ఫెరఫెక్ట్ క్రైమ్ థ్రిల్లర్ : ‘గాంత్’ వెబ్ సిరీస్ రివ్యూ

వాస్తవంగా జరిగిన క్రైమ్ ఈవెంట్స్ ని డాక్యుమెంటరిగా కాకుండా కొద్దిపాటి కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కించటం మామూలు విషయం కాదు.

Update: 2024-06-28 05:55 GMT

వాస్తవంగా జరిగిన క్రైమ్ ఈవెంట్స్ ని డాక్యుమెంటరిగా కాకుండా కొద్దిపాటి కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కించటం మామూలు విషయం కాదు. ఏ మాత్రం బాలెన్స్ తప్పినా వక్రీకరించారు..ఒక వైపు తీర్పు చెప్తున్నారు అంటారు. అలాగని యాజటీజ్ చేస్తే ట్రూ డాక్యుమెంటరీ అయ్యిపోయి ఎవరూ చూడరు. ఈ కత్తిసాము లాంటి వ్యవహారాన్ని ఈ వెబ్ సీరిస్ డైరక్టర్ సమర్దవంతంగానే నిర్వహించారనే చెప్పాలి. డిల్లీలో జరిగిన బురారీ సామూహిక ఆత్మహత్యల మిస్టరీ కేసును బేస్ చేసుకుని ఈ సీరిస్ డిజైన్ చేసారు.

కథేంటి

డిల్లీ దగ్గరలోని హకీకత్ నగర్ లో ఉండే జతిన్ తండ్రి మరణంతో మానసికంగా దెబ్బతింటాడు. ఆ షాక్ వలన అతనికి మాట కూడా పోతుంది. మెల్లిమెల్లిగా రికవరీ అవుతాడు. అతని కుటుంబంలో ఆరుగురు మెంబర్స్. అంతా బాగానే ఉందనుకున్న టైమ్ లో ఓ రోజు తెల్లారేసరికి ప్యామిలీ మొత్తం ఉరేసుకుని చనిపోయి ఉంటారు. ఈ విషయం తెలిసిన కాలనీ మెంబర్స్ భయపడిపోతారు. అసలు ఏం జరిగిందో ..ఎందుకు ఉరేసుకున్నారో అర్దం కాదు. అప్పుడు ఆ కేసు పోలీస్ లకు వెళ్తుంది. పోలీస్ అధికారి గదర్ సింగ్ (మనవ్ విజ్) ఇన్విస్టిగేషన్ మొదలెడతారు. అతను అప్పటికే సస్పెండ్ లో ఉన్నా అతనే సమర్దుడు అని అతన్నే పిలుస్తారు.

సంఘటనా స్దలానికి వెళ్లిన గదర్ నిశిత దృష్టికు కొన్ని విచిత్రంగా కనిపిస్తాయి. మొదట ఉరికి వ్రేలాడుతున్న ఆరుగురిలో .. పదేళ్ల కుర్రాడు 'కుశాగ్ర' బ్రతికే ఉండటం గమనించి వెంటనే అతణ్ణి హాస్పిటల్ కి పంపిస్తారు. ఆ తర్వాత ఇన్విస్టిగేషన్ కోణంలో చూస్తే... జతిన్ కుటుంబసభ్యులు ఆత్మహత్య చేసుకుంటే, వాళ్ల కాళ్లు - చేతులు ఎలా కట్టేసి ఉంటాయి? అనే డౌట్ వస్తుంది. అదే సమయంలో వారు చనిపోవడానికి ముందే ఆ ఇంటి కుక్క ఎందుకు చనిపోయిందని అర్దమవుతుంది. ఇవన్నీ కాకుండా కొత్తగా ఆ ఇంటికి పైపులు .. సొరంగ మార్గాలు ఎందుకు ఏర్పాటు చేయబడ్డాయని గమనిస్తారు. ఇక చనిపోవడానికి ముందు రోజున జతిన్ పెద్దమొత్తంలో డబ్బు డ్రా చేశాడు..అదేం చేసాడు. ఇవన్నీ తేలాల్సిన క్వచ్చిన్ మార్కులుగా కనపడతాయి.

