గై రిచీ లేటెస్ట్ ఫిల్మ్ 'ది మినిస్ట్రీ ఆఫ్ అన్జెంటిల్‌మన్లీ వార్‌ఫేర్' మినీ రివ్యూ

బ్రిటన్ డైరక్టర్ గై రిచీ (Guy Ritchie) కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆయన తీసిన స్నాచ్ సినిమా ఇప్పటికీ మన తెలుగు క్రైమ్ కామెడీ సినిమాల్లో ఎక్కడో చోట కనపడుతుంది.

Update: 2024-07-29 03:37 GMT

బ్రిటన్ డైరక్టర్ గై రిచీ (Guy Ritchie) కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆయన తీసిన స్నాచ్ సినిమా ఇప్పటికీ మన తెలుగు క్రైమ్ కామెడీ సినిమాల్లో ఎక్కడో చోట కనపడుతుంది. స్టైలిష్ మేకింగ్ కు ఆయన సినిమాలు పెట్టింది పేరు. దాంతో ఆయన కొత్త సినిమా వచ్చిందంటే ఆయన అభిమానులకు పండగే. తాజాగా ఆయన డైరక్ట్ చేసిన 'ది మినిస్ట్రీ ఆఫ్ అన్జెంటిల్‌మన్లీ వార్‌ఫేర్' (The Ministry of Ungentlemanly Warfare) తెలుగులో ఓటిటిలో రిలీజైంది. ఈ సినిమా ఎలా ఉంది..నేపధ్యం ఏమిటి అనేది చూస్తే...

ఈ సినిమా 2014లో రాసిన Churchill’s Secret Warriors: The Explosive True Story of the Special Forces Desperados of World War II అనే పెద్ద పేరు గల పుస్తకం బేస్ చేసి తీసారు. ఆపరేషన్ పోస్ట్ మాస్టర్ పేరుతో జరిగే ఓ బ్రిటీష్ ఆర్మీ కోవర్ట్ ఆపరేషన్ కు సంభందించిన కథ ఇది. ఇది బ్రిటన్ ప్రధాని వినిస్టన్ చర్చిల్ హయాంలో జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధం లో హిట్లర్ అనుసరించిన యుద్ద రీతి ప్రపంచాన్ని భయపెట్టింది. ఆ సమయంలో చాలాకాలంపాటు హిట్లర్ ని ఎలా ఎదుర్కోవాలా అనే ఒత్తిడితో బాధపడ్డారు బ్రిటన్ ప్రధాని చర్చిల్ . అయితే అడాల్ఫ్ హిట్లర్ తో పొంచి ఉన్న ప్రమాదాన్ని ముందే పసిగట్టి అందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. అందుకు కొన్ని కోవర్ట్ ఆపరేషన్స్ నిర్వహించారు. అందులో ఒక దాని గురించి ఈ సినిమా చెప్తుంది. అయితే ఇందులో కొంత కల్పితం ఉంది.

సినిమా ప్రారంభం నాటికి రెండో ప్రపంచం యుద్దం జరుగుతూంటుంది. వెస్ట్ ఆఫ్రికా లో స్పానిష్ కాలినీలో ఉన్న జర్మన్ కు చెందిన యు బోట్స్ కు ప్రధాన సరఫరా చేసే ఓడని ఆ యుద్ద సమయంలో నాశనం చేయకపోతే బ్రిటన్ కు పెను ముప్పు వస్తుంది. ఆ విషయం పసిగట్టిన చర్చిల్ ...డైరక్ట్ గా అయితే హిట్లర్ ని ఎదుర్కోవటం కష్టమని భావించి ఓ ఆపరేషన్ చేపడతాడు. గస్ మార్చ్ ఫిలిప్స్ (హెన్రీ కావిల్ ) అనే మాజీ కెప్టెన్ ఆధ్వర్యంలో సీక్రెట్ గా ఓ టీమ్ రెడీ చేస్తారు. జైల్లో ఉన్న వాళ్లను విడుదల చేసి మరీ ఆ టీమ్ ని నిర్మిస్తారు. ఆ ఆపరేషన్ పూర్తిగా రహస్యంగా ఉండాలి. బయిటపడినా బ్రిటన్ ప్రభుత్వం తమకు సంభందం లేదని చేప్పేస్తామని చెప్తుంది. దాంతో అది లైఫ్ అండ్ డెత్ ఆపరేషన్.

