'మిస్టర్ బచ్చన్ ' మూవీ రివ్యూ...

ఎంతసేపు సినిమా ను చూస్తున్నామంటే చూస్తున్నాం అనే ఫీల్ కలుగుతుందే తప్ప పెద్దగా మ్యాజిక్ అయితే అని కనిపించదు

By :  Admin
Update: 2024-08-15 00:52 GMT

-గోపి వేల్పుల


ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో చాలా వైవిద్య భరితమైన సినిమాలు వస్తున్నాయి. ప్రేక్షకులు కూడా డిఫరెంట్ సినిమాలను ఆదరిస్తు ఆయా సినిమా టీమ్ లకి సక్సెస్ లను కూడా కట్టబెడుతున్నారు. మరి ఇలాంటి క్రమంలో బాలీవుడ్ లో అజయ్ దేవగన్ హీరోగా వచ్చిన ' రైడ్ ' సినిమాను తెలుగు లో రవితేజ రీమేక్ చేశాడు. రవితేజ హీరోగా, హరీష్ శంకర్ డైరెక్షన్ లో 'మిస్టర్ బచ్చన్' గా మన ముందుకు వచ్చింది ఈ రోజు.

కథ
ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గా పని చేస్తున్న మిస్టర్ బచ్చన్ (రవితేజ) చాలా సిన్సియర్ ఆఫీసర్ గా ఒక మంచి గుర్తింపును సంపాదించుకుంటాడు. ఇక ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ ఆయన చేసిన ఒక ఇన్ కమ్ ట్యాక్స్ రైడ్ కారణంగా తన పై ఆఫీసర్లు అతన్ని సస్పెండ్ చేస్తారు. దాంతో ఆయన తిరిగి తన ఊరు వచ్చేసి అక్కడ తన పేరెంట్స్ తో హ్యాపీగా తన లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు. అలాగే ఆర్కెస్ట్రా ప్రోగ్రాంలను కూడా నిర్వహిస్తూ పెళ్లిళ్లు ఫంక్షన్స్ లో పాటలు పడుతూ ఉంటాడు. ఇక ఇలాంటి క్రమంలోనే అతనికి భాగ్యశ్రీ తో పరిచయం ఏర్పడుతుంది. ఇక ఆమెను తను ప్రేమిస్తాడు. ఇక సరీగ్గా ఇదే సమయంలో ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గా సస్పెండ్ అయిన మిస్టర్ బచ్చన్ ను వెంటనే తమ డ్యూటీలోకి జాయిన్ చేస్తూ అతనికి 'ముత్యం జగ్గయ్య' (జగపతి బాబు) అనే బిజినెస్ మాన్ కి సంబంధించిన ఇంట్లో ఇన్ కమ్ ట్యాక్స్ రైడ్ చేయాలనే టాస్క్ ని అప్పజెప్తారు.
ఇక దాంతో సిన్సియర్ ఆఫీసర్ అయిన బచ్చన్ తన టాస్క్ ని కంప్లీట్ చేయడానికి తన టీమ్ తో రంగంలోకి దిగుతాడు. మరి అప్పటికే ముత్యం జగ్గయ్య అంటే అందరూ భయపడిపోతూ ఉంటారు. అలాంటి ఒక మృగాన్ని మిస్టర్ బచ్చన్ ఎలా ఎదిరించాడు. ఇక బచ్చన్ ముత్యం జగ్గయ్య మీద విజయం సాధించాడా? అలాగే తను ప్రేమించిన భాగ్యశ్రీ తనని పెళ్లి చేసుకుందా?లేదా అనే విషయాలను తెలుసుకోవాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే...
విశ్లేషణ
