యాక్షన్ డ్రామా : 'రిమెంబర్' సౌత్ కొరియన్ ఓటిటి మూవీ రివ్యూ

ఓటీటీలు వచ్చాక దేశం, భాషా అనే తేడా లేకుండా అన్ని సినిమాలు మన లాంగ్వేజ్ లో అందుబాటులోకి వచ్చేస్తున్నాయి.

Update: 2024-07-10 10:56 GMT

ఓటీటీలు వచ్చాక దేశం, భాషా అనే తేడా లేకుండా అన్ని సినిమాలు మన లాంగ్వేజ్ లో అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. దాంతో సినిమా విస్తృతి పెరుగుతోంది. మనవాళ్లు ఇంతకు ముందు కొరియన్ సినిమాలు వెతుక్కుని సబ్ టైటిల్స్ తో చూసేవారు. ఇప్పుడు తెలుగు డబ్బింగ్ లో కొత్త కొరియన్ సినిమాలు సైతం దొరికేస్తున్నాయి. ఈ క్రమంలో ఓటిటిలో రీసెంట్ గా రిలీజైన సౌత్ కొరియన్ చిత్రం 'రిమెంబర్' ఎలా ఉంది..ఈ చిత్రం కథేంటి..మనవాళ్లు చూడదగిన కంటెంట్ తో వచ్చిందా వంటి వివరాలు చూద్దాం.

స్టోరీ లైన్

ఈ కథ బేసిక్ గా ఓ రివేంజ్ స్టోరీ. సౌత్ కొరియాలో జరుగుతూంటుంది. ఎనభై ఏళ్ల హన్ పిల్ జూ (లీ సంగ్ మిన్) నిక్ నేమ్ ఫ్రెడ్డి. వృధ్దాప్య సమస్యలతో బాధపడే అతను ఓ రెస్టారెంట్ లో సర్వర్ గా చేస్తూంటాడు. మెల్లిమెల్లిగా జ్ఞాపక శక్తి కూడా క్షీణిస్తున్న అతనుకి నా అనే వాళ్లు లేరు. తన చుట్టూ ఉన్నవాళ్ళతోనే ఆనందంగా ఉంటూంటాడు. క్రిస్మస్ హాలిడే సీజన్ లో శాంటా డ్రస్ వేసుకుని కస్టమర్స్ ని ఎంటర్టైన్ చేస్తూంటాడు. తన వాళ్లకు అన్యాయం జరిగితే వెళ్లి పోరాడతాడు. అతనికి ఉన్న ఏకైక క్లోజ్ ప్రెండ్ అదే రెస్టారెంట్ లో పనిచేస్తున్న కుక్. అతనో ఇరవై ఏళ్ల కుర్రాడు. అతని పేరు ఇనుగు. అతనో బ్యాచిలర్. ఊరినిండా అప్పులు. ఓ అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. మంచివాడు. అప్పుడప్పుడూ ఫ్రెడ్డి దగ్గర సలహాలు తీసుకుంటూంటాడు. ఇలా జరుగుతూండగా ఓ రోజు ఫ్రెడ్డి రివర్స్ లో అతన్నే ఓ సహాయం అడుగుతాడు.



తనకు కారు డ్రైవ్ చేసిపెట్టాలని, అందుకు డబ్బులు కూడా ఇస్తానని ఆఫర్ చేస్తాడు. అయితే ఎందుకు ఏమిటి అని అడక్కూడదనే కండీషన్ పెడతాడు. మొదట సంశయించినా అతను ఇస్తానన్న ఎమౌంట్ మొత్తం బాగుండటంతో ఓకే చెప్పి ఫ్రెడ్డి తెచ్చిన కొత్త కారులో అతన్ని తీసుకుని బయిలుదేరతాడు. అయితే వర్క్ లో దిగాక అర్దమవుతుంది. ఫ్రెడ్డి బయిలుదేరింది కొందరిని వరసపెట్టి హత్య చేయటానికి. ఆ చంపబోయే వ్యక్తులు కూడా సొసైటిలో పెద్ద స్దాయిలో ఉన్న వాళ్లు. ఆ విషయం ఆ కుర్రాడికి ఒక హత్య జరిగి, రెండో హత్యకు వెళ్లినప్పుడు దాకా తెలియదు.

