'ఎగ్జుమా' మూవీ OTT రివ్యూ!

థియేటర్లో హారర్ ని ఆస్వాదించే ఒక సెటప్ ఆడియన్స్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు.;

Update: 2025-02-19 10:16 GMT

థియేటర్లో హారర్ ని ఆస్వాదించే ఒక సెటప్ ఆడియన్స్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. గతంతో పోల్చుకుంటే డైరెక్ట్ గా థియేటర్ లోకి హారర్ సినిమాల రాక తగ్గింది. అయినప్పటికీ అప్పుడప్పుడు ఇలాంటి హారర్ కి మళ్ళీ కొత్త కళ వచ్చింది. హారర్ ని సరిగ్గా తీయగలిగితే.. ఆ జోనర్ చిత్రాలకు ప్రేక్షకుల ఆదరణలో లోటు వుండదని చాలా సార్లు నిరూపితం అయ్యింది. ముఖ్యంగా కొరియా, జపాన్ లలో హారర్ చిత్రాలకు ప్రత్యేకమైన కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ క్రమంలోనే దక్షిణ కొరియా నుంచి ఇప్పుడు మరో హారర్ సినిమా 'ఎగ్జుమా' ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ చిత్రం హారర్ ని ఇష్టపడే ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించగలిగింగా. టీజర్, ట్రైలర్స్ ఉన్న ఆసక్తి సినిమాలో కొనసాగిందా? ఇందులో హారర్ ఎలిమెంట్స్ ప్రేక్షకులకు థ్రిల్ ఇవ్వ‌గ‌లిగాయా?

స్టోరీ లైన్

అమెరికాలో ఓ పెద్ద డబ్బున్న కొరియా కుటుంబంలో మగ పిల్లాడు పుడతాడు. అయితే ఆ పిల్లాడు పుట్టిన దగ్గరనుంచి ఏడుపు ఆపడు. డాక్టర్స్ అంతా చేతులు ఎత్తేస్తారు. దాంతో వేరే ఆప్షన్ లేక అతీంద్రియ శక్తులను డీల్ చెయ్యగలిగేవాళ్లను ఆహ్వానిస్తారు. కొరియా నుంచి లీ హారీమ్ (కిమ్ జో ఎన్) బోంగిల్ (లీ డ్యూ హ్యాన్) వస్తారు. వాళ్లు ఆ పిల్లాడని పరిశీలించి ఆ పిల్లవాడు చనిపోయిన తాత ఆ కుటుంబంపై కోపంగా ఉన్నాడని, ఆయనే తన మనవడుని ఇబ్బంది పెడుతున్నారని చెప్తారు.

అందుకు పరిష్కారంగా ఆ ముసలాయన శవాన్ని పూడ్చిన మార్చాలని చెప్తారు. ఆ పూడ్చిన చోటు మంచిది కాదని, అక్కడి నుంచి దానిని వెలికితీసి మరో ప్రదేశంలో పూడ్చడం వలన ఆ ప్రేతాత్మ శాంతిస్తుందని చెబుతారు. కొందరితో కలిసి అడవిలోని ఒక కొండపైకి వెళ్లి అక్కడ ఆ పిల్లాడి తాత సమాధిని తవ్వుతారు. అయితే వర్షం కారణంగా ఆ శవపేటికను మరో చోటుకు తరలించలేకపోతారు.

ఈ లోగా ఆ శవపేటికలో నిధి ఉండొచ్చని ఒక వ్యక్తి దానిని తెరవడానికి ప్రయత్నించగా, అందులోని ప్రేతాత్మ బయటికి వస్తుంది. కొంతమందిపై ప్రతీకారం తీర్చుకునే దిశగా అది ముందుకు వెళుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అదే సమాధిలో నుంచి మరో శవపేటిక బయటపడుతుంది. ఆ శవపేటిక ఎవరిది? దానిని వెలికి తీయడం వలన చోటుచేసుకునే పరిణామాలు ఎలాంటివి? అనేది కథ.

