ధర్మేంద్ర ఆరోగ్యంపై పుకార్లు ఎందుకు?
మా నాన్న చనిపోలేదంటున్న కుమార్తె ఈషా డియోల్, మృతి చెందినట్టు మీడియాలో వదంతులు
ప్రముఖ నటుడు ధర్మేంద్ర మృతి చెందారంటూ మంగళవారం ఉదయం జాతీయ మీడియాలో వచ్చిన వార్తలను ఆయన కుమార్తె ఈషా డియోల్ ఖండించారు. వైద్యానికి స్పందిస్తున్న వ్యక్తిని చచ్చిపోయారని ఎలా రాస్తారని ఆమె ప్రశ్నించింది. తమ కుటుంబం చెప్పేవరకు ఎలాంటి వదంతులు వ్యాప్తి చేయొద్దన్నారు. ధర్మేంద్రకు ముంబయి బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోందని చెప్పారు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ లో పోస్టు పెట్టారు. ‘‘మా నాన్న క్షేమంగానే ఉన్నారు. మేం ప్రైవసీని కోరుకుంటున్నాం. నాన్న త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన వారందరికీ కృతజ్ఞతలు’’ అని ఈషా పేర్కొన్నారు.
ధర్మేంద్ర మరణ వార్తను ఆయన భార్య, ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు హేమమాలినీ కూడా ఖండించారు. పుకార్లు పుట్టించవద్దని మీడియాకు హితవు పలికారు.
ప్రముఖ నటుడు ధర్మేంద్ర (1935–2025) ఇకలేరని ఓ వర్గం మీడియాలో వచ్చింది. ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సినీ అభిమానులు హతాశులయ్యారు. ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మృత్యువుతో పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో మీడియాలో ఈ వార్త వచ్చింది.
ధర్మేంద్ర ట్రీట్ మెంట్ కు స్పందిస్తున్నారని, అనవసరంగా పుకార్లను వ్యాప్తం చేయొద్దని భార్య హేమా మాలిని, కుమార్తె ఈషా డియోల్ సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు.
పంజాబ్‌లోని నస్రాలా గ్రామంలో 1935 డిసెంబరు 8న ధర్మేంద్ర జన్మించారు. చిన్నప్పటి నుంచే సినిమాల పట్ల ఆసక్తి కలిగిన ఆయన, 1958లో ఫిల్మ్‌ఫేర్ మ్యాగజైన్ నిర్వహించిన టాలెంట్ కాంటెస్ట్ ద్వారా బొంబాయి (ప్రస్తుత ముంబయి) చేరారు. 1960లో వచ్చిన Dil Bhi Tera Hum Bhi Tere చిత్రంతో ఆయన హిందీ సినిమారంగంలో అడుగుపెట్టారు.
1960లలో Bandini, Phool Aur Patthar, Anupama, Chupke Chupke, Satyakam, Yaadon Ki Baaraat వంటి సినిమాలతో ఆయన ప్రజాదరణ పొందారు.
ధర్మేంద్రను అభిమానులు “హీమేన్ ఆఫ్ బాలీవుడ్” అని పిలిచేవారు. 1975లో విడుదలైన Sholayలో ‘వీరు’ పాత్ర ఆయనకు చిరస్మరణీయ పేరు తెచ్చిపెట్టింది. ఆ పాత్రలో ఆయన చూపిన హాస్యం, మానవత్వం, ధైర్యం-ఇవన్నీ ఇప్పటికీ భారతీయ సినీ చరిత్రలో నిలిచిపోయాయి.
మొదట ప్రకాశ్ కౌర్‌ను వివాహం చేసుకున్న ధర్మేంద్రకు నలుగురు పిల్లలు ఉన్నారు. అనంతరం నటి హేమామాలినిను వివాహం చేసుకున్నారు. ఆయన కుమారులు సన్నీ డియోల్, బాబీ డియోల్, మనవడు కరణ్ డియోల్ కూడా నటులే. హేమామాలినితో పుట్టిన ఇద్దరు కుమార్తెలు ఈషా, అహనా డియోల్‌లు బాలీవుడ్‌లో ప్రసిద్ధులు.
గౌరవాలు, పురస్కారాలు ఎన్నో...
1997లో ఫిల్మ్‌ఫేర్ జీవిత సాఫల్య పురస్కారం
2012లో భారత ప్రభుత్వం నుండి పద్మభూషణ్ పురస్కారం
2004లో బికనీర్ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
ధర్మేంద్ర తన నటనతో ప్రేమ, ధైర్యం, కుటుంబ విలువలను తెరపై చూపించారు. ఆయన సినీ ప్రయాణం ఒక యుగాన్ని సూచిస్తుంది. స్ట్రాంగ్ హీరో ఇమేజ్ ఉన్న మనిషి.
89 ఏళ్ల వయసులో ఆయన ఈ లోకం విడిచి వెళ్లినా, ఆయన తెరపైన సృష్టించిన అద్భుత క్షణాలు, సంభాషణలు, చిరునవ్వులు భారతీయ సినిమా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయి.