MTV ఎందుకు మూసివేస్తున్నారు?

కార్పొరేట్ గేమ్‌లో బలి అయిన మ్యూజిక్ యుగం!

Update: 2025-10-16 03:46 GMT

టీవీలు బ్లాక్ అండ్ వైట్ యుగం దాటి, రంగులతో మెరిసే స్క్రీన్ల మొదలవుతున్న రోజులు అవి. అయితే అప్పటిదాకా టీవీ అంటే వార్తలు, సీరియల్స్, గేమ్ షోలకే పరిమితమై ఉన్న రోజులు అవి.

అప్పుడు ఒక క్షణంలో ఆ స్క్రీన్ మీద మెరిసింది — “Ladies and gentlemen, rock and roll!” ఆ వాక్యం తర్వాత మోగిన ఎలక్ట్రిక్ గిటార్ శబ్దం ప్రపంచ టెలివిజన్ చరిత్రను శాశ్వతంగా మార్చేసింది.

ఆ రోజే పుట్టింది — MTV.

“Music Television” అనే పేరుతో,

కానీ అసలైన అర్థంలో అది యువత యొక్క గుండె చప్పుడే.

మొదటి వీడియో — “Video Killed the Radio Star” పాటతోనే MTV తన లక్ష్యం చెప్పేసింది — సంగీతం ఇక వినిపించేది కాదు, కనిపించేది అని! ప్రతి పాటకు ఒక కథ, ప్రతి బీట్‌కి ఒక ముఖం ఇచ్చిన చానల్ — అదే MTV. 24 గంటల మ్యూజిక్, కొత్త పాటలు, కొత్త ఆర్టిస్టులు, కూల్ వాయిస్‌లతో నడిపించే VJs (Video Jockeys) — ఇది అప్పటి యువతకు ఒక కొత్త ప్రపంచం. రాక్ నుండి పాప్, పాప్ నుండి హిప్-హాప్ వరకు MTV యొక్క సంగీత యాత్ర కొనసాగింది.

మైకేల్ జాక్సన్ వీడియోలు “Billie Jean” మరియు “Thriller” ప్రసారం చేయడం ద్వారా MTV సంగీత ప్రపంచంలో కొత్త యుగాన్ని ప్రారంభించింది. ఆ తరవాత Madonna, Prince, Whitney Houston, Nirvana, Backstreet Boys, Britney Spears, Eminem — వీరందరికీ MTV ఒక వేదిక అయింది. ఒక కొత్త తరం సంగీతాన్ని కళ్ళతో వినిపించే అలవాటు నేర్చుకుంది. అలా అప్పటి యువతకి ఒక గుర్తింపుగా మారింది MTV.

కానీ ఇప్పుడు ఆ శబ్దం సైలెంట్ అవుతోంది…

2025 అక్టోబర్ 12న Paramount Global ప్రకటించింది — యుకేలోని అన్ని మ్యూజిక్ ఫోకస్‌డ్ MTV ఛానెల్స్ — MTV 80s, MTV 90s, MTV Music, Club MTV, MTV Live — 2025 డిసెంబర్ 31న శాశ్వతంగా మూసివేయబడతాయి అని. ఇది కేవలం ఒక బ్రాడ్‌కాస్ట్ నిర్ణయం కాదు — మ్యూజిక్ టెలివిజన్ యుగం ముగింపు.

Paramount–Skydance మెర్జర్ తర్వాత వచ్చిన ‘Cost-Cut’ తుఫాన్

ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు నేపథ్యం ఏమిటంటే — కొన్ని నెలల క్రితం Paramount Global, Skydance Mediaతో విలీనం అయింది. దాంతో సంస్థ $500 మిలియన్ గ్లోబల్ ఖర్చు కోత ప్రణాళికను ప్రారంభించింది. MTV మ్యూజిక్ ఛానెల్స్ మూసివేత ఆ ప్రణాళికలో భాగం.

Paramount ఇప్పుడు తన ఫోకస్‌ను OTT ప్లాట్‌ఫామ్ Paramount+ మీదకు మలుస్తోంది. టెలివిజన్ చానెల్స్ కంటే డిజిటల్ కంటెంట్‌లోనే భవిష్యత్తు ఉందనే నిర్ణయంతో ఈ మార్పు చేపట్టింది.

ఎందుకు MTV ప్రాభవం కోల్పోయింది?

మ్యూజిక్ మారింది – వినే విధానం కూడా మారింది. YouTube, TikTok, Spotify ప్రపంచాన్ని ఆక్రమించాయి. ఇప్పుడు పాటలు టీవీ మీద కాదు, రీల్స్‌లో వైరల్ అవుతున్నాయి.

MTV తన రూట్‌స్‌ నుంచి దూరమైంది. మ్యూజిక్ వీడియోల బదులు రియాలిటీ షోలు, డేటింగ్ షోలు ప్రధానంగా మారాయి. ఆత్మే పోయింది, పేరు మాత్రమే మిగిలింది.

కార్పొరేట్ రీబ్రాండింగ్ మ్యూజిక్‌ను బలి తీసుకుంది. Paramountకి MTV ఇప్పుడు ఒక ‘ప్రోడక్ట్ యూనిట్’ మాత్రమే. కానీ ప్రపంచానికి MTV అంటే ఒక భావోద్వేగం.

“RIP MTV” – సోషల్ మీడియాలో నాస్టాల్జియా

MTV మూసివేత వార్త బయటికొచ్చిన వెంటనే X (Twitter) మొత్తం జ్ఞాపకాలతో మునిగిపోయింది. వీటిలో ప్రతి వాక్యం ఒక నొప్పి — ఒక తరం పంచుకున్న నాస్టాల్జియా.

ఒక యూజర్ ఇలా రాశాడు: “MTV నిజంగా మ్యూజిక్ ప్లే చేసేది. ఆ 80ల MTV అంటే మ్యాజిక్.”

ఇంకొకరు కాస్త వ్యంగ్యంగా రాశారు: “మ్యూజిక్ చానల్ నుంచి మనీ చానల్‌గా మారిపోయింది.”

మరొక యూజర్ మాటల్లో మాత్రం లోతు ఉంది: “మ్యూజిక్ ఆగిన రోజ్ MTV కూడా ఆగిపోయింది. కార్పొరేట్‌లు దాన్ని చల్లగా చంపేశారు.”

ఏదైమైనా..

సంగీతం మారిపోతుంది, మీడియం మారిపోతుంది — కానీ ఆ వైబ్ మాత్రం ఎప్పటికీ మారదు.

MTV ఒక తరం యొక్క కల —

ఇప్పుడు అది చరిత్ర అయిందేమో కానీ,

ఆ కలలో మనం ఇంకా వినిపిస్తున్నాం...

ఆ చివరి బీట్‌ను

1981లో MTV మొదటి ప్రసారం “Video Killed the Radio Star” తో ప్రారంభమైంది.

2025లో అదే చానల్‌ను “Digital killed the TV star” గా ముగుస్తోంది.

Tags:    

Similar News