'ఆపరేషన్ రావణ్' OTT రివ్యూ

తాజాగా ఓ సైకో థ్రిల్లర్ సినిమా 'ఆపరేషన్ రావణ్' ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమా ఎలా ఉంది. కథేంటి, చూడదగ్గ సినిమానేనా వంటి విషయాలు చూద్దాం.

Update: 2024-11-05 06:26 GMT

కొన్ని సినిమాలు ఓటిటిల కోసమే తీసినట్లుంటాయి. ఓటిటి లో క్రైమ్,థ్రిల్లర్ కంటెంట్ బాగా పోతోందని అలాంటివే చేస్తున్నారు. తెలుగులో ఆ ట్రెండ్ బాగా ఎక్కువైంది. మీడియం హీరోలతో ఓటిటి లో మార్కెట్ ని క్యాష్ చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలాంటి సినిమాల థియేటర్ మార్కెట్ నామ మాత్రమే. అయితే ఓటిటిలలోనూ అవి ఏ మేరకు ఫెరఫార్మ్ చేస్తున్నాయనేది ప్రశ్నార్దకమే. తాజాగా ఓ సైకో థ్రిల్లర్ సినిమా 'ఆపరేషన్ రావణ్' ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమా ఎలా ఉంది. కథేంటి, చూడదగ్గ సినిమానేనా వంటి విషయాలు చూద్దాం.

స్టోరీ లైన్

టీవీ 45 అనే న్యూస్‌ ఛానెల్‌ లలో ఆమని(సంగీర్తన విపిన్‌) ఓ ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్‌. ఆమె స్థానిక మంత్రి(రఘు కుంచె) చేసే అవినీతిపై స్టింగ్‌ ఆపరేషన్‌ చేసి ఓ స్టోరీ రెడీ చేస్తుంది. అయితే ఆ స్టోరీని టీవీ చానెల్‌ సీఈఓ(మూర్తి) టెలికాస్ట్‌ అవ్వనివ్వడు. అలాగే ఆమెకు ఓ కొత్త వర్క్ అప్పచెప్తారు. సిటీలో ఓ సీరియల్‌ కిల్లర్‌ వరుసగా అమ్మాయిలను కిడ్నాప్‌ చేసి హత్యలు చేస్తుంటాడు. ఓ సీరియల్‌ కిల్లర్‌ కేసుని కవర్‌ చేయమని పురమాయిస్తాడు. ఆమెకు అసిస్టెంట్‌గా కొత్తగా జాబ్ లో చేరిన రామ్‌(రక్షిత్‌ అట్లూరి)ని పంపుతారు. అయితే రామ్‌ ఆమె ప్రేమను పొందేందుకు ప్రయత్నిస్తుంటాడు.

ఇదిలా ఉండగా తన కూతురు కూడా కనిపించడం లేదని తమ్ముడి వర్మతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది సుజాత(రాధికా శరత్‌ కుమార్‌). ఓ ప్రక్క పోలీసులు మరో ప్రక్క ఆమని, రామ్‌లు ఈ కేసును సీరియస్‌గా తీసుకొని ఇన్విస్టిగేట్ చేస్తూంటారు. ఈ క్రమంలో ఓ రోజు ఆ సీరియల్‌ కిల్లర్‌ ఆమనిని కిడ్నాప్‌ చేస్తాడు. అప్పుడేం ఏం జరిగింది? అసలు ఆ సీరియల్‌ కిల్లర్‌ ఎవరు? ఎందుకు పెళ్లికి సిద్ధంగా ఉన్న అమ్మాయిలను హత్య చేస్తున్నాడు? ఇంతకీ రామ్ ఎవరు... సీరియల్‌ కిల్లర్‌ నుంచి తన ప్రియురాలు ఆమనిని రామ్‌ ఎలా రక్షించుకున్నాడు? చివరకు ఏం జరిగింది? అసలు సీరియల్ కిల్లర్ పగకు కారణం ఏమిటి? లాంటి విషయాలు తెలియాలంటే సినిమా మొత్తం చూడాల్సిందే.