ఓ ప్రక్కన బ్రెయిన్ ట్యూమర్ కు, అల్జీమర్స్ కు మందులు వాడుతున్న ప్రెడ్డీ ఎవరిని హత్య చేయటానికి బయిలుదేరాడు. వారిని గుర్తు పెట్టుకోవటానికి అతను ఏం చేసాడు. ఈ విషయం తెలిసిన కుర్రాడు ఇనుగు ఎలా రెస్పాండ్ అయ్యాడు. పోలీస్ లకు అతను దొరికిపోయాడా.. ఈ కుర్రాడు కూడా ఇరుక్కున్నాడా..అసలు ఈ హత్యలు అదీ ఎనభై ఏళ్ల వయస్సులో చేయటానికి మోటివ్ ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉంది...

ఇది ఫక్టు రివేంజ్ స్టోరీ. చాలా ప్రెడిక్టబుల్ కథ. అయితే స్క్రీన్ ప్లే తో కొంతవరకూ మాయ చేయగలిగారు. సినిమా ప్రారంభించాక..కథలో పెద్దగా మలుపులు లేకపోయినా అసలు ఎందుకు ఈ హత్యలు చేస్తున్నారనే విషయం తెలుసుకోవటానికైనా చూస్తాము. ఇంతకు ముందు మనం ఇలాంటి కథలు బోలెడు చూసి ఉన్నాము కాబట్టి పెద్ద గొప్పగా అనిపించదు. మరో విషయం ఏమిటంటే...ఈ సినిమా ఇదే టైటిల్ తో వచ్చిన కెనిడియన్ ఫిల్మ్ రీమేక్. యాక్షన్ తో నడిచే ఈ సినిమా రెండో ప్రపంచ యుద్దం సమయంలో జపాన్ -కొరియన్ దేశాల నాటి రాజకీయ పరిస్దితిని చెప్తుంది.

ఇక ఈ సినిమా లో టైట్ స్క్రీన్ ప్లే అని యాక్షన్ ఎపిసోడ్స్ రాసుకున్నా పెద్దగా ఫలితం లేదు. ఎనభైఏళ్ల వృధ్దుడు చేసే హత్యలు, వాటి నుంచి తప్పించుకునే విధానాలే ఇంట్రస్టింగ్ గా అనిపిస్తాయి. అల్జీమర్స్ వ్యాధి ఉండటం వలన తాను ఎక్కడున్నానో అప్పుడప్పుడు మర్చిపోతూంటాడు. హత్యలు చేయాల్సిన వాళ్ల పేర్లు కూడా మర్చిపోతూంటాడు. అలాగే చివర్లో ఒకతన్ని చంపాల్సింది ఉంది అని మిగిలినప్పుడు అతనెవరనే ట్విస్ట్ సినిమా మొత్తానికి టాప్ గా నిలుస్తుంది. అలాగే సిస్టర్, బ్రదర్ ఎమోషన్ సైతం మన మనస్సుకు పడుతుంది.

చూడచ్చా

బోలెడు యాక్షన్, కొద్దిపాటి సెంటిమెంట్ తో నడిచే ఈ సినిమా కొరియన్ సినిమా లవర్స్ కు మాత్రమే కాకుండా యాక్షన్ ప్రియులుకు కూడా నచ్చుతుంది. హింస ఎక్కువగా ఉన్నా, శృంగారం, అసభ్యత లేదు.

ఎక్కడుంది

అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో తెలుగు భాష‌లోనూ అందుబాటులో ఉంది.

ఈ సినిమా స్క్రీనింగ్ టైమ్ లో దర్శకుడు మాట్లాడుతూ..కేవలం ఇదొక రివేంజ్ సినిమా గా కాకుండా గతంలో జరిగింది ఏమిటి...మన చరిత్ర చెప్తున్నది, మనం విన్నది నిజమేనా అని మనని మనం ప్రశ్నించుకోవటానికి కొన్ని ప్రశ్నలతో తీసిన సినిమా ఇది అన్నారు.

Tags:    

Similar News