జేమ్స్ కెమెరూన్ ‘అవతార్- 3’ మూవీ రివ్యూ
పాత ఫార్ములా, కొత్త ప్రపంచం
సెకండ్ పార్ట్ అవతార్: ది వే ఆఫ్ వాటర్’ లో జేక్ సల్లీ (శ్యామ్ వర్తింగ్టన్), నేతిరి (జో సల్డానా) జంట తమ పెద్ద కొడుకును కోల్పోయి ఉంటారు. దాంతో వారు తీవ్రమైన విషాదంలో ఉంటారు. వారి పిల్లలైన కిరి (సిగౌర్నీ వీవర్), లోక్ (బ్రిటన్ డాల్టన్), టూక్ (ట్రినిటీ జో-లి బ్లిస్)తో పాటు దత్త పుత్రుడు లాంటి స్పైడర్ (జాక్ ఛాంపియన్)తో కలిసి లైఫ్ లీడ్ చేస్తూంటారు. మరో ప్రక్క లోక్ కూడా తన వల్లే సోదరుడు మరణించాడని బాధపడుతూ ఉంటాడు.
ఇదిలా ఉండగా రెండో భాగంలోనే మరణించిన కల్నల్ క్వారిచ్ (స్టీఫెన్ లాంగ్).. నావీ తెగకు చెందిన వ్యక్తిలా మళ్లీ జీవం పోసుకొంటారు. అతని ఏకైక లక్ష్యం సల్లీపై ప్రతీకారామే. అతనికి ఈ సారి వాయువుకు అగ్ని తోడైనట్లు... అగ్ని తెగకు చెందిన నాయకురాలు వరంగ్ (ఊనా చాప్లిన్) తోడవుతుంది. ఆమెకు సల్లీ కుటుంబం విశ్వసించే ఈవా దేవత అంటే పిచ్చ కోపం. ఈ క్రమంలో ఆమె కల్నల్ క్వారిచ్ తో కలుస్తుంది. అతని వద్ద నుంచి అత్యాధునికమైన ఆయుధాల్ని ఎలా వాడాలో వరంగ్ తెలుసుకునే ప్రయత్నిస్తూంటుంది.
అలా సల్లీ శత్రువులు ఇద్దరు కలిసి అతని కుటుంబంపైనా, పండోరా గ్రహంలో ఉన్న ఇతర తెగలని నాశనం చేయాలని బయిలుదేరతారు. ఇది చాలదన్నట్లు పండోరాని నాశనం చేయాలనే లక్ష్యంతో ఉన్న ఆర్డీఏ టీమ్ కూడా వీళ్లకు తోడవుతుంది. వీళ్లందరిని జేక్ సల్లీ కుటుంబం ఎలా ఎదుర్కొంది? చివరికి ఎవరు పైచేయి సాధించారన్నది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే!
ఎనాలసిస్ ...
కెమెరూన్ ఈ సినిమాలో ఏమి చూపించాడు కంటే, ఎందుకు అలా చూపించాడు అన్నదే ఎప్పుడూ ఆసక్తికరం. ముఖ్యంగా ఈ సినిమాని ఒక్క ముక్కలో చెప్పాలంటే... “విజువల్స్‌తో కథను మోసే సినిమా ఇది.”
Avatar (2009) ఒక సింపుల్ కథని రివల్యూషనరీ వరల్డ్‌తో చెప్పారు.
The Way of Water భావోద్వేగాల్ని టెక్నాలజీతో కలిపారు.
Fire and Ash మాత్రం – స్క్రీన్‌ప్లే కన్నా సెన్సరీ ఎక్స్‌పీరియన్స్‌ను ఎంచుకుంది. ఓ రకంగా ఇది సేఫ్ గేమ్.