ఎలా ఉంది

భయం కూడా ఓ కమర్షియల్ ఎలిమెంటే అని సినిమా వాళ్ళు ఎప్పుడో కనుక్కున్నాడు. అందుకు తగ్గట్లే కథలు తయారు చేసి వదిలి హిట్ కొడుతుంటారు .ప్రేక్షక జనం కూడా భయపడటానికి, అందులోని థ్రిల్ ఎంజాయ్ చేయడానికి రెడీ అవుతూంటారు. ఈ క్రమంలోనే హారర్ సినిమాల జోనర్ ప్రపంచవ్యాప్తంగా సూపర్ పాపులర్ అయ్యింది. ముఖ్యంగా కొరియా, జపాన్ హారర్ సినిమాలకు పాపులారిటీ ఎక్కువ. అక్కడ హారర్ చిత్రాలు విజయాల స్ఫూర్తితో ప్రతి యేడు బోలెడన్ని సినిమాలు తయారయ్యాయి. ఒక్కో సీజన్ లో ఐతే.. హారర్ చిత్రాలు దాడి చేసాయనే చెప్పుకోవాలి. ముఖ్యంగా చిన్న సినిమా అంటే.. హారర్ సినిమా నే.

అలాగే ఈ సినిమాని కూడా హారర్ ని అన్ని యాంగిల్స్ లోనూ, ప్రతీ సీన్ లోనూ కూర్చి వదిలారు. అయితే కథగా గొప్పగా ఏమీ ఉండదు. అయితే స్టైల్ గా తీసిన విధానం, దర్శకుడు భయపెట్టడానికి ఎంచుకున్న షాట్స్ కొత్తగా అనిపిస్తాయి. ఏదో ఊర సినిమా లాగా, చీప్ గా ఈ హారర్ ఫిల్మ్ తీయలేదు. ఫస్టాఫ్ ఓకే అనిపించినా, సెకండ్ హాఫ్ కథలో వేగం పెరుగుతుంది. సమాధిలోంచి ప్రేతాత్మ బయిటకు రావడం, వర్షంలో శవ పేటికను తెరవటం, అక్కడ నుంచి జరిగే బీభత్సం చూసే ప్రేక్షకులకు థ్రిల్ ని పంచుతాయి.

ఎవరెవరిని దెయ్యం ఎలా చంపుతుంది? అనేది ఆసక్తి రేకెత్తించే అంశమే అయినా రొటీన్ కథ, ప్రెడిక్టబుల్ సీన్స్ దాని తీవ్రతను తగ్గించివేస్తాయి. ఈ సినిమాలో అతి పెద్ద సమస్య కథ చాలా నెమ్మదిగా సాగటం. డి టెయిలింగ్ అవసరానికి మించి ఉండటం. సీరియస్ గా సినిమా చూసే వాళ్ళకి, ఫిల్మ్ మేకర్స్ కి ఇది నచ్చుతుందేమో కానీ అంత స్లో నెస్ భ‌రించ‌డం స‌గ‌టు ప్రేక్షకుడి క‌ష్ట‌మే అనిపిస్తుంది.

టెక్నికల్ గా

టెక్నికల్ గా సినిమా మంచి స్టాండర్డ్స్ లో ఉంది. సినిమా లొకేషన్స్ కొద్ది సేపు ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. నిర్మాణంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ముఖ్యంగా సెట్ ప్రాపర్టీని కథకు అణుగుణంగా హారర్ ఎలిమెంట్స్ కు తగినట్లుగా మలిచారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రధాన ఆకర్షణ. ఆద్యంతం థ్రిల్ పంచేలా వుంది బీజీఎం. వర్షంలో సమాధి తెరవటం వంటి సీన్స్ చాలా డెప్త్ తీసుకొచ్చారు. తెలుగు డబ్బింగ్ బాగానే కుదిరింది.

చూడచ్చా

హారర్ చిత్రాలు చూడటానికి ఆసక్తి ఉన్నవాళ్లకు మంచి కాలక్షేపం ఇస్తుంది సినిమా . అలాగే సీరియస్ సినీ గోయర్స్ కి, క్రాఫ్ట్ ని ఇష్టపడే వారికి నచ్చే సినిమా ఇది.

ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది

అమెజాన్ ప్రైమ్ ఓటిటి లో తెలుగులో ఉంది

Tags:    

Similar News