‘తంగలాన్’ OTT రిలీజ్ పై బ్యాన్ చేయమని కేసు, నెట్ ప్లిక్స్ ఎగ్రిమెంట్ కాన్సిల్

దొంగల పడ్డ ఆర్నెల్లకు అన్న సామెత మాదిరిగా... రిలీజైన ఇన్నాళ్ల తర్వాత విక్రమ్ ‘తంగలాన్’పై కేసులు పడటం ఆశ్చర్యం కలిగిస్తోంది.

Update: 2024-10-09 06:41 GMT

దొంగల పడ్డ ఆర్నెల్లకు అన్న సామెత మాదిరిగా... రిలీజైన ఇన్నాళ్ల తర్వాత విక్రమ్ ‘తంగలాన్’పై కేసులు పడటం ఆశ్చర్యం కలిగిస్తోంది. తమిళ స్టార్ హీరో విక్రమ్ ఇటీవల నటించిన సినిమా 'తంగలాన్'. పా.రంజిత్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకొచ్చింది. తమిళంలో బాగానే వర్కవుట్ అయిన ఈ చిత్రం తెలుగుకు వచ్చేసరికి డివైడ్ టాక్ తో కొద్ది రోజులకే డ్రాప్ అయ్యింది. ఈ నేపధ్యంలో చాలా మంది ఈ సినిమాని ఓటిటిలో చూద్దామని ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మూవీ రిలీజైన రెండు నెలల అవుతున్నా ఇప్పటికీ ఓటీటీకి రాలేదు. సమస్య ఎక్కడుందనేది అర్దం కాలేదు.

‘తంగలాన్’ ఓటిటీ ఎగ్రిమెంట్ కాన్సిల్

తంగలాన్ డిజిటిల్ రైట్స్ ని నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. ఈ సినిమాను ఆ సంస్ద డిజిటల్ స్ట్రీమింగ్ చేయనున్నట్టు అధికారికంగా కూడా ప్రకటించారు. దీంతో ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతుందని ఓటీటీ ఆడియన్స్ వెయిట్ చేశారు. కానీ ఓటీటీలో స్ట్రీమింగ్ కాలేదు. అయితే అందుతున్న సమాచారం మేరకు నెట్ ఫ్లిక్స్‌తో నిర్మాతలకు సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది. నెట్ ప్లిక్స్ వారు సినిమా అనుకున్న స్దాయిలో నడవలేదు కాబట్టి మొదట అనుకున్న పేమెంట్ ఇవ్వలేమని తేల్చి చెప్పటంతో వివాదం ఏర్పడిందని తమిళ వర్గాలు అంటున్నాయి. ఈ మధ్యకాలంలో చాలా పెద్ద సినిమాలకు ఇదే విధంగా జరుగుతోంది. రిలీజ్ కు ముందు సినిమాకు ఉన్న క్రేజ్ చూసి ఓ రేటు చెప్పిన ఓటిటి సంస్దలు ఆ తర్వాత సినిమా అనుకున్న స్దాయిలో భాక్సాఫీస్ దగ్గర ఫెరఫామ్ చెయ్యకపోతే మాట మార్చేస్తున్నారు.

ఈ క్రమంలో ఈ మూవీ డిజిటల్ రైట్స్ ఎగ్రిమెంట్ ని నెట్‌ఫ్లిక్స్ రద్దు చేసుకుంటున్నట్లు సమాచారం. దీంతో తంగలాన్ హక్కులు ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ కు చేతులు మారిందని టాక్. త్వరలోనే స్ట్రీమింగ్ కు వస్తుందని భావిస్తున్న సమయంలో ఓటిటి రిలీజ్ పై బ్యాన్ పెట్టమంటూ ఓ కేసు దాఖలైంది.