దర్శకుడు హరీష్ శంకర్ నుంచి గద్దల కొండ గణేష్ అనే సినిమా వచ్చి దాదాపు 5 సంవత్సరాలు అవుతుంది. 2019లో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అప్పటినుంచి ఖాళీగా ఉంటున్న హరీష్ శంకర్ ఎట్టకేలకు ఈ సంవత్సరం ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకైతే వచ్చాడు.అయితే ఈ సినిమా లో హరీష్ శంకర్ రాసుకున్న స్క్రీన్ ప్లే అయితే చాలా వరకు తేడా కొట్టిందనే చెప్పాలి. ఇక ఆయన క్యారెక్టర్లను ఎస్టాబ్లిష్ చేసిన విధానం కూడా చాలా వరకు నిరాశపరిచింది. ఎక్కడ కూడా సినిమాకి సంబంధించిన ఎలివేషన్స్ గాని, ఎమోషన్స్ గాని వర్కౌట్ చేసే విధంగా ఆయన ప్రయత్నం చేయలేదు...ఇక ముఖ్యంగా ఈ సినిమాలో హరీష్ శంకర్ రవితేజ ను ప్రజెంట్ చేసిన విధానం కూడా ప్రేక్షకుల్లో ఇంపాక్ట్ చూపించలేకపోయింది...ఇక రవితేజ ఈ సినిమాలో కొంచెం డల్ గా కనిపించినట్టుగా అనిపించింది. అలాగే చమ్మక్ చంద్ర, ప్రభాస్ శీను మధ్య వచ్చే కామెడీ కొంతవరకు పర్లేదు అనిపించింది.
కానీ ప్రభాస్ శీను కి గురూజీ అనే పేరు పెట్టాడు. ఇక దీన్ని బట్టి హరీష్ శంకర్ త్రివిక్రమ్ ను టార్గెట్ చేశాడా అనే విధంగా కొన్ని కామెంట్లు కూడా వస్తున్నాయి... ఇక మొత్తానికైతే హరీష్ శంకర్ ఆర్టిస్టులను వాడుకునే స్కోప్ ఉన్నప్పటికీ ఒక్కో క్యారెక్టర్ ను చాలా లిమిటెడ్ గానే వాడుకున్నాడు. కొన్ని సీన్లని కనక స్పెషల్ గా రాసుకున్నట్లయితే సినిమా మీద ఇంపాక్ట్ భారీ రేంజ్ లో ఉండేది. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం హరీష్ శంకర్ చాలా వరకు మిస్టేక్స్ అయితే చేశాడు. ఆల్రెడీ రీమేక్ సినిమానే కావడం వల్ల ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది.
ఇక ఫస్ట్ హాఫ్ లో వచ్చిన లవ్ స్టోరీ మొత్తం సినిమాకి భారీ మైనస్ గా మారింది. అసలు ఏమాత్రం జీవం లేని సీన్లను రాసుకున్న హరీష్ శంకర్ వాటితో ప్రేక్షకుడి ని ఎలా ఎంగేజ్ చేస్తాను అనుకున్నాడో అతనికే తెలియాలి... ఇక తనికెళ్ల భరణి క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ అయితే ఉంది. కానీ ఆ క్యారెక్టర్ ను ఇంకా ఫుల్ లెంత్ గా వాడుకొని ఉంటే బాగుండేది. ఇక రవితేజ ఎమోషనల్ గా టచ్ అయ్యే సీన్లు అయితే ఏమీ చేయలేదు. అందువల్ల సినిమాని చూసే ప్రేక్షకులు ఆ క్యారెక్టర్స్ ను సినిమాను ఓన్ చేసుకోలేకపోయారు. ఎంతసేపు సినిమా ను చూస్తున్నామా అంటే చూస్తున్నాం అనే ఫీల్ కలుగుతుందే తప్ప పెద్ద గా మ్యాజిక్ అయితే అనిపించదు.
ఇక ఈ సినిమా చివరి సాంగ్ లో దేవిశ్రీప్రసాద్ కనిపిస్తాడు. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఆయన్ని తీసుకుంటే బాగుండేది. మిక్కిజే మేయర్ లాంటి ఒక అవుట్ డేటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ను తీసుకోవడం వల్లే ఈ సినిమా లో ఎమోషన్ అనేది అంత పెద్దగా వర్కౌట్ అయితే అవ్వలేదు. ఆయన ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమా మీద ఏ మాత్రం ప్రభావాన్ని చూపించలేకపోయింది...
