కొత్త రికార్డులను కొల్లగొట్టిన ‘పుష్ఫరాజ్’
ఓ ఏడాదిలో అత్యధిక మంది వీక్షించిన చిత్రంగా రికార్డు
‘పుష్ఫ 2’.. ది రూల్ సినిమా రికార్డులు బద్దలు కొడుతూనే ఉంది. ఇప్పటికే రూ. 1500 కోట్ల క్లబ్బులో చేరిన ఈ సినిమా రెండు వేల కోట్ల వైపు పరుగులు పెడుతోంది. వందేళ్ల హిందీ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిన్న మరో రికార్డును తన పేరు మీద లిఖించుకున్న పుష్ఫరాజ్.. తాజాగా ఒక సంవత్సరంలో వన్ మిలియన్ ప్రేక్షకులు చూసిన చిత్రంగా నిలిచింది. ఈ ఏడాదిలో అత్యధిక మంది అభిమానులు ఈ చిత్రాన్ని సోలోగా వీక్షించారని బుక్ మై షో వెల్లడించింది. మొత్తంగా 10.8 మిలియన్ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఎంజాయ్ చేశారని ప్రకటించింది.
ఈ సంవత్సరం ముగింపు దశకు చేరుకోవడంతో, #BookMyShowThrowback పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది, ఇది దేశంతో పాటు, ప్రపంచవ్యాప్తంగా సినిమాటిక్ అనుభవాలను సేకరించి వాటిలోని విశేషాలను పంచుకుంది.
జనవరి 1 నుంచి డిసెంబర్ 5 మధ్య డేటాను విశ్లేషించగా, నవంబర్ 1 న బుక్‌మైషోలో బ్లాక్‌బస్టర్ డేగా నిలిచింది, ఎందుకంటే కంపెనీ కేవలం 24 గంటల్లో రికార్డు స్థాయిలో 2.3 మిలియన్ టిక్కెట్లను విక్రయించింది.