'పుష్ప2 ' హిందీ మార్కెట్ టార్గెట్ ఎంత? ఓవరాల్ బిజినెస్ ఎంత జరిగింది
ఇవాళ ప్రతి పెద్ద సినిమా పాన్ ఇండియా రిలీజ్ కోసం ప్లాన్ చేస్తోంది. పుష్ప 2 కూడా అదే స్థాయిలో పాన్ ఇండియాలో భారీ రిలీజ్ కు తెర తీసింది.
తెలుగు సినిమా మార్కెట్ 'బాహుబలి' పుణ్యమా అని రోజురోజుకూ పెరుగుతూ పోతుంది. ఇవాళ ప్రతి పెద్ద సినిమా పాన్ ఇండియా రిలీజ్ కోసం ప్లాన్ చేస్తోంది. పుష్ప 2 కూడా అదే స్థాయిలో పాన్ ఇండియాలో భారీ రిలీజ్ కు తెర తీసింది. ఇప్పటికే తెలుగు మార్కెట్, కేరళ మార్కెట్ లో బన్నీకు తిరుగులేదు. పుష్ప 1 హిందీలోనూ బాగా ఆడింది. దాంతో పుష్ప2 తో నార్త్ మార్కెట్ ను కూడా ఆయన కబళించడానికి సిద్దమవుతున్నారు. దానికి తోడు బాహుబలి నుంచి నిన్నటి దేవర వరకు నార్త్ లో మన హవా కొనసాగుతోంది. బన్నీ- సుకుమార్- మైత్రీ సంస్థ నిర్మించిన పుష్ప2 సినిమాకు అదిరిపోయే బజ్ ఉండటంతో నార్త్ లో ఓ రేంజ్‌లో మార్కెట్ క్రియేట్ అయ్యింది. ఈ క్రమంలో నార్త్ లో ఎంతకు అమ్మారు.. అక్కడ బ్రేక్ ఈవెన్ లెక్కలు ఏమిటి, అసలు పుష్ప 2 నిజమైన టార్గెట్ ఏమిటో చూద్దాం.
పుష్ప పార్ట్ వన్ కు వచ్చిన బజ్ తో పార్ట్ 2 కు జరిగిన ప్రీ రిలీజ్ మార్కెట్ ఓ అద్భుతం అనే అంటోంది ట్రేడ్ . ఇండియన్ సినిమాల్లో ఓ రికార్డుగా పుష్ప2నార్త్ బిజినెస్ ఉండబోతోంది అని అంటున్నారు. ఇప్పటివరకు హిందీ బెల్ట్ లో హైయిస్ట్ గ్రాసింగ్ తెలుగు సినిమా బాహుబలి 2. ఆ సినిమా 511 నెట్ వసూలు చేసింది. ఆ తర్వాత కల్కి చిత్రం 295 కోట్లు నెట్ వసూలు చేసింది. ఇప్పుడు పుష్ప2 టార్గెట్ ఆ రెండు సినిమాలను దాటటం. అంటే బాహుబలి 2 రికార్డ్ ను బద్దలు కొట్టడం. అయితే హిందీ మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు పుష్ప 2 హిందీ వెర్షన్ 200 కోట్ల అడ్వాన్స్ మీద డిస్ట్రిబ్యూషన్ కి ఇచ్చారు.
ఈ స్థాయి మొత్తం రికవరీ కావాలి అంటే హిందీ వెర్షన్ ఎంత వసూలు చేయాల్సి వుంటుంది, ఎంత ఖర్చులు, ఎంత కమిషన్ అనే లెక్కలు కట్టినా 500 కోట్లు దాటాల్సి ఉంది. అయితే అది పెద్ద నంబరే కానీ సుకుమార్, ఆయన టీమ్ ఇంత మొత్తం వస్తుందని నమ్ముతోంది.
ఈ నేపథ్యంలో పుష్ప-2 థియేట్రికల్ రైట్స్ దాదాపు రూ.660 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలు గరిష్టంగా రూ. 220 కోట్లు కాగా.. ఈ సినిమా నార్త్ ఇండియా రైట్స్ రూ.200 కోట్లు, తమిళం రూ.50 కోట్లు, కర్ణాటకలో రూ.30 కోట్లు, కేరళలో రూ.20 కోట్లు థియేట్రికల్ రైట్స్ అమ్ముడయ్యాయి.
ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్ హక్కులను దాదాపు 140 కోట్ల రూపాయలకు విక్రయించారు. ఈ క్రమంలో మొత్తం థియేటర్ ఫిగర్లు అన్నీ కలిపి, సినిమా విడుదలయ్యాక వుండే గ్రాస్ ఫిగర్లు మామూలుగా ఉండవని అర్దం అవుతోంది. ఈ క్రమంలో తెలుగు సినిమా స్టామినా ఏమిటో అర్థం అవుతోంది. డిసెంబర్ 5న విడుదలయ్యే పుష్ప 2 పలు సంచనాలకు దారి తీసేలా కనిపిస్తుంది.
వీటిలో థియేట్రికల్‌తో పాటు డిజిటల్ రైట్స్ హక్కులు కూడా భారీ ధరకు అమ్ముడయ్యాయి. డిజిటల్, శాటిలైట్ హక్కులతో సహా నాన్-థియేట్రికల్ రైట్స్ మొత్తం రూ. 425 కోట్లకు అమ్ముడయ్యాయి. శాటిలైట్ హక్కుల కోసం రూ. 85 కోట్లు, మ్యూజిక్ రైట్స్ రూ. 65 కోట్లు, నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ డిజిటల్ రైట్స్ దాదాపు రూ. 275 కోట్లకు దక్కించుకుంది. అన్ని కలిపి ఈ మూవీ థియేట్రికల్, నాన్ థియేట్రికల్ కలిపి రూ. 1085 కోట్లు బిజినెస్ జరిగింది. దీంతో రిలీజ్‌కు ముందే ప్రీ బిజినెస్ ద్వారా వెయ్యి కోట్లకు పైగా రాబట్టిన రికార్డ్ క్రియేట్ చేసింది. .
వాస్తవం చెప్పాలంటే ఈ స్థాయిలో ప్రి రిలీజ్ బిజినెస్ ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమాకు జరగలేదు. ఈ పాన్ ఇండియా చిత్రంపై భారీ అంచనాలు నెలకొనటమే అందుకు కారణం. ఏ హీరోకు లేనంతగా అల్లు అర్జున్‌కు ఉన్న క్రేజ్ వల్లే ఈ రేంజ్‌లో బిజినెస్ జరిగిందనేది నిజం. కాగా.. ఈ చిత్రం రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో ఫహద్ ఫాసిల్, సునీల్, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.