'అబ్రహం ఓజ్లర్' హాట్ స్టార్ మూవీ రివ్యూ

లాస్ట్ ఇరవై నిమిషాల్లో వచ్చే మలపుల్ని బాగానే తీర్చిదిద్దారు. అందులో కొన్ని మలుపులు థ్రిల్ చేస్తే.. ఇంకొన్ని మాత్రం అవసరానికి మించి వున్నట్లు అనిపిస్తాయి

By :  Admin
Update: 2024-04-01 14:17 GMT

ఓటీటీల పుణ్యమా అని మనవాళ్లు మళయాళ క్రైమ్ థ్రిల్లర్స్ ని బాగానే ఆదరిస్తూ వస్తున్నారు. మన తెలుగులో ఈ జానర్ సినిమాలు అతి తక్కువ కాబట్టి వాటిని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. అది ఎంతదాకా వెళ్లారు అంటే మనవాళ్లు సినిమా మొదలు కాగానే క్లైమాక్స్ లో విలన్ ఎవరో..మర్డర్స్ ఎవరు చేస్తున్నారో ఊహించేగలిగేటంత . అలా ఊహించేసి తమ ఊహ నిజమా కాదా అని ఆ సినిమాలు చూసే జనం పెరిగిపోయారు. ప్రతీ దానికి ఓ స్టాగనేషన్ పీరియడ్ ఉంటుంది. కొంతకాలం అదే పనిగా ఒకే రకమైన సినిమాలు చూడాలంటే బోర్. అదే ఇప్పుడు మళయాళ క్రైమ్ థ్రిల్లర్స్ విషయంలో జరుగుతోందనిపిస్తోంది. ఈ టైమ్ లో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అబ్రహం ఓజ్లర్' అంటూ ఓ క్రైమ్ థ్రిల్లర్ దిగింది. ఈ సినిమా అక్కడ థియోటర్స్ లో బాగానే ఆడింది. మరి మన తెలుగువాళ్లకు నచ్చుతుందా .. ఎలా ఉంది

