వెబ్‌సిరీస్ రివ్యూ కాళ్లజెర్రి నడకలో దాగిన మిస్టరీ "కంఖాజుర్"

ఈ సిరీస్ హిందీతో పాటు ఇతర భాషలలో కూడా అందుబాటులో ఉంది. ఈ సీరిస్ ఎలా ఉంది, చూడదగినదేనా? చూద్దాం;

Update: 2025-06-02 11:31 GMT

హిందీలో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘కంఖజూర్’ రిలీజ్ కు ముందు నుంచి మంచి బజ్ క్రియేట్ చేసింది. రోషన్ మాథ్యూ, మోహిత్ రైనా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సస్పెన్స్‌ ప్యాక్ డ్రామాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఆరేళ్ళ క్రితం వచ్చిన 'మాగ్ పై' (Magpie) అనే ఇజ్రాయిలీ వెబ్ సీరిస్ ను 'కంఖాజుర' (KanKhajura) పేరుతో రీమేక్ చేసారు. చందన్ అరోరా దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్ హిందీతో పాటు ఇతర భాషలలో కూడా అందుబాటులో ఉంది. ఈ సీరిస్ ఎలా ఉంది, చూడదగినదేనా?

స్టోరీ లైన్

మ్యాక్స్ (మోహిత్ రైనా) డబ్బున్న కుటుంబానికి చెందిన నిషాతో పెళ్లై, విలాసవంతంగా హ్యాపీగా జీవితం గడుపుతుంటాడు. వారి సంతానం ‘ఇరా’. మ్యాక్స్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ‘మ్యాక్స్ డెవలపర్స్’ కంపెనీని నడిపిస్తూంటాడు. అతని వ్యాపార సలహాదారులు చిన్నప్పటి స్నేహితులు అయిన శార్దూ, పెడ్రో. అంతా ప్రశాంతంగా ఉందన్నకున్న జీవితంలో అలజడి తమ్ముడు రూపంలో వస్తుంది.

14 ఏళ్ల తర్వాత అతని తమ్ముడు అషూ (రోషన్ మాథ్యూ), గోవా సెంట్రల్ జైలు నుంచి విడుదలవుతాడు. చిన్నతనం నుండి అతన్ని ‘నత్తి’ . రరకరాల క్రైమ్ లు, మర్డర్ కేసుల కారణంగా జైలు శిక్ష అనుభవించిన అషూ, బయటకు వచ్చి అన్నయ్య మ్యాక్స్‌తో కలుసుకొని, అతని బిజినెస్ లో జాయిన్ అవ్వాలనుకుంటాడు. కానీ మ్యాక్స్ తమ్ముడుని కొంతవరకే చేరదీస్తాడు. దాంతో శాస్త్రి నగరంలో చిన్న రెంటు గదిలో ఉండిపోతాడు.

మరో ప్రక్క మ్యాక్స్ ...శాస్త్రి నగరంలో తన కొత్త ప్రాజెక్టును ప్రారంభించాలని నిర్ణయించుకుంటాడు. కాలువ ఒడ్డున ఉండే శాస్త్రి కాలనీ వాసుల నుండి భూమిని తీసుకుని అక్కడ విల్లాస్ నిర్మించాలన్నది అతని కల. కానీ ఆ ప్రాంతంలో లేడీ దేశ్ ముఖ్‌ బాయిదే రాజ్యం ఆమె పెద్ద కొడుకు సూర్య, చిన్న కొడుకు బాబియా ఆ ప్రాంతాన్నిరౌడీయిజంతో ఏలుతూంటారు. వారితో అనుమతి లేకుండా అక్కడ బిజినెస్ మొదలుపెట్టడం అసాధ్యం.

