'మాస్ జాతర' కి ఎంత నష్టరావచ్చు?బ్రేక్ ఈవెన్ ఎంత
ఫస్ట్ మండేకే గేమ్ ఓవర్
రవితేజ, యంగ్ హీరోయిన్ శ్రీలీల జంటగా భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మాస్ జాతర. ఈ సినిమా రిలీజ్‌కు ముందు ఎనలేని బజ్… రవి తేజా – శ్రీలీల కాంబో మళ్లీ వస్తోంది, ‘ధమాకా’ రేంజ్ మాస్ రాంపేజ్ మళ్లీ రిపీట్ అవుతుందా? అన్న హైప్ స్కై లెవల్లో. థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ జోష్ కూడా అదే లెవల్లో. కానీ… రిలీజ్ అయ్యాక పిక్చర్ పూర్తిగా మార్చిపోయింది! సీన్ రివర్స్ అయ్యింది.
డైరెక్టర్ భాను భోగవరపు దర్శకత్వంలో, సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై భారీ ఆశలతో వచ్చిన ఈ సినిమా… మార్నింగ్ షో నుంచే తేడా టాక్ తెచ్చుకుంది. ‘ధమాకా’ వంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చిన రవి తేజా – శ్రీలీల కాంబో కూడా ఈ సారి ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
‘మాస్ జాతర’కి వచ్చిన యూనానిమస్ నెగటివ్ టాక్ & రివ్యూల దెబ్బ బాక్సాఫీస్ వద్ద మొత్తం గేమ్ మార్చేసింది. ఎంత మాస్ ఇమేజ్ ఉన్నా… పబ్లిక్ వర్డ్ ఆఫ్ మౌత్ ముందు పవర్ పడిపోయింది. శుక్రవారం సాయంత్రం ప్రీమియర్స్ నుంచే సినిమా యూనానిమస్ నెగటివ్ రిస్పాన్స్ అందుకుంది. ఈ నెగిటివ్ టాక్, రివ్యూల ప్రభావంతో చిత్రానికి బాక్సాఫీస్ వద్ద మొదటిరోజే గట్టి దెబ్బ తగిలింది.
సాధారణంగా ఇతర సినిమాల మాదిరిగా డిస్ట్రిబ్యూటర్ ఆఫీసుల నుంచి రిలీజ్ అయ్యే నంబర్లు ఈ సినిమాకు రావడం లేదు. అంటే, కలెక్షన్స్ స్థాయి ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. వారం చివరలో కూడా డీసెంట్ నంబర్స్ రాలేకపోయాయి — వీకెండ్ పూర్తిగా వీక్ అయిపోయింది.
తక్కువ రేట్లకే అమ్మారు..కానీ రికవరీ కష్టమే!
ఈ సినిమా కోసం డిస్ట్రిబ్యూటర్లు చాలా తక్కువ రేట్లకే రైట్స్ తీసుకున్నా, ఇప్పుడైతే ఆ మొత్తాన్ని కూడా రికవర్ చేయడం అసాధ్యంగా కనిపిస్తోంది.
బ్రేక్–ఈవెన్ ₹35 కోట్ల గ్రాస్ కావాలి అంటోంది ట్రేడ్ … అంత దూరం సినిమా వెళ్లే అవకాశం కష్టంలా కనిపిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్‌కి ఈ సినిమా భారీ నష్టాలు మిగిల్చే ప్రాజెక్ట్‌గా మారింది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం దాదాపు ₹25 నుంచి 30 కోట్ల వరకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని టాక్.
వీకెండ్ వాల్ హిట్ అయ్యింది… కలెక్షన్లు ఫ్లాట్!
సుమారు ₹11 కోట్ల గ్రాస్ మాత్రమే వీకెండ్‌లో దాటిన ‘మాస్ జాతర’, ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేసిన ఎరప్షన్‌ని చూపలేకపోయింది.
శనివారం రిలీజ్ కావడం వల్ల వీక్‌డేల్లో స్ట్రాంగ్‌గా నిలబడుతుందనే ఆశలు టీమ్ పెట్టుకుంది… కానీ ఆ డ్రీమ్ సోమవారంకే కూలిపోయింది!
ఫస్ట్ మండే షాక్: 1 కోటి కూడా కాదా?
బాక్సాఫీస్‌ని నిర్ణయించే కీలకమైన ఫస్ట్ మండే రోజున, సినిమా కేవలం 1 కోటి కూడా దాటలేదని సమాచారం. రవి తేజా స్టామినా కి ఇది ఒక హెచ్చరిక లాంటి నెంబర్. మంగళవారం కూడా అదే పరిస్దితి కొనసాగింది.
ఇక క్లియర్ — జాతర బజ్ జీరో, టాక్ డిజాస్టర్.
మాస్ జాతర = మిస్ జాతర?
‘మాస్ జాతర’ — పేరు మాస్, హైప్ మాస్, కానీ ఎక్స్‌క్యూషన్ మాత్రం పూర్తిగా మిస్. మొదటి నుంచే నెగెటివ్ బజ్, స్టోరీ బలహీనత, ఎమోషన్ & ఎంటర్‌టైన్‌మెంట్ డిప్… ఇవన్నీ కలిసి సినిమాకి బ్రేక్ వేసాయి. రవి తేజ ఎనర్జీ ఉన్నా, పూర్ రైటింగ్ & ఎగ్జిక్యూషన్ వల్ల సినిమా దెబ్బ తింది.
భాక్సాఫీస్ వద్ద మొదటి వారం నుంచే కష్టాల్లో పడిన ఈ చిత్రం, ఇప్పుడు రికవరీ రూట్ కూడా కనిపించని పరిస్థితి. పెద్దగా పేలాల్సిన జాతర… చివరికి నిశ్శబ్దంగా ముగిసిన జాతరగా మిగిలిపోయింది.