కథేంటంటే...
కేరలోని త్రిస్సూర్ లో పోలీస్ ఆఫీసర్ గా పనిచేస్తూంటాడు అబ్రహం ఓజ్లర్ (జయరామ్). ఆయన తన భార్య అనీషా, కూతురు జెన్నీలతో సరదా ట్రిప్ కు మున్నార్ వెళతాడు. అయితే అక్కడ ఓ ఘోరం జరిగుతుంది. అబ్రహం లేని టైమ్ లో అతని భార్య పిల్లలను వినీత్ (అర్జున్ అశోకన్) అనే వాడు చంపేస్తాడు. పెద్దగా శ్రమపడకుండానే పోలీసులకు దొరికిపోతాడు. నేరం ఒప్పుకుంటాడు . ఓజ్లర్ భార్య బిడ్డలను తాను చంపినట్టుగా గుర్తు ఉందనీ, అయితే ఆ శరీర భాగాలను ఏం చేశాననేది తనకి గుర్తు లేదని వినీత్ చెబుతాడు. తాను డ్రగ్స్ తీసుకోవడమే అందుకు కారణమని అంటాడు. డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన అబ్రహం రిజైన్ చెయ్యాలనుకుంటాడు. కానీ పై ఆఫీసర్స్ ఆపుతారు. దాంతో అతని భార్యా ,కూతురు ఏమైందో తెలుసుకోవటం కోసం ఆ కిల్లర్ వినీత్ ని కంటిన్యూగా కలుస్తూనే ఉంటాడు. అదే టైమ్ లో ఆ ప్రాంతంలో వరస మర్డర్స్ మొదలవుతాయి. చంపినవాడు...సర్జికల్ బ్లేడుతో గాయం చేసి చంపేస్తున్నాడని తెలుస్తుంది.
ఇప్పుడు ఆ సీరియల్ కిల్లర్ కేసును ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన బాధ్యత అబ్రహం ఓజ్లర్ (Abraham Ozler ) తీసుకుంటాడు. ఇప్పటికే ఆ కిల్లర్ ముగ్గురుని చంపేసాడు. వాళ్లలో ఐటీ ఉద్యోగి, ఓ చిన్న రౌడీ, హోటల్ యజమాని ఉంటారు. నాలుగో మర్డర్ జరగకుండా ఆపాలి. అందుకోసం ఇన్విస్టిగేషన్ మొదలెడతాడు. ఆ చనిపోయిన వాళ్లు ఒకరికొకరు ఏమైనా అవుతారా..రిలేషన్ ఉందా అని అనుమానిస్తాడు. మరో ప్రక్క అక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టర్ గా పనిచేస్తున్న డాక్టర్ అరుణ్ .. అతని అక్క సుజా (అనశ్వర రాజన్) గురుంచి తెలుస్తుంది. అక్కడ నుంచి ఆ కేసు అనేక మలుపులు తిరుగుతూ, గతంలో గొంతు ఆపరేషన్ చేయించుకుని 'మాట' కోల్పోయిన కృష్ణదాస్ (సజూ కురుప్) దగ్గర ఆగుతుంది. అలాగే అలెగ్జాండర్ (మమ్ముట్టి) కు ఈ కేసుకు సంభందం ఉందని తెలుస్తుంది. అసలు ఎవరు ఈ హత్యలు చేసారు. అలాగే 'అబ్రహం ఓజ్లర్' భార్య,పిల్లలు ఏమయ్యారు ఏం చేశాడనేది తెలుసుకోవడానికి చేసే ప్రయత్నం ఫలిస్తుందా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
క్రైమ్ థ్రిల్లర్స్ లు తీయాలంటే మళయాళీలే ఎలాగో పేరు వచ్చేసింది కాబట్టి దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నాలు నిరంతరం చేస్తున్నారు అక్కడ దర్శక,నిర్మాతలు. అయితే ప్రతీ సారి వారికి క్రైమ్ థ్రిల్లర్ కు కథ దొరుకుతున్నా హీరోలు మాత్రం దొరకటం లేదు. దాంతో జయరామ్ లాంటి సీనియర్స్ ని సీన్ లోకి లాక్కొచ్చేసి పోలీస్ ఆఫీసర్ లను చేసేసి తెరకెక్కించేస్తున్నారు. జయరామ్ అంటే క్రేజ్ సరిపడనంత రాదనుకున్నారో ఏమో కానీ ముమ్మట్టిని సైతం ఓ కీలకమైన పాత్రలోకి తీసుకొచ్చి రూపొందించిన చిత్రం ఇది. 'నిజానికి ఈ సస్పెన్స్ థ్రిల్లర్ కి తగ్గ అన్ని ఎలిమెంట్స్ కుదిరాయి. అయితే ఇలాంటి కథలకు స్క్రీన్ ప్లే ఫెరఫెక్ట్ గా ఉండాలి. చిక్కుముళ్ళు వేయటమే కాకుండా విప్పే నేర్పు కూడా వుండాలి. అసలు ఈ హత్యలని చేస్తోంది ఎవరు...ప్రేరేపించింది ఎవరు ? అని తెలుసుకోవాలనే ఆసక్తి సహజంగానే వుంటుంది. ఈ దిశగా జరిగే విచారణలో ఉత్సుకత వుండాల్సింది. కానీ హీరో జరిపే విచారణ కాస్త లేజీగా అనిపిస్తుంది. అలాగే ప్రేక్షకులు థ్రిల్ ఇచ్చే క్రమంలో లాజిక్ కి అందని కొన్ని సీన్స్ ని సినిమాటెక్ లిబర్టీని వాడుకుని రాసుకున్నారు. అసలు కథఏంటో చెప్పే కీన్ సీన్స్ లో లాజిక్ ని చెప్పే క్రమం చాలా హాడావిడి జరిగిపోయన ఫీలింగ్ వచ్చింది.
అయితే ఓటీటీ సినిమానే కాబట్టి కాస్త ఆగి...అవసరమైతే వెనక్కి వెళ్లి చూసుకునే వెసులుబాటు వుంది కాబట్టి ఇబ్బంది అనిపించదు. అన్నిటికన్నా ముఖ్యమైనది తెలిసిన కథ అనే ఫీలింగ్ రావటం దాంతో కథలో థ్రిల్ పోయింది. లాస్ట్ ఇరవై నిమిషాల్లో వచ్చే మలపుల్ని బాగానే తీర్చిదిద్దారు. అందులో కొన్ని మలుపులు థ్రిల్ చేస్తే.. ఇంకొన్ని మాత్రం అవసరానికి మించి వున్నట్లు అనిపిస్తాయి. సినిమాకు అత్యవసరమైన ఫ్లాష్ బ్యాక్ ఇంకాస్త ఇంట్రస్టింగ్ గా చెప్తే బాగుంది. అలాగే స్లో నేరేషన్ లో ఇలాంటి కథలు చూడాలంటే విసుగొచ్చేసింది. అసలు ఎవరు హత్యలు చేస్తన్నారో తెలిసిపోయాక..ఇంక ఇంట్రస్ట్ గా ఎంతసేపు అని కూర్చోగలం. ఏదైమైనా పోలీస్ కథగా యాక్షన్ లేదు. థ్రిల్లర్ గా థ్రిల్స్ గొప్పగా లేదు. మళయాళ పరిశ్రమ ఈ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా సినిమాలకు కొంత కాలం గ్యాప్ ఇస్తే మంచిదనిపించింది.
చూడచ్చా?
క్రైమ్ థ్రిల్లర్ పై మోజు మీకు ఇంకా ఉంటే ఈ సి నిమాపై ఓ లుక్కేయచ్చు
ఎక్కడ చూడాలి
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (తెలుగు వెర్షన్ ఉంది)


Tags:    

Similar News