోయిన వాళ్లంతా కొన్ని రోజుల ముందు వింతగా ప్రవర్తించారనే విషయం కుమార్ పరిశోధనలో తేలుతుంది. ఆ విషయాలను దృష్టిలో పెట్టుకునే అతను ఈ మర్డర్స్ ని ఛేదిద్దామని ముందుకు వెళ్తాడు. ఆ క్రమంలో అతను 'రుద్ర'ను కలుస్తాడు. గతంలో చనిపోయినవారి లక్షణాలు అతనిలో కనిపిస్తాయి. దాంతో కుమార్ అలర్ట్ అయ్యి అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి మానసిక వైద్యుడిని ఏర్పాటు చేస్తాడు.

అయితే ఇక్కడే ట్విస్ట్ పడుతుంది. రుద్రను సంతకం పెట్టమంటే ప్రమోద్ అని సైన్ చేస్తాడు. దాంతో షాక్ అయిన కుమార్ అసలు ప్రమోద్ ఎవరు.. రుద్ర తన పేరు కాకుండా ప్రమోద్ అని సంతకం పెట్టడం ఏంటని పరిశోధన మొదలెడతాడు. ఈ క్రమంలో అనేక షాకింగ్ విషయాలు రివీల్ అవుతాయి. అవి ఏమిటి.. ఎందుకు చనిపోయే వాళ్లంతా వింతగా ప్రవర్తిస్తున్నారు. అసలు ఆ మర్డర్స్ వెనక అసలు మోటివ్ ఏమిటి. జాకీష్రాఫ్ పాత్ర ఈ కథలో ఏమిటి.... 'ప్రాజెక్ట్ z` అనే టైటిల్ జస్టిఫికేషన్ ఏమిటి అనే విషయాలు ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. అవేంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఇదో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్. క్లూ ఇచ్చేస్తే సినిమా చూసేటప్పుడు ఇంట్రస్ట్ ఉండదు కాబట్టి చర్చించటం లేదు. ఓ కొత్త విషయాన్ని ఈ సినిమాలో చెప్పేందుకు దర్శకుడు ప్రయత్నిస్తాడు. అది సాధ్యమా అసాధ్యమా అనేది ప్రక్కన పెడితే ఇంట్రెస్టింగ్‌గా సాగే కాన్సెప్ట్ ఇది. అయితే కాస్తంత సినిమా చూసేటప్పుడు వేరే డైవర్షన్స్ లేకుండా చూడాలి. లేకపోతే కన్ఫూజ్ అవుతాము. అలాగే రెగ్యులర్ సినిమా టైప్‌లో హీరో, హీరోయిన్ రొమాన్స్ వంటివి ఉండవు. కామెడీ అసలు లేదు. ఇన్విస్టిగేషన్‌ని ఫాలో అవుతూ చూడాల్సిందే.

టెక్నికల్‌గానూ సినిమా ఇంట్రస్టింగ్ గా ఉంది. నటీనటుల్లో సందీప్ కిషన్ ఫర్‌ఫెక్ట్ ఆప్షన్. లావణ్య త్రిపాఠి ఓకే అనిపిస్తుంది. ఇక గోపీ అమర్నాథ్ ఫొటోగ్రఫీ .. గిబ్రాన్ నేపథ్య సంగీతం .. లియో జాన్ పౌల్ ఎడిటింగ్ మంచి సింక్‌లో ఉన్నాయి. స్క్రిప్టు పరంగా సెకండాఫ్ బాగా రాసుకున్నారు.

చూడచ్చా..

ఇంట్రెస్టింగ్‌గా సాగే ఈ సైన్స్ ఫిక్షన్ క్రైమ్ థ్రిల్లర్ అద్భుతం అని చెప్పలేం కానీ నిరాశపరచదు. చూస్తున్నంత సేపు ఎంగేజ్ చేస్తుంది. అయితే సైన్స్ ఫిక్షన్ పై ఆసక్తి లేనివాళ్లు మాత్రం దూరం పెట్టడం మంచిది.

ఎక్కడ ఉంది

ఆహా ఓటీటీలో తెలుగులో ఉంది.

Tags:    

Similar News