తంగలాన్ పై కేసు

ఓటీటీలో ‘తంగలాన్’ సినిమా విడుదలపై నిషేధం విధించాలని కోరుతూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తిరువళ్లూరుకు చెందిన పోర్కోడి ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. ‘సినిమాలో బౌద్ధం గురించి పవిత్రంగా, వైష్ణవుల గురించి హాస్యభరితమైన సన్నివేశాలు ఉన్నాయి కాబట్టి ఓటీటీలో ‘తంగలాన్’ విడుదలైతే ఇరువర్గాల మధ్య గొడవ జరిగే అవకాశం ఉందని పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో ఓటీటీలో ‘తంగలాన్’ విడుదల మరింత లేటు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అయితే తంగలాన్ థియోటర్ లో రిలీజ్ అయ్యినప్పుడు కాని గొడవలు ఇప్పుడు ఎందుకు కొత్తగా ఎందుకు అవుతాయనేది ఆలోచించాల్సిన ప్రశ్న. కావాలనే ఈ కేసు వేసారని కొందరు సోషల్ మీడియా జనం అంటున్నారు. అసలే నెట్ ప్లిక్స్ తో ఎగ్రిమెంట్ కాన్సిల్ అయిన చిరాకులో ఉన్న నిర్మాతకు ఈ కేసులు కొత్త తలనొప్పే. ఇప్పుడు అమేజాన్ ప్రైమ్ సైతం కండీషన్స్ పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. థియేటర్ రెవిన్యూ కన్నా ఓటిటి రెవిన్యూనే నమ్ముకున్న సిట్యువేషన్ ఇలాంటి సమస్యలు తలెత్తటంలో ఆశ్చర్యం అయితే ఏమీ లేదు.

ఇక తంగలాన్ కథేంటంటే..

1850లో చిత్తూరు ప్రాంతంలోని పల్లెటూరులో సినిమా ప్రారంభమవుతుంది. తంగలాన్ ఓ శ్రామికుడు. అతడికి భార్య ఐదుగురు పిల్లలు. ఓ రోజు పిల్లలతో.. ఏనుగు కొండ వెనకాల బంగారం కొండ ఉందని, దానికి ఓ రక్షకురాలు ఉందని ఏవో కథలు చెబుతాడు. కట్ చేస్తే తంగలాన్‌తోపాటు కొందరిని బ్రిటీష్ దొరలు బంగారం నిధుల కోసం కూలీలుగా తీసుకెళ్తారు. నిధి అన్వేషణ కోసం సాగించిన ప్రయాణంలో వీళ్లకు ఎదురైన సవాళ్లు ఏంటి? చివరకు ఏమైందనేదే కథ.

ఈ సినిమాలో విక్రమ్ లుక్ చూసి అందరూ షాక్ అయ్యారు. తంగలాన్ పాత్ర కోసం చేసిన మేకోవర్ మతిపోగొట్టింది. అంతేకాకుండా ఏదో కొద్ది సీన్స్ లో ఆ లుక్ కాకుండా సినిమా మొత్తం అదే లుక్ ఉండటంతో ...సుదీర్ఘ కాలం షూటింగ్‌లో అదే లుక్ లో పాల్గొన్నారు. అది నిజంగా చాలా కష్టమై విషయం. సినిమాకు మొదటి రోజు ఈ చిత్రానికి డివైడ్ టాక్ వచ్చింది. అయితే మెల్లిగా పికప్ అయ్యి వీకెండ్ అయ్యి నిర్మాతలకు రిలీఫ్ ఇచ్చింది. అయితే వీకెండ్ అనంతరమే నిలబడలేదు.

ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లు రాబట్టిందని స్టూడియో గ్రీన్ వారు పోస్టర్ వదిలారు. అయితే ఈ పోస్టర్ పై చాలా విమర్శలు వచ్చాయి. కావాలని హైప్ చేసి తంగలాన్ కలెక్షన్స్ చూపిస్తున్నారని సోషల్ మీడియాలో ట్రోల్ చేసారు. ఏదైమైనా ఈ సినిమా విడుదలకు ముందే మంచి హైప్ కూడా సాధించింది. మొదటి వారాంతంలో చాలా బాగా ఆడింది. బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది.

కోలార్ బంగారు గనిలో తమిళుల విషాదకర సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు. ఈ సినిమాలో నటించిన అందరూ అద్భుతంగా చేశారు. అప్పటి పరిసస్థితులకు కళ్ళకు కట్టినట్టు చూపించారు దర్శకుడు రంజిత్. అలాగే జివి.ప్రకాష్ స్వరపరిచిన సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. . బ్రిటీష్ కాలం నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. బంగారం కోసం చేసే అన్వేషణ ఈ సినిమాలో చక్కగా చూపించారు. మరోసారి చియాన్ విక్రమ్ తన నటనతో ఆకట్టుకుంటాడు. ఇలాంటి సినిమాలకు ఓటీటీలో ఇంకా మంచి ఆదరణ ఉంటుంది.

Tags:    

Similar News