కెరీర్ ఊగిసలాటలో పూజా హెగ్డే !

గ్లామర్ ఉంది, గ్యారంటీ లేదు;

Update: 2025-06-13 02:30 GMT

హీరోయిన్‌ పూజాహెగ్డే (Pooja Hegde) తెలుగు సినిమాల్లో నటించి దాదాపు మూడేళ్లవుతోంది. హిందీ, తమిళ్‌ పరిశ్రమల్లో బిజీగా ఉన్న ఆమె.. ‘రెట్రో’ (Retro)తో తెలుగు ప్రేక్షకులనూ పలకరించారు. సూర్య హీరోగా కార్తిక్‌ సుబ్బరాజు తెరకెక్కించిన ఈ తమిళ్‌ మూవీ మే 1న విడుదల అయ్యి డిజాస్టర్ అయ్యింది.

వాస్తవానికి పూజా హెగ్డే కెరీర్ ప్రస్తుతం కాస్త క్లిష్ట దశలో ఉంది. అందం, గ్లామర్, ఫాలోయింగ్ అన్నీ ఉన్నా.. ఒక పక్కా హిట్ మాత్రం లాంగ్ గ్యాప్‌లో లేదు.

ఆమె నటించిన గత రెండు చిత్రాలు — ‘రెట్రో’, ‘దేవా’ — పరాజయాలను మాత్రమే మిగిల్చాయి. అయితే.. ఇప్పటికీ ఆమె చేతిలో కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. కానీ, వాటిలో ఒక్కటినీ "సూపర్ హిట్ గ్యారంటీ" అనలేం.

‘కూలీ’లో స్పెషల్ సాంగ్: రజనీతో అడుగులు.. పాపులారిటీ బూస్టవుతుందా?

సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న ‘కూలీ’ చిత్రంలో పూజా హెగ్డే ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించనున్నారు. ఈ పాట హిట్ అయితే, ఆమెకు పబ్లిసిటీ పరంగా మళ్లీ పుంజుకునే అవకాశం ఉంది. కానీ ఇది కేవలం కెమెరా ముందు కాసేపే కనిపించే ఛాన్స్.

‘జన నాయకన్’: విజయ్ షాడోలో మరిచిపోయే భయం

దళపతి విజయ్ చివరిసారిగా నటిస్తున్న రాజకీయ నేపథ్యం ఉన్న చిత్రం ‘జన నాయకన్’. పూర్తిగా విజయ్‌పైనే ఫోకస్ ఉండే ఈ చిత్రంలో పూజాకు స్కోప్ ఉండే ఛాన్స్ తక్కువగానే కనిపిస్తోంది. అలాంటి కథల్లో హీరోయిన్ పాత్ర తరచూ ‘ఫిల్లర్’గానే మిగిలిపోతుంది.

‘కాంచన 4’: హారర్ కామెడీకి గడ్డు టైమా?

.సరదాగా నవ్విస్తూ, మద్యలో ఓ జంప్ స్కేర్‌తో ఉలికిపాటుకు గురిచేసే ‘కాంచన’ ఫ్రాంచైజీకి పూజా తాజా ఎంట్రీ ఇచ్చింది. కానీ ఇప్పటికి ఈ ఫ్రాంచైజీ జోరు తగ్గిపోతోందన్న అభిప్రాయం ఎక్కువ గా వినపడుతోంది. అయితే కథలో కొత్తదనం ఉంటే, ఈ సిరీస్ మళ్లీ మ్యాజిక్ చేయగలదా అనేది ప్రశ్నే.

హాయ్ జవానీ తో ఇష్క్ హోనా హై: పూజా వర్సెస్ మృణాల్?

డేవిడ్ ధావన్ దర్శకత్వంలో, వరుణ్ ధావన్ మరియు మృణాల్ ఠాకూర్‌తో కలిసి పూజా నటిస్తున్న ఈ రొమాంటిక్ కామెడీపై సందేహాలు ఎక్కువగా ఉన్నాయి. డేవిడ్ గత చిత్రం కూలీ నం.1 ఓటీటీలోనే బోల్తా కొట్టిన సంగతి తెలిసిందే. పైగా, మృణాల్‌తో స్క్రీన్ షేరు చేయాల్సి రావడంతో పూజా స్క్రీన్ పై మెరిసే అవకాశాలు ఇంకా తగ్గిపోతున్నాయి.

నటన పరంగా పరిమితి?

పూజా హెగ్డే పరంగా ఓ గ్లామర్ పాకేజీ. కానీ, ఆమెని సాయి పల్లవిలా ఓ సింగిల్ హ్యాండ్‌లో సినిమా మోసే నటిగా మాత్రం ప్రేక్షకులు చూడటం లేదు. అలాంటి తరుణంలో, కంటెంట్ బలంగా లేకపోతే, ఆమె పైనే ఓ సినిమా ఆధారపడాలంటే కష్టమే.

ఏదీ ఖచ్చితమైన హిట్ మేటర్ అయితే కాదు!

ఈ లైన్‌ప్ చూస్తే – ‘కూలీ’లో కెమియో, జన నాయకన్లో లిమిటెడ్ స్కోప్, కాంచన 4లో రిస్క్, *హాయ్ జవానీ...*లో డబుల్ హీరోయినిజం – అన్నింటిలోనూ ఏదో ఒక కన్‌ఫ్యూజన్ ఉంది. పూజా కెరీర్ రీబూట్ కావాలంటే, ఈ సినిమాలేగాక ఆమె సెలెక్షన్‌లోనూ స్పష్టత అవసరం.

Tags:    

Similar News