OG తో పవన్ స్టార్ కి బ్లాక్‌బస్టర్
ఎవరు నష్టపోయారో తెలుసా?
హరిహర వీరమల్ల వంటి డిజాస్టర్ తర్వాత పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌పై ఉన్న క్రేజ్, నమ్మకం తగ్గిందనుకున్న క్షణానికే, ఓజీ ట్రైలర్‌తోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది. రిలీజ్‌కు ముందు నుంచే ఓజీ సినిమా చుట్టూ అంచనాలు ఆకాశాన్నంటాయి. పవన్ స్టైలిష్ లుక్, ఇంటెన్స్ డైలాగ్స్, సుజీత్ దర్శకత్వం – ఇవన్నీ కలిసి ఓజీని టాలీవుడ్‌లోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా హాట్ టాపిక్‌గా మార్చాయి.
దసరా సీజన్‌కి రిలీజ్ కావటంతో థియేట్రికల్ డీల్స్ రికార్డ్ స్థాయిలో క్లోజ్ అయ్యాయి. ఎవరూ ఊహించని ధరలకు అమ్ముడైన ఈ సినిమా, ఇటీవలి కాలంలో అత్యంత భారీగా అమ్ముడైన రీజినల్ ఫిల్మ్‌గా నిలిచింది.
రిలీజ్ తర్వాత పవన్ మేనరిజమ్స్, యాక్షన్ స్టైల్, మాస్ ఎంట్రీలు ఫ్యాన్స్‌కి ఫీస్ట్‌గా మారాయి. రిలీజ్ రోజు ఓపెనింగ్స్ రికార్డులు బద్దలయ్యాయి. మొదటి మూడు రోజులు ఒక ఊపు ఊపింది.
కానీ ఓవర్‌ప్రైస్డ్ టికెట్లు, హాలిడే బూస్ట్ ముగిసిన తర్వాత కలెక్షన్స్‌లో డిప్ మొదలైంది. దసరా సెలవుల్లో నిలబడి, పవన్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచినా… షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే – డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం నష్టాల్లోకి వెళ్లారని ట్రేడ్ అంటోంది!
మొత్తం మీద, ఓజీ బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్ అయినా, బిజినెస్ పరంగా లాస్ వెంచర్‌గా మారిందనేది వారి టాక్. భారీ డీల్స్, ఎక్కువ GST బరువుతో తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్స్‌కి 15-20 శాతం వరకు నష్టం వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. మరోవైపు, ఓవర్సీస్‌లో మాత్రం ఓజీ మంచి ప్రాఫిట్స్ తెచ్చుకుంటోంది, కానీ ఇతర భాషల్లో హోప్ తగ్గింది.
ఓజీ లాంటి సినిమా "బ్లాక్‌బస్టర్ విత్ లాసెస్" ఎలా అయ్యేందుకు అవకాసం ఉందో చూద్దాం
1. ఎక్స్‌పెక్టేషన్ ఎకానమీ – ఓవర్‌ప్రైస్డ్ థియేట్రికల్ డీల్స్
ఓజీ రీలీజ్‌కు ముందు హైప్ పీక్స్‌లో ఉంది.
హరిహర వీరమల్ల ఫెయిల్యూర్ తర్వాత కూడా పవన్ కల్యాణ్‌కి ఉన్న మాస్ పుల్‌పై డిస్ట్రిబ్యూటర్లు బెట్ వేశారు.
దానయ్య అప్పుడు “మార్కెట్ హీట్”లో సినిమాను అధిక ధరలకు అమ్మేశాడు.
ఆంధ్ర, సీడెడ్, నైజాం – ప్రతి టెర్రిటరీలో 30–40% ఎక్కువ రేటుకి డీల్స్ క్లోజ్ అయ్యాయి.