మరో ప్రక్క స్పెషల్ ఆపరేషన్ ఎగ్టిక్యూటివ్ ఏజెంట్స్ వీరికి సహాయంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికి గూఢచారుల్లా తమ పని మొదలెడతారు. ఒక్కసారి డెస్టినేషన్ చేరాక...అక్కడ ఆ షిప్ నాజీ కమాండర్ ని సెడ్యూస్ చేసి పని పట్టడం, షిప్స్ నాశనం చేయటం టాస్క్ గా సినిమా మొత్తం సాగుతుంది.

ఇది పూర్తి స్క్రీన్ ప్లే బేసెడ్ మూవీ. ఈ సినిమా మనకు క్వెంటిన్ టొరెంటినో 'ఇంగ్లోరియస్ బాస్టర్డ్స్' లేదా పాత క్లాసిక్ 'ది గన్స్ ఆఫ్ నవరోన్' ని గుర్తు తెస్తుంది. అలాగే వార్ చిత్రాలు చాలా వరకూ ఇలాగే ఉంటాయి. అయితే ఈ సినిమా ప్రత్యేకత ఏమిటంటే సీరియస్ నెస్ లేకుండా సినిమాని నడపటం. గై రిచీ కు అలవాటైన ఫన్, యాక్షన్ తో ఈ సినిమాని మిక్స్ చేసి అందించటమే స్పెషాలిటీ. అలాగే ఈ సినిమా విజువల్‌గా ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ యుద్ధంలో దెబ్బతిన్న ప్రకృతి దృశ్యాలు, సీక్రెట్ గా జరిగే ఆపరేషన్స్ మధ్య వ్యత్యాసాన్ని సమర్థవంతంగా చూపిస్తుంది. ప్రతి సీన్ ని ఇంటెన్స్ గా, హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌ గా డిజైన్ చేసారు. కాకపోతే ఎమోషన్స్ కు ఇందులో చోటు లేదు. మరీ ముఖ్యంగా చరిత్రపై ఆసక్తిలేని వారికి ఈ సినిమా ఎక్కటం కష్టమే.

అలాగే డైరక్టర్ గై రిచీ ఎప్పటిలాగే చాలా అద్భుతంగా స్క్రీన్ టైమ్‌ని బ్యాలెన్స్ చేయటం మనం గమనించవచ్చు. ఇది గై రిచీ అబిమానులకు నచ్చే అంశం, ప్రతి పాత్ర తమ పాయింటాఫ్ వ్యూని ఫెరఫెక్ట్ గా తమ చేష్టలతో ప్రెజెంట్ చేసారు. భారీ స్టార్ కాస్టింగ్ ఉన్నప్పుడు ఇలా చేయటం ఓ అరుదైన ఫీట్. డైలాగులు కంటే యాక్షన్ కే పాత్రలు ప్రయారిటీ ఇవ్వటం ఈ సినిమాలో మనం గమనించవచ్చు. ఇక గై రిచీకు అలవాటైన చాలా ట్విస్ట్‌లు , మలుపులు ఇందులో కనపడవు. హింస ఎక్కువగా ఉన్నప్పటికీ రీసెంట్ గా ఆయన గై రిచీ చిత్రాలలో మిస్సైన క్లాసిక్ టచ్, ఆయనకే స్వంతమైన స్టైల్‌ని ఈ చిత్రం మీకు గుర్తు చేస్తుంది.

చూడచ్చా

గై రిచీ ఫ్యాన్స్ కు , యాక్షన్ అభిమానులకు, చరిత్రను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది. మిగతా వాళ్లకు కాస్త బోరింగే.

ఎక్కడుంది

అమేజాన్ ప్రైమ్ లో తెలుగులో ఉంది.

Tags:    

Similar News