ఎలా ఉంది

సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ కు ఓ వర్గం ప్రేక్షకులుకు ఎప్పుడూ ఉంటారు. వారిని టార్గెట్ చేస్తూ ఈ సినిమాని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు దర్శకుడు వెంకట సత్య. సైక్లాజికల్ థ్రిల్లర్ లో కాంప్లికేట్ సాధారణంగా ప్రధాన పాత్ర మనస్సులోనే ఉంటుంది. అప్పుడే ప్రేక్షకుడుకి ఆ పాత్ర కనెక్ట్ అవుతుంది. ఆ ఎమోషన్ కనుక పండకపోతే మిగతా సీన్స్ అన్ని వృధానే అవుతాయి. అలాగే ఈ స్క్రిప్టులకు సర్పైజ్ లు ప్రధానం. ఎప్పుడైతే ప్రధాన పాత్ర కళ్ల నుంచి మిగతా కథను చూడటం మొదలెడతారో అప్పుడే ప్రేక్షకుడుకి, పాత్రకు కనెక్షన్ ఏర్పడుతుంది. ఈ సినిమాలో అదే మిస్సైంది. నెరేటివ్ టూల్స్ ని మిస్సయ్యారు.

సీన్స్ ఒకదాని తర్వాత మరొకటి వెళ్ళిపోతుంటాయి. కానీ స్ట్రాంగ్ గా ఏమీ రిజిస్టర్ కావు. దాంతో చివరి దాకా ఎంగేజ్ చేయడం కష్టమే అయ్యింది. ఓ వ్యక్తి సైకో కిల్లర్‌గా, సీరియల్‌ కిల్లర్‌గా ఎలా మారతాడు, ఎందుకు మారాడనే అంశాల చుట్టూ కథని తిప్పుతూ, ఆ వ్యక్తిలో జరిగే సంఘర్షణ చూడటం దాకా బాగుంది. కానీ అదే ప్రధానమై మిగతా ఎలిమెంట్స్ కు ప్రయారిటీ లేకుండా పోయింది. అలాగే స్లో నేరేషన్ కూడా సినిమాని ఇబ్బంది పెట్టింది. మీ మీ ఆలోచనలే మీ శత్రువులు అనే పాయింట్ గా బాగుంది. కానీ దాని తాలూకా కాంప్లిక్ట్ ను కథలో బలంగా ఎస్టాబ్లిష్ చేయడంలో తడబడ్డారు.సైకో కిల్లర్ నెక్ట్స్ ఎవరిని చంపుతాడా ? అనే ఉత్కంఠను ఇంకా బాగా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే బాగుండేది. అలాగే 100 కోట్ల స్కామ్ సంగతి కూడా పక్కన పెట్టేసి వదిలేశారు. క్లైమాక్స్ ను మనం అంచనా వేసేస్తాం.

టెక్నికల్ గా

ఐడియా గా బాగున్న ఈ కథ ట్రీట్మెంట్ గా సరిగ్గా రాసుకోలేదు. అది రైటింగ్ ఫెయిల్యూర్. ఈ సినిమాకి నాని చమిడిశెట్టి అందించిన సినిమాటోగ్రఫీ ప్లస్ అయ్యింది. శ్రావణ్ వాసుదేవ్ అందించిన సంగీతం ఓకే అనిపించింది. ఎడిటింగ్ బాగుంది. నిర్మాత ధ్యాన్ అట్లూరి నిర్మాణ విలువలు బాగున్నాయి.

చూడచ్చా

మరీ తీసి పారేయదగ్గ సినిమా కాదు. ఓటీటీలోనే కాబట్టి సైకలాజికల్ థ్రిల్లర్స్ మీరు ఇష్టపడితే ఓ లుక్కేయవచ్చు.

ఎక్కడ చూడాలి

ఆహా లో తెలుగులో ఉంది సినిమా

Tags:    

Similar News