స్క్రీన్‌ప్లే స్ట్రాటజీ: “థీమ్ రిపీట్, కాని ఫ్లేవర్ మార్పు”
సినిమా ప్రారంభంలో కామెరూన్ మళ్లీ ఫ్యామిలీ అనే ఎమోషనల్ యాంకర్‌ను పట్టుకుంటాడు. జేక్, నేటిరి కుటుంబం చుట్టూనే కథ మొదలవుతుంది. ఇది కొత్త కాదు కానీ అవతార్ ప్రపంచానికి ఇదే భావోద్వేగ మూలం. స్క్రీన్‌ప్లే ఓపెనింగ్‌లో పెద్ద ఎక్స్‌పోజిషన్ లేకుండా, పరిచయమైన థీమ్స్‌తోనే ప్రేక్షకుడిని పాండోరాలోకి తీసుకెళ్తుంది. ఇక్కడ కామెరూన్ తత్వం స్పష్టంగా కనిపిస్తుంది. ఒకసారి స్టీవెన్ స్పీల్‌బర్గ్ చెప్పినట్టు, ప్రేక్షకుడికి ముందే తెలిసిన భావనల్ని కొత్త దృశ్యాలతో చూపిస్తే, వాళ్లు ఆ ప్రపంచాన్ని వెంటనే అంగీకరిస్తారు. అదే పని ఇక్కడ జరుగుతుంది.
ఈ సినిమా స్క్రీన్‌ప్లేలో కొత్తదంటూ ఏమీ లేదు. కుటుంబం. ఐక్యత. ఆక్రమణ. ప్రతిఘటన. కథకు కొత్త కాన్ఫ్లిక్ట్ ఇవ్వకుండా, పాత కాన్ఫ్లిక్ట్‌ని కొత్త ల్యాండ్‌స్కేప్‌లో పెట్టాడు దర్శకుడు. Ash Tribe – కథను ముందుకు నడిపే ప్లాట్ డివైస్ కాదు.అది టోన్ చేంజ్ టూల్ . ఎమోషన్ కన్నా సర్వైవల్‌పై ఫోకస్ ఈ సినిమాకు ఎంచుకున్న థీమ్ లైన్. ముఖ్యంగా వరాంగ్ క్యారెక్టర్ ఈ స్క్రీన్‌ప్లేలో ఎనర్జీ ఇంజెక్షన్ లాంటింది. మిడ్ పోర్షన్ వరాంగ్ పాత్ర మీదనే పనిచేసిందంటే అతిశయోక్తి కాదు. ఆమె పాత్ర స్క్రీన్‌ప్లేలో “డైనమిక్ అబ్స్ట్రాక్ట్”లా ఉంటుంది. పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేయరు. పూర్తిగా ఎమోట్ చేయరు.
నోలన్ అంటారు ఓ చోట “The most powerful characters are the ones the script refuses to explain.” – Christopher Nolan (screenwriting philosophy)
Varang స్క్రీన్ ప్రెజెన్స్ వల్లే కథలో టెన్షన్ వస్తుంది. కాని… స్క్రీన్‌ప్లే ఆమెను ఫుల్‌గా వాడుకోదు. మరో ఇంట్రస్టింగ్ ఎలిమెంట్ ఏమిటంటే... ఆమె కథను మార్చే క్యారెక్టర్ కాదు. కథలో కలర్ మార్చే క్యారెక్టర్ మాత్రమే.
ఇక సెకండ్ హాఫ్ ప్రాబ్లమ్: ప్రెడిక్టబిలిటీ... ఇక్కడే Cameron సేఫ్ మోడ్‌లోకి వెళ్తాడు. ముఖ్యంగా క్లైమాక్స్ బీట్స్ చాలా రొటీన్ బీట్స్ తో నిండి ఉంటుంది. చాలా సినిమాల్లో లాగానే.. కుటుంబం ప్రమాదంలో పడుతుంది. ఆ తర్వాత త్యాగం, భావోద్వేగ విజయం, భవిష్యత్తుకు హింట్ ఇవి వరస పెట్టి వచ్చేస్తాయి.
