‘లక్కీ భాస్కర్’ నుండి తప్పుడు పాఠాలు ప్రసారం
ఆ మధ్య బాగా చర్చనీయాంశమయిన లక్కీ భాస్కర్ చిత్రం ఒక ప్రత్యామ్నాయ అభిప్రాయం: రామ్ సి;
-రామ్.సి
నేను ఆ చిత్రానికి వ్యతిరేకం కాదు, అది ఒక సృజనాత్మక బృందం ఉత్పత్తి. కానీ ఇటీవల "లక్కీ భాస్కర్" యొక్క జీవిత పాఠాల పేరిట మీడియా మాధ్యమాలలో జరుగుతున్న ప్రచారం నన్ను ఆందోళనకు గురి చేసే అంశం.ఈ చిత్రం ఒక పెద్ద స్టాక్ మార్కెట్ స్కాం సమయంలో తను పని చేస్తున్న బ్యాంకులోనే బయటికి తెలియకుండా కథానాయకుడే చేసే కుంభకోణం చుట్టూ నడిచే కథ.
ఈ స్కాంలో సంపాదించిన డబ్బుతో ధనవంతుడిగా మారడం, తరువాత వీటి నుండి బయటపడటం కోసం తన రిటైర్డ్ చార్టర్డ్ అకౌంటెంట్ తండ్రి సహాయంతో ప్రణాళికలను అమలు చేయడం, అత్యంత శోచనీయం. మన సినిమాల్లో హీరో గెలవాలి అంతే ,అదొక్కటే ప్రేక్షుడికి ప్రామాణికం,అది తప్పు లేదు. కానీ, ఖాళీగా ఉన్న మేధావులు దీన్ని పాఠ్యముశంగా మర్చి పబ్బం గడుపుకోవడం ఘోరం. కథానాయకుడు లక్కీ భస్కర్ అవ్వోచ్చునేమో, వారి తండ్రి మాత్రం పెద్ద లమ్డీ కొడుకు అని చెప్పడంలో తప్పే లేదు.
"లక్కీ భాస్కర్" జీవిత పాఠాలు అంటూ దీనికి ప్రచారం కల్పించడం, గౌరవించడం ఒక పెద్ద హెచ్చరిక. ఎలా మీడియా మరియు మేధో వేదికలు గాడితప్పిస్తున్నాయో ఉదహరించే ఓ సంఘటన.ఈ కథనం తప్పుదారి పట్టించటమే కాదు, పూర్తిగా ప్రమాదకరమైనది కూడాను.ఈ తప్పుడు పాఠాలను గొప్పగా చూపిస్తూ, వేదికల్లో ప్రామాణికత తలచుకొంటే ఎంత డొల్ల.
ఇది ఎందుకు ఖండించాలంటున్నానంటే:
* మోసాన్ని సాధారణం విషయంగా చేసి చూపడం, జీవితానికి ఆధారమైన తాను పని చేస్తున్న బ్యాంకునే మోసం చెయ్యడం సబబు అని చూపించడం, కథానాయకుడి కుతంత్రాలను తెలివైనవిగా, వ్యూహాత్మకమైనవిగా చూపడం నిసిగ్గుతనం.
* వృత్తి నైతికతను దుర్వినియోగం జరుగుతుంటే, మందలించాల్సిన తండ్రి, మోసపూరిత పథకాల అమలుకు రిటైర్డ్ చార్టర్డ్ అకౌంటెంట్ తండ్రి సహాయం చేయడం వృత్తి విలువలు మరియు నమ్మకంపై తప్పుడు సందేశాన్ని ఇస్తుంది. ఇది క్షమించలేనిది. బయట CA లకు ఉన్న చెడ్డ పేరు చాలదనా ఇదంతా.
- సంపదను శ్రేయస్సుగా చూపడం, "సంపదే ధర్మం" అనే ప్రాథమిక ఆలోచన ప్రజలలో ప్రమాదకరమైన మైండ్‌సెట్‌ను ప్రోత్సహిస్తుంది, ఇది నైతికత కన్నా లోభత్వానికి ప్రాధాన్యత ఇస్తుందని గుర్తించక పోవడం శోచనీయం.
- అనైతికతకు మన్నింపు, మెప్పును కల్పించడం, దానికి కష్టాలను నెపంగా చూపించి అనైతిక ప్రవర్తనను సమర్థించడం, ఆపదకరమైన పరిస్థులకు ప్రేరణ సృష్టిస్తుంది. కష్టాలు ఏ స్థితిలోనూ తప్పు చేసే హక్కును ఇవ్వవు అని గుర్తించక పోవడం సిగ్గుచేటు.
- హీరోయిజం పేరుతో చట్ట విరుద్ధతను ప్రోత్సహించడమే, చట్ట వ్యతిరేక చర్యలను ధైర్యవంతమైన రిస్క్ టేకింగ్‌గా సమానం చేయడం, ఇది వినూత్నత మరియు నిజమైన అంతర్జ్ఞనాన్ని అని చెప్పడం దాని వక్రీకరించడమే
- చట్టాన్ని అతిక్రమించడం, మోసం చేయడం, మరియు షార్ట్‌కట్స్ తో విజయాన్ని పొందడం అనేవి విజయ వ్యూహాలు కావు, అవి సమాజానికి విషపూరిత బీజాలు.నిజానికి, లక్కీ భాస్కర్ అనేది ఏమి చెయ్యకూడదు అన్న దానికి ఉదాహరణగా నిలవాలి.
ఇప్పుడు ఈ తప్పుడు కథనాలను సవాల్ చేయడం నిజమైన విలువలను ప్రోత్సహించడం అవసరమనుకొంటాను. మనం మన శ్రేయస్సు కోసం ఏర్పరచుకొన్న వ్యవస్థలు, సంస్థలలో ఈ విలువలు అమలులో ఉండేలా చూడాలి కానీ వాటిని దోచుకొన్న వాడిని సూక్తులుగా మలిచి చేసే ఈ పాఠాలను వెలివేయాలి. ధర్మో రక్షతి రక్షితః అన్నారుగా.
తండ్రికి తగ్గ తనయుడు; ఇద్దరు ఆర్ధిక నేరస్తులు. కొడుకన్నా తండ్రి పెద్ద దగుల్బాజీ, నేరస్తుడు.