ఈ నేపథ్యంలో మ్యాక్స్‌కు ఏం చేయాలో అర్దం కాదు. అప్పుడు అషూ రంగంలోకి దిగితాడు..అన్నయ్య మీద ఉన్న పిచ్చి ప్రేమతో అతను ఈ ప్రాజెక్ట్ కు ఎదురైనా ప్రతి అవరోధాన్ని తప్పిస్తుంటాడు.అతను ఏం చేసాడు? దాని ఫలితం ఏమిటి...అతను ఎందుకు ఇంతకాలం జైలు కాలం గడిపాడు? అతని ప్రస్తుత పరిస్థితికి కారణమైన వారెవరు? ఈ ప్రశ్నలకు సమాధానాలు సిరీస్ కథలో వెలుగుచూస్తాయి.

విశ్లేషణ

క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లో వచ్చిన ‘కంఖజూర్’ యూనిక్ కంసెప్ట్, మల్టీ లేయర్స్ స్టోరీటెల్లింగ్ వల్ల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ఈ సిరీస్‌లో మనం సాధారణ క్రైమ్ కథ మాత్రమే కాకుండా, పాత్రల మానసిక లోతులు, సామాజిక ఒత్తిడులు, బిజినెస్ రాజకీయాలు అన్నీ కాంప్లెక్స్ గా intertwine అయ్యి నడుస్తూంటాయి.

సీరీస్ ప్లాట్ స్లో బర్న్ మోడల్‌లో మెల్లిగా సాగుతుంది. ఇది వేగంగా ఒకే దారిలో కాకుండా, ప్రతి ఎపిసోడ్‌లో కొత్త రివీలేషన్స్‌తో మిస్టరీని deepen చేస్తుంది.సోషియో-పాలిటికల్ ఫ్రేమ్‌వర్క్ ని ఈ సీరిస్ అర్దమయ్యేలా చూపెడుతుంది. దేశ్ ముఖ్ బాయి రౌడీ ఎరియా ఆధిపత్యం ద్వారా ఇండియన్ సబ్‌కల్చర్ లో నేర మనస్థత్వం ఎలా రాజ్యం చేసిందో చూపించటం, ఏరియా రాజకీయాల ఆంతర్యాలు క్లియర్‌గా చూపెడుతుంది.

అయితే కొన్నిసార్లు, స్లో పేసింగ్ వలన యూజర్ ఇంట్రెస్ట్ కొంత తగ్గే అవకాశం ఉంది. కొంతమంది క్రైమ్ థ్రిల్లర్స్‌లో కంటిన్యూస్ యాక్షన్, ఎక్కువ మిస్టరీ అనుకునే ప్రేక్షకులకు ఇది ఇబ్బందిగా అనిపిస్తుంది.

కొన్ని సబ్ఫ్లాట్స్ పూర్తిగా క్లియర్ కావడం లేదు, ఇది సిరీస్ క్లారిటీని కొంత మేర తగ్గించింది.

టైటిల్ జస్టిఫికేషన్

'కంఖాజుర' అంటే కాళ్ళ జెర్రి అని అర్థం. టైటిల్ కు తగ్గట్లుగా తేలికగా, అంతర్ముఖంగా, కానీ అంతరాలలో ఏదో ప్రమాదకరం నడిచి వస్తున్నట్టు అనిపిస్తూంటుంది. ఆషు నడక, అతని వాడని మాటలు, అతని నిగూఢ భావోద్వేగాలన్నీ — నిజంగానే మనకు ఆ జెర్రిని గుర్తుచేస్తాయి. అంతుచిక్కని, నెమ్మదిగా, కానీ ఖచ్చితంగా ఎదో మిగిలేలా ఉండే అతని స్వభావం, ఈ టైటిల్‌కు పూర్తి న్యాయం చేసింది.

అయితే ఈ ఫస్ట్ సీజన్‌లో అతని అంతర్గత ప్రపంచం పూర్తిగా తెరపైకి రాలేదు. అతనిలో నిజంగా ఏం నడుస్తోంది? అతని అసలు ఉద్దేశ్యం ఏమిటి? అన్నదానికీ స్పష్టత ఇవ్వకుండా, చివరిలో చీకట్లోకి నడిపిస్తూ మళ్లీ ఆ ప్రశ్నలనే మిగిల్చారు. దీంతో రెండో సీజన్‌పై ఉత్కంఠ పెరిగింది.

టెక్నికల్ గా ..

