అనుష్క నిర్ణయం బాక్సాఫీస్ ఫలితాన్ని మార్చేస్తుందా?

స్టార్ పవర్ vs మార్కెటింగ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్!;

Update: 2025-08-29 02:30 GMT

సినిమా ఎంత పెద్దదైనా… బాక్సాఫీస్ వద్ద వర్కవుట్ అవ్వాలంటే ప్రమోషన్స్ కీలకం. నేటి ఆడియన్స్ అటెన్షన్ స్పాన్ చాలా తక్కువ. సోషల్ మీడియాలో హడావిడి లేకపోతే సినిమా గురించి పబ్లిక్‌కి తెలియదు కూడా. ఒకప్పటి “స్టార్ పవర్” మీదే నడిచే రోజులే పోయాయి. ఇప్పుడు వంద కోట్ల సినిమా అయినా… గట్టి ప్రమోషన్ లేకపోతే మొదటి వారం తర్వాత బతకడం కష్టం. అచ్చం ఈ బిజినెస్ డైనమిక్స్ ని ఇగ్నోర్ చేస్తున్నట్లుంది అనుష్క.

* ప్రమోషన్స్ = బిజినెస్ ఆక్సిజన్

వంద కోట్ల బడ్జెట్ ఉన్నా, పబ్లిసిటీ లేకపోతే మొదటి మూడు రోజుల తర్వాత స్క్రీన్ కౌంట్ పడిపోతుంది.

ఆడియన్స్ అటెన్షన్ స్పాన్ తగ్గిపోవడంతో, “కంటెంట్ ఓన్లీ” మీద సినిమా సక్సెస్ కావడం చాలా అరుదు.

బాక్సాఫీస్ పోటీ ఎక్కువగా ఉన్నప్పుడు, సెలబ్రిటీ ప్రెజెన్స్ + మీడియా హైప్ తప్పనిసరి.

ఈ లాజిక్‌కి వ్యతిరేకంగా, కొన్ని స్టార్ హీరోయిన్లు “ప్రైవేట్ లైఫ్ > ప్రమోషన్స్” అన్న రూట్ తీసుకున్నారు. దాంట్లోనే నయనతార మోడల్ బలంగా ఉంది. ఇప్పుడు ఆ మార్గంలోకి అనుష్క కూడా అడుగుపెడుతున్నట్టుంది.

* “మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి” లెసన్

‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సమయంలో ఇదే జరిగింది. సినిమా మొత్తాన్ని నవీన్ పొలిశెట్టి ఒక్కడే భుజాలపై మోశాడు. అనుష్క మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఒక ఇంటర్వ్యూ వీడియో కూడా చివరి నిమిషంలో కూడా రిలీజ్ చేయలేదు మేకర్స్. ఆ తరహా లోనే ఇప్పుడు ‘ఘాటీ’కి కూడా అదే సీన్ రిపీట్ అవుతోంది. ఫలితం? సినిమా కాంటెంట్ బాగున్నా, అనుష్క అభిమానులకే సినిమా రిలీజ్ అయిందన్న విషయం తెలిసేందుకు చాలా టైమ్ పట్టింది.

ఇప్పుడు అదే ఫార్ములా ‘ఘాటీ’ కి కూడా రిపీట్ అవుతోంది.

ఈ సినిమా పూర్తి గా అనుష్క మీదే నడవాలి. కానీ ఆమె ప్రమోషన్స్ కి రానని నిర్మాతలు క్లియర్ కట్‌గా చెప్పేశారు. అనుష్క ముందే తన నిర్ణయాన్ని చెప్పేసిందట. అంటే ఇక ప్రమోషన్ భారం మొత్తం డైరెక్టర్ క్రిష్ మీదే పడుతోంది.

* అనుష్క ఎందుకు ఇలా చేస్తున్నారు?

ప్రైవసీ, కంఫర్ట్ జోన్ – పర్సనల్ స్పేస్‌ని కాపాడుకోవాలనే కోణం.

నయనతార మోడల్ ఇన్స్పిరేషన్ – “నాకు సినిమాలు చేయడం ముఖ్యం, ప్రమోషన్స్ కాదు” అనే ఆలోచన.

ఫ్యాన్ బేస్ మీద నమ్మకం – “నా ఇమేజ్‌కి ప్రేక్షకులు వస్తారు” అన్న బలమైన నమ్మకం.

సెలెక్టివ్ వర్క్ ఎథిక్ – తాను చేసే సినిమాలు “కంటెంట్ స్ట్రాంగ్” అన్న నమ్మకం, విశ్వాసం.

* రిస్క్ ఫాక్టర్

కానీ ఇది పెద్ద రిస్క్. ఎందుకంటే –

అనుష్క సినిమాలు ఎక్కువగా ఉమెన్–సెంట్రిక్ లేదా పాన్–ఇండియా అటెన్షన్ మీద ఆధారపడి ఉంటాయి.

అలాంటప్పుడు ప్రమోషన్ లేకపోతే వర్డ్ ఆఫ్ మౌత్ రావడానికి టైమ్ పడుతుంది.

మొదటి వారంలోనే కలెక్షన్లు పడిపోతే, డిస్ట్రిబ్యూటర్లు లాస్ లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది.

* నయనతార vs అనుష్క

నయనతార – తన హై పాపులారిటీ, కంటిన్యూస్ ప్రాజెక్ట్స్ కారణంగా మార్కెట్‌లో కన్సిస్టెంట్ ప్రెజెన్స్ ఉంది. ప్రమోషన్స్ కి రాకపోయినా, ఆమె సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ దగ్గర బలంగా పనిచేస్తాయి.

అనుష్క – ప్రాజెక్ట్స్ చాలా సెలెక్టివ్‌గా చేస్తుంది. మధ్యలో లాంగ్ గ్యాప్‌లు వస్తాయి. కాబట్టి, ఆమె రాకపోతే మొత్తం సినిమా క్రేజ్ డైల్యూట్ అయ్యే అవకాశం ఉంది.

బాలీవుడ్, టాలీవుడ్ కలిపి చూసినా… ప్రమోషన్స్ లేకుండా కూడా కలెక్షన్స్ సాధించిన సినిమాలు చాలా అరుదు. స్ట్రాంగ్ కాన్టెంట్ ఉన్నా, “వర్డ్ ఆఫ్ మౌత్” రావడానికి టైమ్ పడుతుంది. అప్పటికి థియేటర్స్ లో స్క్రీన్స్ తగ్గిపోతాయి. అనుష్క లాంటి స్టార్ సినిమాలు రిస్క్ తీసుకోవడం బిజినెస్ లాజిక్ కి విరుద్ధం.

ఏదైమైనా:

“ఘాటీ”కి అనుష్క లేకుండా ప్రమోషన్స్ ఎలా ఉంటాయో చూడాలి. నయనతార ఫార్ములా అనుష్కకి వర్కవుట్ అవుతుందా? లేక ఇది సినిమా ఫలితంపై రిస్క్ క్రియేట్ చేస్తుందా?

Tags:    

Similar News