బాక్సాపీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టిస్తున్న రజనీకాంత్
రూ. 250 కోట్ల క్లబ్ లో చేరిన కూలీ చిత్రం;
By : Praveen Chepyala
Update: 2025-08-16 13:43 GMT
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విడుదలైన కూలీ సినిమా బాక్సాపీస్ వద్ద కొత్త రికార్డులు తిరగరాస్తోంది. తొలిరోజు ఈ సినిమా సూపర్ స్టార్ చరిత్రలోనే అత్యధిక ఒపెనింగ్స్ రాబట్టింది. రజనీకాంత్ మునుపటి సూపర్ హిట్ సినిమాలైన జైలర్, 2.0, పెట్టా కంటే ఇది భారీగా కలెక్షన్లు రాబట్టింది.
కూలీ రికార్డు స్థాయి ప్రారంభంతో థియేటర్లలో కేక పుట్టించింది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 151 కోట్లు వసూలు చేసింది. ఇది ఒక తమిళ చిత్రానికి ఇప్పటిదాక వచ్చిన అత్యధిక ఓపెనింగ్స్.
భారతీయ చిత్రపరిశ్రలో ఇది ఏడో స్థానంలో చోటు సంపాదించుకుంది. లోకేష్ కనగరాజ్ ఇంతకుముందు దర్శకత్వం వహించిన ‘లియో’ సినిమాకు తొలి రోజు రూ. 143 వసూలు చేయగా, ఇప్పుడు దర్శకుడి కెరీర్ లో ‘కూలీ’ మొదటి స్థానాన్ని ఆక్రమించింది.
మొదటి రోజు కలెక్షన్..
ఇండస్ట్రీ ట్రాకర్ సాక్నిల్క్ ప్రకారం... కూలీ తన మొదటి రోజున భారత్ లో రూ. 65 కోట్ల నికర వసూళ్లను సాధించింది. ఇది సూపర్ స్టార్ కెరీర్ లో అతిపెద్ద ఒపెనింగ్స్ కలెక్షన్ భారత్ లో లియో పేరు మీద ఉన్న ఒపెనింగ్ కలెక్షన్లను ఇది తుడిచిపెట్టేసింది. అలాగే మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 86.99 శాతం ఆక్యుపెన్సీ రేటును సాధించింది.
2 రోజు..
సాధారణంగా దక్షిణ భారత బ్లాక్ బస్టర్లు వాటి ప్రారంభ రోజు తరువాత భారీగా తగ్గుదలను చూస్తాయి. కానీ కూలీ స్వాతంత్య్ర దినోత్సవ సెలవును సద్వినియోగం చేసుకుంది. అందువల్ల రెండో రోజు కూడా రూ. 53.5 కోట్లు వసూలు చేసింది. మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజు రజనీ దూకుడు కాస్త తగ్గినప్పటికీ మొత్తం మీద బలంగానే నిలిచింది.
విదేశాలలో..
అంతర్జాతీయంగా ఈ చిత్రం మొదటి రోజు విదేశాలలో 8.75 మిలియన్ల గ్రాస్ ను నమోదు చేసి చరిత్ర సృష్టించింది. ఇది చరిత్రలో ఏ తమిళ చిత్రం సాధించలేదు. ఆగష్టు 15 ప్రపంచ సెలవుదినం కాకపోవడంతో అక్కడ కలెక్షన్లు తగ్గాయి.
విదేశాలలో కూలీ రెండు రోజుల్లో రూ. 110 కోట్లు(13 మిలియన్ డాలర్లు) దాటిందని తెలుస్తోంది. దీనితో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రెండు రోజుల్లోనే 250 కోట్ల మార్క్ ను చేరింది. ఈ సంవత్సరం ఏ తమిళం చిత్రం ఈ మార్క్ ను క్రాస్ చేయలేకపోయింది.
3 వ రోజు..
కూలీ సినిమా బాక్సాపీస్ వద్ద తన హవాను కొనసాగిస్తోంది. భారత్ అంతటా కేవలం మూడు రోజుల్లోనే రూ. 123. 48 కోట్ల నికర వసూళ్లను సాధించింది. మూడో రోజు ముగిసే సమాయానికి దేశంలో నికర వసూల్లు రూ. 118. 5 కోట్లుగా ఉన్నాయి.
ఇది ప్రతిష్టాత్మకమైన రూ. 100 కోట్ల మార్క్ ను దాటింది. దేశవ్యాప్తంగా థియోటర్లు చాలా వరకూ హౌజ్ ఫుల్ షోలు అయినట్లు సమాచారం. తలైవా ఫ్యాన్స్ ఈ సినిమాను పండగలా జరుపుకుంటున్నారు. ఆదివారం కూడా సెలవుకావడంతో ఈ రద్దీ కొనసాగే అవకాశం ఉంది. కూలీ ఇదే విధంగా కొనసాగితే అనేక మైలురాల్లు దాటే అవకాశం కనిపిస్తుంది.