50 ఏళ్ల తర్వాత థియేటర్లలో రీ-ఎంట్రీ.. 'షోలే' మళ్లీ వచ్చేస్తోంది!

నోస్టాల్జియా... ఇప్పుడు 4K లో...!!;

Update: 2025-06-28 02:30 GMT

"కిత్నే ఆద్మీ థే?" అనే డైలాగ్ చెప్పగానే… ఇప్పటికీ థియేటర్లో చప్పట్లొచ్చేంత పవర్ ఉన్న సినిమా షోలే. 1975లో విడుదలై, భారత సినిమా చరిత్రనే మార్చేసిన లెజెండరీ ఫిల్మ్ ఇది.

వీరు – జై, గబ్బర్ సింగ్, తాకూర్… ప్రతి పాత్ర ఓ ఐకానిక్ ఫిగర్. ప్రతి సీన్ ఓ సాంస్కృతిక గుర్తుగా మారిపోయింది. అలా చెప్పాలి – ‘షోలే’ అనేది ఒక సినిమా కాదు… ఒక ఎమోషన్!

ఇప్పుడు అదే శక్తితో – అదే మహిమతో – షోలే మళ్లీ మినిపించేందుకు రంగం సిద్ధమవుతోంది! దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత ఈ అల్‌టైం క్లాసిక్‌ను తిరిగి థియేటర్లకు తీసుకురావడానికి భారీ స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఐదు దశాబ్దాల తర్వాత ఈ సినిమా గ్రాండ్ రీ-రిస్టోరేషన్, పాన్ ఇండియా, ఇంటర్నేషనల్ ప్రీమియర్స్ వంటి ప్లాన్‌లతో థియేటర్లకు మళ్లీ వస్తుండటం ఒక చారిత్రక క్షణంగా చెప్పొచ్చు

షోలే: ఓ సినిమాతో దేశం ఊగిన రోజులు!

70వ దశకంలో బాలీవుడ్‌ను రిషికేశ్ ముఖర్జీ తీసిన ఫ్యామిలీ డ్రామాలు, యష్ చోప్రా ప్రేమ కథలు ఆకట్టుకునేవి. కానీ 'షోలే' ఆ పరిమితులను చెరిపేసింది. ఆ సినిమా ఒక పూర్తి స్థాయి అనుభవం… ఒక్క పదంలో చెప్పాలంటే – సినిమా అంటే ఇదే!

ఇది ఒక వెస్ట్రన్ స్టైల్ మసాలా డ్రామా –

అందులో యాక్షన్ ఉంది… ఎమోషన్ ఉంది… కామెడీ ఉంది… గాఢమైన స్నేహం ఉంది… ప్రతీకారం ఉంది!

వీరు – జై అనే స్నేహితుల ద్వయం,

గబ్బర్ సింగ్ అనే క్రూరమైన విలన్,

ఠాకూర్ అనే బాధతో నిండిన మాజీ పోలీస్,

బసంతీ అనే చిలిపి అమ్మాయి –

ఇలా ఒక్కో పాత్ర భారతీయ పాపులర్ కల్చర్‌లో చెరగని ముద్ర వేసింది.

ఈ పాత్రలు అప్పటి సినిమా స్క్రీన్ మీద మాత్రమే కాకుండా, నేటికీ ప్రజల మాటల్లో, మన జీవితాల్లో, పాత జ్ఞాపకాలే కాదు – పండగల నాటి టీవీ బ్రాడ్‌కాస్టుల్లోనూ చోటు సంపాదించుకున్నాయి.

ఇప్పుడు షోలే పాన్ ఇండియా

ఈసారి కేవలం హిందీలో కాదు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ సహా ఇతర ప్రాంతీయ భాషలలో కూడా 'షోలే'ని విడుదల చేయాలని ఆలోచన. మల్టీప్లెక్స్ జనరేషన్‌కి కూడా ఈ సినిమా ఏ రేంజ్‌లో నచ్చుతుందో చూడాలి.

బాలీవుడ్‌ను కూడా తాకిన రీ-రిలీజ్ ట్రెండ్

టాలీవుడ్‌లో స్టార్ట్ అయిన రీ-రిలీజ్‌ల ట్రెండ్ ఇప్పుడు బాలీవుడ్‌కూ ఎక్కిపోయింది. రీసెంట్‌గా పాత సినిమాల రీ-రిలీజ్‌లు అక్కడ మంచి ఆదరణ అందుకున్నాయి. కొత్త సినిమాలు లేకున్నా, nostaligia వర్కౌట్ అవుతోందన్న అర్థం.

ఇటీవల టాలీవుడ్‌లో ‘ఒక్కడు’, ‘చిరుత’, ‘గబ్బర్ సింగ్’ వంటి రీ-రిలీజ్‌లకు వచ్చిన స్పందన చూసిన తర్వాత బాలీవుడ్‌లో కూడా ఈ ట్రెండ్ ఊపందుకుంది. కానీ షోలే మాత్రం సాధారణ రీ-రిలీజ్ కాదనిపించేలా ప్లాన్ చేస్తున్నారు.

మూడు ఏళ్లుగా జరుగుతున్న ప్రిపరేషన్!

షోలే రీ-రిలీజ్ కోసం గత మూడు సంవత్సరాలుగా ప్లానింగ్ జరుగుతోంది. లండన్‌ లోని స్టూడియోలు, ఇండియా ల్యాబ్స్‌ అన్నీ కలిపి... ఉత్తమ క్వాలిటీలో రీస్టోరేషన్ పనులు జరుగుతున్నాయి. కేవలం డిజిటలైజేషన్‌ మాత్రమే కాదు – ప్రతి ఫ్రేమ్‌ను శుద్ధి చేసి, నూతన తేజంతో తయారు చేస్తున్నారు.

మొదట ఇటలీలో ప్రీమియర్, తరువాత పాన్ ఇండియా విడుదల

ఈ ప్రతిష్టాత్మక రీ-రిలీజ్‌ను ముందుగా ఇటలీలో ప్రీమియర్ చేయనున్నారు. అంతర్జాతీయంగా సినిమాకు ఉన్న క్రేజ్‌ను క్యాష్ చేసేందుకు బాలీవుడ్ ప్రముఖులను ప్రత్యేక విమానంలో అక్కడికి తీసుకెళ్లే ఏర్పాట్లు చేస్తున్నారు. తర్వాతే భారతదేశం వంతు. ఇక్కడ కూడా ఈ సినిమా విడుదలను ఒక పండుగలా ప్లాన్ చేస్తున్నారు.

కేవలం హిందీలో కాకుండా – పాన్ ఇండియా స్థాయిలో, అనేక భాషల్లో 'షోలే'ని మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు.

ఓ మారు కీర్తి... మరోసారి సగౌరవంగా

పాత తరం సినిమాలకు కొత్త శ్వాసనిస్తోన్న ఈ రీ-రిలీజ్ కల్చర్‌లో షోలేకి ఉండే స్థానం ప్రత్యేకం. ఈసారి ఫస్ట్ డే – ఫస్ట్ షోకు టికెట్ కోసం మరోసారి క్యూలో నిలబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి!

నోస్టాల్జియా... ఇప్పుడు 4K లో వస్తోంది!

గబ్బర్ కం బ్యాక్‌కు సిద్ధమవుతున్నారా?

Tags:    

Similar News