మన మాస్ హీరోలను దారుణంగా దెబ్బ కొడుతున్న బాలీవుడ్ డైరక్టర్స్, ఎందుకిలా జరుగుతోంది?
వార్ 2, ఆదిపురుష్, జంజీర్: తెలుగు మాస్ హీరోలకు కి షాక్ ఇచ్చిన హింది సిమాలు;
తెలుగులో భారీ సక్సెస్, మాస్ ఫ్యాన్ బేస్ ఉన్న హీరోలు బాలీవుడ్ ప్రాజెక్ట్స్ వైపు చూస్తున్నారు. అలాగని నటనలో అక్కడేదో కొత్త ఛాలెంజ్ దొరుకుతుందని కాదు. Pan-India recognition కోసం, పాన్ ఇండియా మార్కెట్ లో స్థిరమైన స్థానాన్ని సంపాదించడం, స్టార్ స్టేటస్ మరింత పెంచుకోవడం కోసం. career diversification, financial growth, మరియు nationwide appeal కోసం. ఇవి మోటివేషన్.
కానీ ఈ అడ్వెంచర్ లో రిస్క్ ఎక్కువ.డైరెక్టర్స్ హీరో ఫ్యాన్స్ పల్స్, మాస్ కనెక్ట్, ఆడియన్స్ ఎక్సపెక్టేషన్స్ అర్థం చేసుకోకపోవడం, సరిగ్గా నడిపించకపోవడం → ఫలితం ప్రిడెక్టబుల్ ప్లాఫ్. War 2, Adipurush, Zanjeer వంటి ఫెయిల్యర్స్ ఈ విషయాలని ప్రూవ్ చేస్తున్నాయి.
సరిగ్గా గమనిస్తే మన దక్షిణాది డైరెక్టర్లు బాలీవుడ్ హీరోలతో బ్లాక్‌బస్టర్స్ క్రాఫ్ట్ చేస్తుంటే, బాలీవుడ్ డైరక్టర్స్ మాత్రం మన హీరోలకు హిట్ ఇవ్వలేకపోతున్నారు. వార్ 2 రిజల్ట్ చూసిన తరువాత, తెలుగు సినిమా ప్రేక్షకులు Jr. NTR ని ఆ సినిమాలో ఎలా చూపించారు అనేది విశ్లేషిస్తున్నారు. ఇంట్రస్టింగ్ గా ఈ సినిమా చర్చల్లో ఒక కొత్త డిబేట్ మొదలైంది.
జంజీర్
రామ్ చరణ్, మగధీర సూపర్ హిట్ తో కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు, Apoorva Lakhiya తో Zanjeer (బాలీవుడ్ హిట్ సినిమా రీమేక్)చేసాడు. అందులో రామ్ చరణ్ యంగ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనపడ్డారు. క్రిటిక్స్ నుంచి, అభిమానుల నుంచి నుండి తీవ్ర ట్రోలింగ్ ఎదుర్కొన్నారు.అమితాబ్ కి స్టార్ డమ్ తెచ్చిన సినిమా, Ram Charan ని ఇబ్బంది పెట్టింది. క్లియర్ గా చెప్పాలంటే అపూర్వ లఖియా..రామ్ చరణ్ క్రేజ్ & సక్సెస్ ని సరిగా వినియోగించలేకపోయారు.
ఆది పురుష్
తాజాగా వచ్చిన ఆది పురుష్ ప్రభాస్ కు పెద్ద అవమానం మిగిల్చింది. రామాయణం ఆధారంగా చేసిన ఈ కొత్త చిత్రం భారీ విమర్శలకు గురైంది. తానాజీతో తో సక్సెస్ అనుభవించిన ఓమ్ రౌత్...పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ ని డీల్ చేయలేకపోయారు. ఆడియన్స్ ఎక్సపెక్టేషన్స్ ని కొంచెం కూడా రీచ్ కాలేకపోయారు. ఈ రామాయణం ఎడాప్షన్ కొత్త జనరేషన్ కోసం క్లాసిక్ రిఫరెన్స్ అవ్వాలి. కానీ నిరాశపరిచింది.
వార్ 2
ప్రస్తుతం NTR, RRR & Devara సక్సెస్ తర్వాత కెరీర్ లో మంచి స్దాయిలో ఉన్నాడు. అదే సమయంలో అతనికి నెగిటివ్ షేడ్ రోల్ ఆఫర్ వచ్చింది, ఓ రకంగా ఎన్టీఆర్ కు కంఫర్ట్ జోన్ నుంచి బయిటకు వచ్చి చేసిన సినిమా. దానికి తోడు హృతిక్ రోషన్ తో కొలాబిరేషన్. అలాగే టాలెంటెడ్ డైరక్టర్ గా పేరు తెచ్చుకున్న అయాన్ ముఖర్జీ. అయినా ఈ సినిమాని బ్లాక్ బస్టర్ గా చేయలేకపోయాడు. ముఖ్యంగా ఎన్టీఆర్ పూర్తి పొటిన్షియల్ ని ఉపయోగించుకోలేకపోయాడు. మన తెలుగు ప్రేక్షకుల భాషలో చెప్పాలంటే ఎన్టీఆర్ ని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయారు. ఫలితం నిరాశ.
వాస్తవానికి దర్శకుడు అయాన్...రొమాంటిక్ డ్రామాలు డీల్ చేయటంలో పండిపోయినవాడు. Wake Up Sid, Yeh Jawani Hai Deewani లు బాగా వచ్చాయి. కానీ బ్రహ్మాస్త్ర అనుకున్న స్దాయిలో వర్కవుట్ కాలేదు. War 2 కూడా మ్యాజిక్ చేయలోకపోయింది.
“బాలీవుడ్ లో తెలుగు హీరోలు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు”
బాలీవుడ్ దర్శకులు మన హీరోలు PR hype ని గతంలో వచ్చిన విజయాలను మాత్రమే బేస్ చేసుకుంటూ తెరకెక్కిస్తుననారు. అంతేకాని మన తెలుగువారి సంస్కృతి & స్టార్స్ కు ఉండే క్రేజ్ ని అర్థం చేసుకోవడం లేదు. దాంతో క్యారక్టరైజేషన్స్ ని వీక్ గా ప్రజెంట్ చేయటం, అభిమానులను నిరాశపరచటం. దాంతో ఇతర భాషల డైరెక్టర్లు Telugu heroes ను సరిగా హ్యాండిల్ చేయలేకపోతున్నారు.
తెలుగు డైరెక్టర్లు తెలుగు స్టార్స్ ని పూర్తిగా అర్థం చేసుకుని, మాస్ అప్పీల్, ఫ్యాన్ పల్స్ తో యూనివర్శిల్ ఏక్సిపెక్టెన్స్ ని పొందటం జరుగుతోంది. అదే విధానాన్ని ఇతర భాషల డైరక్టర్స్ చేసినప్పుడే మన హీరోలు వాళ్ల దర్శకత్వంలో సక్సెస్ అవుతారు.