సమంత స్పై థ్రిల్లర్‌ : 'సిటడెల్‌: హనీ బన్నీ' రివ్యూ

వరుణ్‌ ధావన్‌, సమంత కీలక పాత్రల్లో రూపొందించిన ఈ సిరీస్‌ (Citadel: Honey Bunny) ఎలా ఉంది? సమంత అభిమానులకు నచ్చేదేనా చూద్దాం.

Update: 2024-11-08 08:03 GMT

సమంత కేవలం సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సీరిస్ లు సైతం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ‘ఫ్యామిలీమ్యాన్‌’, ‘ఫర్జీ’ వంటి సక్సెస్ ఫుల్ సిరీస్‌లతో అలరించిన దర్శక ద్వయం రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వంలో ఓ సీరిస్ చేసింది. వరుణ్‌ ధావన్‌ (Varun Dhawan), సమంత (Samantha) కీలక పాత్రల్లో రూపొందించిన ఆ సిరీస్‌ ‘సిటడెల్‌: హనీ బన్నీ’. ఓటీటీలోకి వచ్చిన ఈ సిరీస్‌ (Citadel: Honey Bunny) ఎలా ఉంది? సమంత అభిమానులకు నచ్చేదేనా చూద్దాం.

స్టోరీ లైన్

నైనిటాల్ లో ఓ కెఫేలో పనిచేసే హనీ (సమంత) కు నాడియా (కశ్వీ మజ్ముందార్‌) ఐదేళ్ల కూతురు ఉంటుంది. కెఫే కోసం సరకులు తీసుకురావడానికి మార్కెట్‌కు వెళ్లిన హనీని ఓ వ్యక్తి వెంబడిస్తాడు. అది గమనించి అతని నుంచి తప్పించుకుందామనుకుంటుంది. కానీ ఈ క్రమంలో హనీ పట్టుబడుతుంది. అయినా కష్టపడి వారినుంచి తప్పించుకుని తన కుమార్తెను తీసుకుని వేరే ఊరికి వెళ్తుంది. అయితే హనీ ఉన్న ప్రదేశం తెలుసుకుని కొందరు వ్యక్తులు అక్కడికి కూడా వస్తారు.

ఇదిలా ఉంటే చనిపోయిందనుకున్న తన భార్య హనీ బతికే ఉందన్న విషయం ఎక్కడో విదేశాల్లో ఉన్న బన్నీ (వరుణ్‌ ధావన్‌)కి తెలుస్తుంది. దీంతో హనీని వెతుక్కుంటూ ఇండియాకు వస్తాడు. పాపను ఎత్తుకుపోవడానికి ట్రై చేస్తారు. ఇంతకీ హనీ వెంట పడుతున్న వాళ్లు ఎవరు? హనీ అంతలా మెరికలా వాళ్లతో ఎలా పోరాడుతుంది, అసలు ఎవరామె? తన భార్యను వెతుక్కుంటూ వచ్చిన బన్నీ, తన భార్యని కలవగలిగారా. ? చివరకు హనీ , ఆమె కూతురు నాడియా ఏమయ్యారు? అలాగే ప్రైవేటు సీక్రెట్‌ ఏజెన్సీ నాయకుడు గురు (కేకే మేనన్‌) ఎవరు, వాళ్ల టీమ్ వెతుకుతున్న అర్మార్డ్‌ అనే వస్తువు సంగతి ఏమిటి? చివరకు ఏమైంది? వంటి వివరాలు తెలియాలంటే సిరీస్‌ చూడాల్సిందే!

ఎలా ఉంది

ఇలాంటి సీరిస్ లకు, సినిమాలకు ట్విస్ట్ లు ప్రధానం. అవి ఎలా పే ఆఫ్ అయ్యాయి అనేదానిపై సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో మాగ్జిమం డైరెక్టర్ రాజ్, డీకే లు జాగ్రత్తపడ్డారు. అయితే కొన్ని చోట్ల ప్రిడిక్టబుల్ గా మారిపోయింది. . ప్రతి ఎపిసోడ్‌ను రెండు భాగాలుగా విభజించటం కాస్త కన్ఫూజన్ కు గురి చేస్తుంది. ఒకటి 1992లో మరొకటి 2000 సంవత్సరంలో జరుగుతున్నట్లు చూపిస్తూ నాన్‌-లీనియర్‌ స్క్రీన్‌ప్లేతో కథను నడిపించాలనే ప్రయత్నం కాస్త ఇబ్బందే పెట్టింది.

ప్రస్తుతం జరిగే కథ, అందులోని పాత్రలకు ఉన్న ఫ్లాష్‌ బ్యాక్‌ ఏంటనేది పూర్తిగా అర్దమయ్యే దాకా గందరగోళంగానే అనిపిస్తుంది. ఇక ప్రారంభంలోనే కథలోకి వచ్చినట్లు అనిపించినా మొదటి రెండు ఎపిసోడ్‌లలో సిరీస్‌లోని కీలక పాత్రలు, వారి నేపథ్యాలు పరిచయం చేయడం కోసం మొత్తం టైమ్ తీసుకున్నారు. దాంతో అక్కడేమీ జరిగినట్లు అనిపించదు. మూడో ఎపిసోడ్ దాకా కథలోకి వెళ్లలేదు. కొన్ని సీన్స్ లో ఎమోషన్ ప్రధానమైన టోటల్ గా యాక్షన్ డామినేట్ చేసింది. స్క్రిప్ట్ ఇంకాస్త బలంగా రాసుకుంటే బాగుండేది అనిపించింది. ఏ పాత్రకీ మనని పూర్తిగా కనెక్ట్ కానివ్వరు డైరక్టర్స్.

ఇక నటీనటుల విషయానికి వస్తే సమంత చాలా బాగా చేసింది. యాక్షన్ సీన్స్ లోనూ అదరకొట్టింది. వరుణ్ ధావన్ కండలు చూపెట్టే పోగ్రామ్ పెట్టుుకున్నారు. అలాగే హనీ కూతురుగా చేసిన నదియా (కాశ్వీ మజుందార్)ని చాలా సహజంగా నటించింది. మరీ ముఖ్యంగా బాబా ఏజెంట్ టీమ్ నుంచి తప్పించుకునే క్రమంలో ఆమె చేసే స్టంట్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. కేకే మీనన్, సికందర్ ఖేర్, సాకిబ్ సలీం, సిమ్రాన్, శివాంకిత్ పరిహార్, సోహమ్ మజుందార్ వంటివారు పాత్రల పరిధి మేరకు నటించారు. సిమ్రాన్ చాలా రోజుల తర్వాత కనిపించింది.

చూడచ్చా

ఈ సీరిస్ ..సమంత కోసం ఓ లుక్కేయవచ్చు.యాక్షన్ సీరిస్ లు, స్పై సీరిస్ లు చూసేవాళ్లకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది.

ఎక్కడుంది

అమెజాన్ ప్రైమ్ లో తెలుగులో ఉంది, ఆరు ఎపిసోడ్

Tags:    

Similar News