'బాహుబలి ఎపిక్': 3 రోజుల్లోనే డ్రాప్? ఎందుకిలా?

హైప్ భారీ… భాక్సాఫీస్ ఖాళీ

Update: 2025-11-06 06:42 GMT

‘బాహుబలి’ పేరు చెబితేనే ప్రేక్షకుల్లో ఉత్సాహం. అందుకే మళ్లీ రెండు భాగాల్ని ఎడిట్ చేసి , ఒకటిగా చేసి ‘బాహుబలి: ది ఎపిక్’గా విడుదల చేసినప్పుడు, ఫ్యాన్స్ ఎక్స్‌సైట్మెంట్ పీక్‌లోకి వెళ్లారు. రాజమౌళి – ప్రభాస్ – రానా కలిసి చేసిన ప్రమోషన్‌ కూడా హైప్ మూడింతలు చేసింది.

కానీ… తొలి రెండు రోజులు ఫుల్ జోష్, కానీ వాష్‌అవుట్ మూడో రోజు నుంచే ప్రారంభమైంది. కౌంటర్ల దగ్గర ఉత్సాహం తగ్గింది.

ఫ్యాన్స్ ఫుల్ ఫైర్… కామన్ ఆడియన్స్ కూల్!

మొదటి రెండు రోజులు రచ్చ రచ్చ చేసారు ఫ్యాన్స్. స్క్రీన్స్ ముందు సెలెబ్రేషన్, నినాదాలు, బ్లాక్‌బస్టర్ వైబ్స్. కానీ సాధారణ ప్రేక్షకులు?

“సరే… చూశాం గదా” అన్నట్టే పాస్ అయ్యారు. ఇది కొత్త సినిమా కాదన్న విషయం స్పష్టంగా థియేటర్లు ఖాళీగా ఉండటమే చెప్పేశాయి.

 కలెక్షన్స్: హైప్ vs గ్రౌండ్ రియాలిటీ

బాహుబలి 1 + 2 కలిపి వసూళ్లు — ₹2400 కోట్లు

రీ-రిలీజ్ 5 రోజుల్లో ఇండియా కలెక్షన్ — ₹27 కోట్లు

సోమవారం, మంగళవారం? కేవలం కోటి రేంజ్…

అందులో కూడా హైదరాబాద్ ఒక్కటే 50% తెచ్చింది! అంటే పక్కా ఫ్యాన్ పవర్… జనరల్ ఆడియన్స్ మాత్రం అంతగా పట్టించుకోలేదు.

ఓవర్సీస్ రేంజ్?

US & ప్రపంచం కలిపి అదనంగా ₹12 కోట్ల వరకు వచ్చే అవకాశం. మొత్తానికి ఫుల్ రన్ → ఇండియా + ఓవర్సీస్ కలిపి ₹40 కోట్ల రేంజ్

ఎందుకు ఇలా డ్రాప్ అయ్యింది?

1. లెంగ్తీ రన్ టైమ్

ప్రధానంగా బాహుబలి ది ఎపిక్ ఫైనల్ వెర్షన్ 3 గంటల 44 నిమిషాలకు లాక్ చేశారు. ఇంకో పావు గంట ఇంటర్వెల్ కలుపుకుంటే మొత్తం 240 నిమిషాల పాటు థియేటర్లో గడపాల్సి ఉంటుంది. అదనంగా యాడ్స్ వేసుకుంటే ఆ మేరకు సమయం మరింత పెరుగుతుంది ఇంత టైమ్ ఆల్రెడీ చూసి, తెలిసిన కథపై ఖర్చు పెట్టాలంటే కష్టమని చాలా మంది వెనకాడటం గమనించాలి. అలాగే ....

2. ఇది కొత్త సినిమా కాదు

ఫ్యాన్స్‌కి థియేటర్ ఎక్స్‌పీరియన్స్ కావాలి గానీ, కామన్ ఆడియన్స్ మాత్రం “OTTలో చూడలేమా?” అన్న భావనతో వెళ్లలేదు.

3 . స్టోరీ, సర్ప్రైజ్ లేకపోవడం

రెండు పార్ట్స్ లో ప్రతీ పాత్ర, ఎమోషన్ మనకు గుర్తున్నాయి. సస్పెన్స్, ఎమోషన్, హంగామా — అన్నీ సేమ్ అని తెలుసు. అలా సర్పైజ్ లు లేనప్పుడు డబ్బులు పెట్టడం ఎందుకు.

4. రీకట్ చేసిన వెర్షన్‌కి కొత్త USP లేకపోవడం

పెద్దగా కొత్త సీన్లు, విజువల్స్ లేకపోవడం వల్ల కొత్త ఎమోషన్ క్రియేట్ కాలేదు.

5. రీ-రీలీజ్ ఓవర్లోడ్

ఇటీవలే చాలా స్టార్ సినిమాలు రీరిలీజ్ అయ్యాయి. ఆ ట్రెండ్‌లో ఇది కూడా ఒకటయ్యేసరికి స్పెషల్ అనే ఫీలింగ్ తగ్గింది.

6 . ప్రమోషన్ నేరేషన్ ఫోకస్ పాన్‌ఇండియా కాదు

తెలుగులో భారీ హంగామా, మిగతా భాషల్లో తక్కువ బజ్.

* 100Cr డ్రీమ్? రియాలిటీ బైట్!

చాలా మంది ₹100Cr ఈజీ అనుకున్నారు… కానీ రన్ ₹30Cr – ₹40Cr వద్దే స్టక్ అవుతోంది.

* అయితే ఫ్యాన్స్ పరిస్దితి ఏమిటి?

స్క్రీన్ల దగ్గర సెలబ్రేషన్, పోస్టర్లు, ఫోటోలు, ఫ్లెక్సీలు, అదే ఎమోషన్, అదే థ్రిల్...అంటే ప్రభాస్ బ్రాండ్ పవర్ ఇంకా టాప్. దాంతో ఇది ఫ్యాన్-బేస్డ్ రన్ గానే కనిపించింది.

ఫైనల్ వెర్డిక్ట్

‘బాహుబలి ఎపిక్’ కేవలం సినిమా కాదు — మన సినిమా ప్రైడ్‌ని మళ్లీ సెలబ్రేట్ చేసే అవకాశం. కానీ హైప్ ఎంత ఉన్నా… రీ-రిలీజ్ అంటే ఆడియన్స్ కొత్త ఫీల్ కోరుతారని ఈ రన్ చెప్పింది.

బాహుబలి ఎప్పుడు వచ్చినా హైప్ గ్యారెంటీ. కానీ ఈసారి పబ్లిక్ రెస్పాన్స్ క్లియర్‌గా చెప్పింది — రీ-రిలీజ్‌కి కొత్త ఎక్స్‌పీరియన్స్ కావాలి… పేరు మాత్రమే సరిపోదు.

“లెజెండ్ is always a legend… కానీ లెజెండ్స్‌కి కూడా రన్, అందుకు మూడ్ ముఖ్యం!”

Tags:    

Similar News