అంటే సినిమా హిట్ కావడమే సరిపోదు; ఆ “ఓవర్‌ప్రైస్”ను రికవర్ చేయడానికి సూపర్‌బ్లాక్‌బస్టర్ రేంజ్ కలెక్షన్స్ కావాలి.
ఓజీ ఆ స్థాయి కలెక్షన్ చేయకపోవడంతో — రెవెన్యూ బాగున్నా, బిజినెస్ లాస్‌గా మారింది.
2. టికెట్ రేట్లు – షార్ట్ టర్మ్ గెయిన్, లాంగ్ టర్మ్ లాస్
మేకర్స్ టికెట్ ధరలను దసరా సీజన్ ఎక్స్క్యూస్‌తో పెంచేశారు.
మొదటి వారం బంపర్ ఓపెనింగ్స్ వచ్చాయి కానీ… హై టికెట్ రేట్లతో ఫ్యామిలీ ఆడియెన్స్ వెనక్కి తగ్గారు. కాంతారా ఎఫెక్ట్ కావచ్చు...రెండో వారం నుండి ఫుట్‌ఫాల్స్ భారీగా తగ్గిపోయాయి.
అంటే మొదటి 4 రోజుల్లో కలెక్షన్ ఎక్స్ప్లోడ్ అయినా, ఆ తర్వాత దాని స్పీడ్ పడిపోయింది.
3. డిస్ట్రిబ్యూటర్ లెక్కలు vs ప్రొడ్యూసర్ లెక్కలు
ఇది ఓజీ లాస్ మోడల్‌లో అత్యంత క్రిటికల్ పాయింట్. ప్రొడ్యూసర్ DVV దానయ్య సినిమాను నాన్-రిఫండబుల్ బేసిస్ పై అమ్మాడు.
అంటే డిస్ట్రిబ్యూటర్ ఎంత కలెక్షన్స్ తెచ్చుకున్నా — ప్రొడ్యూసర్‌కి సంబంధం లేదు. ప్రొడ్యూసర్ హ్యాండ్‌లో ఇప్పటికే భారీ ప్రాఫిట్ ఉంది.
కానీ థియేట్రికల్ రన్ అంచనాలు దాటకపోవడంతో డిస్ట్రిబ్యూటర్స్‌కి 15-20% నష్టం వచ్చింది.
సింపుల్‌గా చెప్పాలంటే — సినిమా “హిట్” అయినా, “బిజినెస్” లాస్‌లో ఉంది.
4. ఓవర్సీస్ ప్రాఫిట్స్ బట్ డొమెస్టిక్ డ్రాప్
ఓవర్సీస్‌లో (USA, UAE) ఓజీ కలెక్షన్స్ స్ట్రాంగ్‌గా వచ్చాయి. కానీ తమిళనాడు, కేరళ, హిందీ వెర్షన్లలో బజ్ లేమీ లేకపోవడంతో, మల్టీ-లాంగ్వేజ్ ప్రాజెక్ట్ అన్న లెవెల్‌లో వర్క్ అవ్వలేదు.
దాంతో, మొత్తం థియేట్రికల్ బిజినెస్‌లో ఓవర్సీస్ ప్రాఫిట్‌తో కూడా డొమెస్టిక్ లాస్ కవర్ కాలేదు.
ప్రొడ్యూసర్ DVV దానయ్య మాత్రం పూర్తి సేఫ్ – నాన్ రీఫండబుల్ బేసిస్‌పై సినిమా అమ్మేయడంతో ఆయనికి లాభాలే లాభాలు. ఫలితంగా, పవన్ కల్యాణ్ రీఎంట్రీని బ్లాక్‌బస్టర్‌గా మార్చిన ఓజీ, “హిట్ విత్ లాసెస్” అనే అరుదైన కేటగిరీకి చేరిపోయిందనేది ట్రేడ్ అంటున్న మాట. అదే నిజమైతే హిట్ సినిమా… కానీ లాస్ బిజినెస్! – ఓజీ కేస్ టాక్ ఆఫ్ ది టౌన్!