కెమెరావర్క్ & మూడ్: మూడ్ చాలా డార్క్, గ్రిట్టీగా ఉండటం థ్రిల్లర్ టోన్ కి నచ్చింది. క్లోస్-అప్‌లు, హైకాంట్రాస్ట్ లైటింగ్ పాత్రల భావోద్వేగాలను మరింత ప్రతిబింబిస్తూ సాగాయి.సినిమాటోగ్రఫీ ఏకకాలంలో అందంగా,ఏదో ఎదర చూడబోతున్నాం అనే ఫోర్ షాడోయింగ్ ఇస్తూ ఉంటుంది.

'కంఖాజుర్' వెబ్‌సిరీస్ టెక్నికల్ టీమ్ పనితీరుని అభినందించక తప్పదు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ టెన్షన్‌ను బలంగా బల్డప్ చేస్తుంది. ఎడిటింగ్ టెంపోను పట్టు తప్పకుండా నడిపిస్తుంది. కానీ… కొన్ని కథానిర్మాణ లోపాలు ఆ ప్రభావాన్ని కొద్దిగా తగ్గించాయి.

నటీనటుల్లో ..

‘కంఖాజుర్’లో ప్రధాన పాత్ర “మాక్స్”గా మోహిత్ రైనా తన పాత్రను అద్భుతంగా చేసారు. ఆర్థికాధిక్యంలో ఉన్న వ్యక్తి, బంధాల గాయాల మధ్య ఒదిగిపోయే మనిషిగా ఆయన ప్రదర్శనలో నిజాయితీ కనిపిస్తుంది. అతని భార్యగా నిషా పాత్రలో కనిపించిన సారా జేన్ డియాజ్ (పవన్ కళ్యాణ్ ‘పంజా’ ఫేమ్) బాగానే ఒదిగిపోయింది.

శాస్త్రి నగరాన్ని గుప్పెట్టు పట్టే లేడీ డాన్ దేశ్ ముఖ్‌ బాయిగా ఉషా నాదకర్ణి నటన ప్రత్యేకంగా నిలిచింది. ఆమె డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ పాత్రను మరింత బలంగా నిలబెట్టాయి. నిజ జీవితంలో ట్రాన్స్‌జెండర్ అయిన త్రినేత్ర హాల్దార్ గుమ్మరాజు, అదే తరహా పాత్రలో కనిపించి, తన స్వానుభూతిని నటనగా మార్చడం ద్వారా స్క్రీన్‌పై మానవత్వం మెరిపించారు. మిగతా పాత్రల్లో సీనియర్ నటులు న్యాయం చేసారు.

చూడచ్చా

సీరిస్ లో కొన్ని చోట్ల కనిపించే ఎరోటిక్ సన్నివేశాలు, ఫౌల్ లాంగ్వేజ్ ఓ వర్గానికి మాత్రమే అన్నట్లు పరిమితం చేస్తాయి. మొత్తం ఫ్యామిలీ ఆడియన్స్‌కి దూరం కావాల్సిన అవసరాన్ని కలిగించాయి. ఇవి తొలగించి ఉంటే, ఇది అందరూ కూర్చొని ఆస్వాదించదగిన కథనంగా ఉండేది.

ఫైనల్ థాట్

"కంఖాజుర్" — నెమ్మదిగా నడిచే నీడల వెనక దాగి ఉన్న మౌనమైన మాయాజాలం ప్రదర్శించాలనేది దర్శకుడు ఆలోచన అని అర్దమవుతుంది. ఒక్కో పాత్ర వెనక మరో విషయం దాగి ఉంది. ఒక్కో చూపు వెనక మరో ఉద్దేశం ఉంది. తొలి సీజన్ — మర్మానికి మౌనం చెప్పిన అధ్యాయం. రెండో సీజన్ — ఆ మౌనానికి అర్థం చెప్పాల్సిన వంతు.

ఎక్కడుంది

సోనీ లివ్ లో ఎనిమిది ఎపిసోడ్స్ లో దొరుకుతోంది. తెలుగులోనూ ఉంది.

Tags:    

Similar News