ఎప్పుడైనా ఒక సీన్ రాసుకున్నప్పుడు అది ప్రేక్షకుడిని ఎంగేజ్ చేస్తుందా లేదా అనేది ఒకటికి పది సార్లు చెక్ చేసుకోవాలి. ఏది పడితే అది రాసుకొని ప్రేక్షకులు మీద వదిలేద్దాం అని చూస్తే మాత్రం దర్శకుడు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరమైతే ఉంటుంది. ఇక ఇదిలా ఉంటే సిద్దు జొన్నలగడ్డ ఇచ్చిన క్యామియో రోల్ కూడా చాలా బాగా వర్కవుట్ అయింది. ఇక ఈ సినిమాకి ఆయన ఎపిసోడ్ హైలెట్ గా నిలిచిందనే చెప్పాలి...
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
జగపతిబాబు, రవితేజ పోటా పోటీగా నటించారు. వీళ్ళ మధ్య వచ్చిన సీన్లు సినిమా చూసే ప్రతి ప్రేక్షకుడికి చాలావరకు నచ్చాయి. అయినప్పటికీ వాళ్ళ మధ్య ఇంకొన్ని సీన్స్ అయితే బలంగా పడుంటే సినిమా ఫేట్ అనేది మారిపోయి ఉండేది... ఇక వీళ్ల తర్వాత మిగిలిన పాత్రలు పోషించిన ప్రతి ఒక్కరు వాళ్ళ పాత్రల పరిధి మేరకు నటించారు. ఇక ఈ సినిమాలో పాత్రలకు కూడా పెద్దగా గుర్తింపు లేకపోవడం వల్ల కూడా ఈ సినిమాలో ఎవ్వరూ హైలైట్ అవ్వలేకపోయారు... తనికెళ్ల భరణి కొంతవరకు ప్రయత్నం చేసినప్పటికి ఆయనకి ఇంకా స్క్రీన్ టైమ్ ఇచ్చి ఫాదర్ అండ్ సన్ ఎమోషన్స్ చాలా బలంగా రాసుకుంటే బాగుండేది. అలా కాకుండా తనికెళ్ల భరణి క్యారెక్టర్ ని వాడుకొని ఇంకా బాగా ఎలివేట్ చేసి ఉండాలి. అలాగే ఎమోషన్స్ ను కూడా కట్టిపడేసెంతలా రాసుకోవడానికి స్పేస్ అయితే ఉంది. కాబట్టి దాని మీద కొంచెం దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. అలా చేస్తే తనికెళ్ళ భరణి క్యారెక్టర్ కి కూడా చాలా మంచి గుర్తింపు వచ్చేది...
టెక్నికల్ అంశాలు
ఇక టెక్నికల్ అంశాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మ్యూజిక్ తో మిక్కీ జే మేయర్ భారీ దెబ్బేశాడు. అలాగే సినిమాటోగ్రాఫర్ కూడా విజువల్స్ రూపంలో పెద్దగా గ్రాండీయర్ లేకుండా విజువల్స్ ను చూపించాడు అందుకే ప్రతి షాట్ ఎక్కడో ఇక చోట చూసినట్టుగానే అనిపిస్తుంది. ఈ ఈ సినిమా కోసం ఆయన ఏ మాత్రం డిఫరెంట్ షాట్స్ ను వాడే ప్రయత్నం అయితే చేయలేదు. రొటీన్ రెగ్యులర్ ఫార్మాట్లోనే యాంగిల్స్ ను పెట్టి ఈ సినిమాని తీశారు... ఇక ఎడిటర్ కూడా ఈ సినిమా విషయం లో కొంతవరకు తన పనితనాన్ని చూపించి ఉంటే బాగుండేది...
ప్లస్ పాయింట్స్
సెకండ్ హాఫ్ లో వచ్చిన కొన్ని సీన్లు...
సత్య కామెడీ...
సిద్దు జొన్నలగడ్డ గెస్ట్ అప్పియరెన్స్
మైనస్ పాయింట్స్
మ్యూజిక్
కథలో చేసిన మార్పులు
విజువల్స్
దర్శకుడు : హరీష్ శంకర్
నటీనటులు. :రవితేజ, భాగ్య శ్రీ, సత్య, తనికెళ్ళభరణి,జగపతి బాబు తదితరులు...
సినిమాటోగ్రాఫర్ : అయంకా బోస్
ఎడిటర్. : ఉజ్వల్ కులకర్ణి
బ్యానర్. : పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ
ప్రొడ్యూసర్స్. : టీజీ విశ్వ ప్రసాద్....


Tags:    

Similar News