జతిన్ ఫ్యామిలీ గురించి గదర్ ఆ చుట్టు పక్కలవారిని ఆరాతీయడం మొదలుపెడతాడు. ఆ క్రమంలో కొన్ని విషయాలు బయిటకు వస్తాయి. జతిన్ ఫ్యామిలీ ఎవరితోనూ కలిసేవారు కాదనీ, ఆ ఇంట్లో ఆడవారిని ఎవరూ చూడలేదని తెలిసి ఆశ్చర్యపోతారు. అలాగే నార్మల్ గా కాకుండా ఆ కుటుంబ సభ్యుల ప్రవర్తన చిత్రంగా ఉండేదని అందరూ చెబుతారు. వారికి ఏవో మూఢ నమ్మకాలు ఉన్నాయని చనిపోవడానికి ముందుగా కూడా వారు అక్కడ ఏదో పూజ చేశారనడానికి ఆనవాళ్లు కనిపిస్తాయి. ఇవన్నీ బేస్ చేసుకుని గదర్ ఎలా ఈ కేసుని డీల్ చేసాడు...అవి హత్యలేనా.. ఆత్మహత్యలా...అసలేం జరిగిందనే విషయం తెలియాలంటే వెబ్ సీరిస్ చూడాల్సిందే.

ఎలా ఉంది..

డిల్లీలోని భాటియా కుటుంబంలోని 11 మంది మోక్షం కోసం ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆ కేసుని రకరకాల మలుపులు తిరిగింది. తాంత్రిక విద్యలు కోసం నమ్మి వీళ్లంతా చనిపోయారని తెలిసింది. ఈ కేసుని అర్దమయ్యేలా ఎపిసోడ్స్ వారిగా డిజైన్ చేసారు. మొదట ఎపిసోడ్స్ ..కథలోకి వెళ్లటానికి టైమ్ తీసుకున్నారు. అక్కడక్కడా వచ్చే ట్విస్ట్ లు ఇంట్రస్టింగ్ గా అనిపిస్తాయి. అయితే క్లైమాక్స్ ట్విస్ట్ ఈ సిరీస్ ను నిలబెట్టేసింది. పెద్దగా పోలీస్ లు హడావిడిలేకుండా నేచురులా ఉండేలా ఈ సీరిస్ ని నీట్ గా డిజైన్ చేసారు. ఈ క్రమంలో ఈ సీరిస్ కాస్తంత స్లోగా వెళ్తున్న ఫీల్ వస్తుంది. అయితే ప్రతీ ఎపిసోడ్ చివర వచ్చే బ్యాంగ్ ఇంట్రస్ట్ గా బాగా చేసారు. దాంతో ఎనిమిది ఎపిసోడ్స్ ఆగకుండా చూసేస్తాము.

అయితే ఇదే క్రైమ్ సంఘటనను బేస్ చేసుకుని ఇప్పటికే House of Secrets: The Burari Deaths (2021) అనే డాక్యుమెంటరీ, ఆఖరీ సచ్ (2023) అనే వెబ్ సీరిస్, ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ (2023) అనే సినిమాలు వచ్చాయి. అయితే ఈ సీరిస్ లో నేరేషన్ కాస్త డిఫరెంట్ గా వెళ్లారు.. అదే ఈ సీరిస్ కు ప్లస్ పాయింట్

టెక్నికల్ గా ఈ సీరిస్ స్ట్రాంగ్ గా ఉంది. రాఘవ్ - అర్జున్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సిరీస్ కి ప్రధానమైన బలం . ప్రతీక్ కెమెరా వర్క్, సంజయ్ శర్మ ఎడిటింగ్ వర్క్ కూడా ఫెరఫెక్ట్ గా ఉంటాయి. డబ్బింగ్ కూడా బాగుంది.

చూడచ్చా

క్రైమ్ సీరిస్ లు చూద్దామనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్

ఎక్కడుంది

జియో సినిమా ఓటిటిలో తెలుగులో ఉంది

Tags:    

Similar News