ఒక్కటే గుర్తు పెట్టుకోవాలి ఇది స్క్రీన్‌ప్లే బేస్ ఫిల్మ్ కాదు...ఇది డైరెక్టర్ మైండ్‌స్కేప్ సినిమా. Cameron ఇక్కడ అదే నమ్మకం మీద ఉన్నాడు. షార్ప్‌నెస్, స్కేల్, మోషన్, ఇమర్షన్. The Way of Water కన్నా కూడా ఒక లెవల్ పైకి వెళ్తాడు. యాక్షన్ సీన్స్ కథను ముందుకు నడపవు. కానీ ప్రపంచాన్ని లోతుగా ఫీలయ్యేలా చేస్తాయి. Pandora ఇప్పటికీ – సినిమా థియేటర్‌కు రాసిన ప్రపంచం.
పర్ఫార్మెన్సుల విషయానికి వస్తే...
సామ్ వర్తింగ్టన్ జేక్ పాత్ర లో సామ్ వర్తింగ్టన్... పైకి సైలెంట్ గా ఉన్నా లోపల కుతకుతలాడే కుటుంబ పెద్దగా బాగా చేసారు. జోయ్ సల్డానా నేటిరిగా భావోద్వేగ బరువును మోస్తుంది. ఆమె సీన్స్ కొన్ని సినిమాకే ప్రాణంగా నిలుస్తాయి. స్పైడర్, జేక్ కూతురు పాత్రలకు ఇచ్చిన ఫోకస్ భవిష్యత్తులో వచ్చే సీక్వెల్స్ కు స్పష్టమైన హింట్‌లా పనిచేస్తుంది. ఇది సాగాను కొనసాగించడానికి స్క్రీన్‌ప్లే వేసిన బ్రిడ్జ్.
టెక్నికల్ గా ...
లెంగ్త్ కొంత తగ్గించాల్సింది. నిడివి చాలా ఎక్కువగా (దాదాపు 3 గంటల 17 నిమిషాలు) ఉండడంతో .. చాలా సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. ముఖ్యంగా ఫస్టాఫ్ ప్రేక్షుకుడి సహనానికి పరీక్షే. వచ్చిన సీన్స్ మళ్లీ మళ్లీ రిపీట్ అవటంతో .. కథ అక్కడక్కడే తిరగుతున్నట్లు అనిపిస్తుంది. అవి సరిదిద్దుకోవాల్సింది. రస్సెల్ కార్పెంటర్ సినిమాటోగ్రఫీ సినిమాకు మరో పెద్ద ప్లస్. సైమన్ ఫ్రాంగ్లెన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రాణం పోసింది.
ఫైనల్ థాట్
ఏదైమైనా Avatar: Fire and Ash కొత్త కథతో వావ్ అంటూ నోరు తెరిపించదు. కానీ విజువల్స్‌తో నోరు మూసేయిస్తుంది. జేమ్స్ కెమెరూన్ ఈసారి కథ దగ్గర రిస్క్ తీసుకోలేదు. “ఇంతకు ముందు పనిచేసిందే మళ్లీ పనిచేస్తుంది” అనే ఫార్ములాకే స్టిక్ అయ్యాడు.
కథ తెలిసినదే. ఎమోషన్ కూడా ముందే ఊహించేదే. కానీ స్క్రీన్ మీద పాండోరా కనిపించిన క్షణం నుంచే లాజిక్ సైలెంట్ అవుతుంది… కళ్ళు పని మొదలుపెడతాయి.
మొత్తానికి… ఇది బ్రెయిన్‌కి పని పెట్టే సినిమా కాదు.హృదయాన్ని కుదిపేసే సినిమా కూడా కాదు. కానీ కళ్ళకి పండగ, చెవులకు విందు. కథ కోసం వెళ్తే నిరాశ తప్పదు. సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ కోసం వెళ్తే మాత్రం మంచి సంతృప్తి ఖాయం.