దీపావళి రిలీజ్‌ల డీల్స్ క్లోజ్!
నంబర్స్ యుద్ధం! ఎవరు గెలుస్తారు,
పండుగ వస్తుందంటే చాలు… థియేటర్లలో లైట్లు వెలిగిపోతాయి! దసరా దేదీప్యమానంగా థియేటర్స్ లో వెలిగింది. ఇప్పుడు దీపావళి దగ్గరపడుతుండడంతో, టాలీవుడ్ మళ్లీ ఫెస్టివల్ మోడ్‌లోకి దూసుకెళ్లింది. “తెలుసు కదా, డ్యూడ్, K ర్యాంప్, మిత్ర మండలి” — నాలుగు యూత్ సినిమాలు ఒకే వారం రిలీజ్ అవుతూ, థియేటర్లలో నిజమైన పటాకా వార్ సెట్ చేశాయి.
కంటెంట్ వేర్వేరు, టార్గెట్ యూత్ ఒకటే — కానీ ట్రేడ్ సర్కిల్స్‌లో ఫోకస్ మాత్రం ఒక్కదానిపైనే ఉంది… ఏ సినిమా బిజినెస్ ఫిగర్స్ బాక్సాఫీస్ ఎక్స్పెక్టేషన్స్‌ని జయిస్తుంది?
దీపావళి వారంలో థియేటర్లలో బాక్సాఫీస్ బ్లాస్ట్!
అక్టోబర్ 16 – బన్నీ వాస్ ప్రొడక్షన్‌లో వచ్చిన ప్రియదర్శి, నిహారిక ఎన్‌ఎం నటించిన కామెడీ ఎంటర్‌టైనర్ “మిత్ర మండలి” పండుగ మూడ్‌ను మొదలుపెడుతోంది.
అక్టోబర్ 17 – స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ మరియు రాశీ ఖన్నా కాంబినేషన్‌లో “తెలుసు కదా”, అదే రోజు ప్రదీప్ రంగనాథన్ నటించిన “Dude” కూడా బరిలోకి.
అక్టోబర్ 18 – యంగ్ హీరో కిరణ్ అబ్బవరం రొమాంటిక్ ఎంటర్‌టైనర్ “K Ramp” తో ఎంట్రీ.
ఈ నాలుగు సినిమాల కోసం మేకర్స్ ఇప్పటికే అన్ని బిజినెస్ డీల్స్ ఫైనల్ చేశారు. డిజిటల్, సాటిలైట్, థియేట్రికల్ — అన్నీ ప్యాకేజింగ్ పూర్తయ్యి, టాలీవుడ్‌లో దీపావళి బిజినెస్ రేస్ హీట్ పీక్‌కి చేరింది.
తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ ఫిగర్స్ !
సినిమా పేరు మొత్తం బిజినెస్ (రూ. కోట్లు) నైజాం ఆంధ్ర సీడెడ్
తెలుసు కదా ₹16.83 Cr ₹8.01 Cr ₹6.30 Cr ₹2.52 Cr
Dude ₹9.81 Cr ₹4.50 Cr ₹3.78 Cr ₹1.53 Cr
K Ramp ₹6.39 Cr ₹1.98 Cr ₹3.15 Cr ₹1.26 Cr
మిత్ర మండలి ₹4.00 Cr (Self Release)
బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ: ఎవరి డీల్ సేఫ్? ఎవరిది రిస్క్ జోన్?
“తెలుసు కదా”
సిద్ధు జొన్నలగడ్డ మాస్-అర్బన్ యూత్ కలయికతో ఈ సినిమా బాక్సాఫీస్‌లో బలమైన ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ₹16.83 కోట్ల థియేట్రికల్ బిజినెస్ అనేది మధ్యస్థాయి హీరో సినిమాలకు రీసెంట్ టైమ్స్‌లో పెద్ద ఫిగర్. పాజిటివ్ టాక్ వస్తే ఈ మూవీకి బ్రేక్‌ఈవెన్ సులభం.
“Dude”
ప్రదీప్ రంగనాథన్‌కి తెలుగులో మంచి గుర్తింపు ఉండడంతో, ₹9.81 కోట్ల బిజినెస్‌ను క్రాస్ చేయడం పెద్ద ఛాలెంజ్ కాదు. యూత్ టార్గెట్ కంటెంట్‌తో, మల్టీప్లెక్స్ మార్కెట్లో ఈ సినిమా సర్ప్రైజ్ హిట్ అయ్యే అవకాశం.
“K Ramp”
కిరణ్ అబ్బవరం ఫాలోయింగ్ ఉన్నా, ₹6.39 కోట్ల థియేట్రికల్ రికవరీ టార్గెట్‌కి కంటెంట్ క్రిటికల్. పోస్టర్ల వల్ల వచ్చిన కాంట్రవర్సీలు పబ్లిసిటీ ఇచ్చినా, వర్డ్ ఆఫ్ మౌత్ మాత్రమే సేఫ్ జోన్ నిర్ణయిస్తుంది.
“మిత్ర మండలి”
ప్రియదర్శి & బన్నీ వాస్ కాంబోతో కామెడీ టోన్‌కి మంచి బజ్ ఉంది. సొంతంగా రిలీజ్ చేయడం అంటే రిస్క్ కూడా, రివార్డ్ కూడా మేకర్స్‌కే!
పాజిటివ్ టాక్ వస్తే — 4 కోట్ల వెేల్యూ డబుల్ అవుతుంది.
దీపావళి రేస్‌లో ఎవరు వెలుగుతారు?
ట్రేడ్ వర్గాల ప్రకారం — దీపావళి వారంలో ఒక్క సినిమా టాక్ బాగుంటే, అది మిగతా మూడింటి కలెక్షన్‌కి కరెంట్ షాక్ ఇస్తుంది. ఈసారి థియేట్రికల్ షేరింగ్, యూత్ టార్గెటింగ్, హాలిడే రన్ అన్నీ కలిపి, దీపావళి వారం టాలీవుడ్ బాక్సాఫీస్‌కి రియల్ లైటింగ్ టెస్ట్.
ఫైనల్ గా ..:
దీపావళి బాక్సాఫీస్ ఈసారి “ఫెస్టివల్ ఆఫ్ లైట్స్” కాదు… “ఫెస్టివల్ ఆఫ్ నంబర్స్”! ఎవరి సినిమా కంటెంట్ వెలిగితే, అదే బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపుతుంది. తెలుసు కదా – స్ట్రాంగ్ ఓపెనింగ్, Dude – యూత్ ఫేవరేట్, K Ramp – కంటెంట్ వైల్డ్ కార్డ్, మిత్ర మండలి – స్మార్ట్ కామెడీ ప్లే.
ఇంతకీ ఈ దీపావళి బాక్సాఫీస్‌ను ఎవరు వెలిగిస్తారు, ఎవరు చీకటిలో మిగిలిపోతారు?