అంజలి 'బహిష్కరణ' వెబ్ సీరిస్ రివ్యూ

తెలుగు ఓటిటిలలో మెల్లిమెల్లిగా క్రైమ్,సెక్స్ కంటెంట్ తో కూడిన వెబ్ సీరిస్ లు రావటం మొదలైంది. మొదట్లో ఫన్ తో కూడిన లవ్ స్టోరీలు చేసారు

Update: 2024-07-19 08:38 GMT

తెలుగు ఓటిటిలలో మెల్లిమెల్లిగా క్రైమ్,సెక్స్ కంటెంట్ తో కూడిన వెబ్ సీరిస్ లు రావటం మొదలైంది. మొదట్లో ఫన్ తో కూడిన లవ్ స్టోరీలు చేసారు కానీ వాటి సక్సెస్ రేటు అంతంత మాత్రమే ఉండటంతో ఓటిటి సంస్దలు వాటిని ఎంకరేజ్ చేయటం లేదు. ఈ క్రమంలో సైతాన్ వంటి వెబ్ సీరిస్ లు తెలుగులో వచ్చి హై సక్సెస్ అవటంతో అలాంటివి మరెన్నో చేయటానికి ఉత్సాహం చూపిస్తున్నారు. అలా వచ్చిందే 'బహిష్కరణ' వెబ్ సీరిస్. అంజలి ప్రధాన పాత్రలో రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో జీ5 ఓటీటీ కోసం రూపొందిన ఎక్స్‌క్లూజివ్ రివేంజ్ డ్రామా, బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ ఇది. ఈ సీరిస్ ఎలా ఉందో చూద్దాం.

స్టోరీ లైన్

ఈ కథ దాదాపు ఇరవై పాతికేళ్ల క్రితం జరుగుతుంది. అప్పట్లో పెద్దపల్లి అనే ఊరు. ఆ చుట్టు ఉన్న పది గ్రామాలకు ప్రెసిడెంట్ శివయ్య(రవీంద్ర విజయ్) . ఆయన ఎంత చెప్తే అంత. గీత దాటాలంటే ప్రాణాలు పోతాయన్నంత భయం. అదే ఊళ్లో పుష్ప(అంజలి) వేశ్య. ఆమె తెగ నచ్చేసి, ఆమెతో సహజీవనం లాంటి కాపురం ఊరి చివరి ఇంట్లో మొదలెడతాడు. అయితే అంత అందగత్తె తమకూ సొంతం కావాలని ఊళ్లో చాలా మందికి ఉంటుంది కానీ శివయ్యకు భయపడి ఆమె జోలికి పోరు. అయితే శివయ్య రైట్ హ్యాండ్ దర్శి(శ్రీతేజ్) మాత్రం ఆమెతో ప్రేమలో పడతాడు. పుష్ప కూడా అతనంటే ఇష్టపడింది. చివరకు ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. శివయ్య ఫర్మిషన్ కూడా ఇస్తాడు.

అయితే దర్శి పెళ్లి షాపింగ్ వెళ్లి వ చ్చేసరికి ఓ ట్విస్ట్ పడుతుంది. దర్శిని అతని మరదలు లక్ష్మి (అనన్యా నాగళ్ల) మెడలో తాళి కట్టమని పురమాయిస్తాడు. గత్యంతరం లేని పరిస్దితుల్లో పుష్ప క‌ళ్ల ముందే ల‌క్ష్మితో (అన‌న్య నాగ‌ళ్ల‌) ద‌ర్శి పెళ్లి జ‌రిపిస్తాడు. తను ప్రేమించిన పుష్ప దూరం కావ‌డంతో దర్శి తాగుడుకు బానిస‌గా మారుతాడు. అప్పుడు లక్ష్మి కష్టపడి తన భర్తను తన ప్రేమతో తనవైపు తిప్పుకుని సంసారం చక్కదిద్దుకుంటుంది. ఈలోగా దర్శి ఓ మర్డర్ కమ్ రేప్ కేసులో జైలుకు వెళ్తాడు. అసలేం జరిగింది... ద‌ర్శిని ఈ కేసులలే ఇరికించింది ఎవ‌రు? శివ‌య్య తోట‌లో ఉన్న గులాబీ మొక్క‌ల వెనుక ఉన్న క‌థేమిటి?

పుష్పను ప్రేమించిన, పెళ్లి చేసుకోవాలనుకున్న దర్శి... చివరకు మరదల్ని ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది ? ఊరిలో దర్శి వర్గానికి చెందిన అమ్మాయిల మరణాలకు కారణం ఎవరు? లక్ష్మిని దర్శి పెళ్లి చేసుకున్నాక పుష్ప ఏమైంది? జైలు నుంచి వచ్చాక దర్శి ఏం చేశాడు? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాలి.

ఎలా ఉంది

ఈ సీరిస్ చూస్తూంటే అప్పట్లో కోడి రామకృష్ణ, జగపతిబాబు, మీనా కాంబినేషన్ లో వచ్చిన చిలకపచ్చ కాపురం సినిమా గుర్తుకు వస్తుంది. 1990లలో ఇలాంటి కథలకు మంచి గిరాకీ, అప్పటి పల్లెటూరి పరిస్దితులు కూడా కొంచెం అటూ ఇటూగా అలాగే ఉండేవి. అయితే ఇప్పుడు చూస్తూంటే అశ్చర్యం వేస్తుంది. లేటెస్ట్ జెడ్ జనరేషన్ కు అయితే మరీ షాకింగ్ గా ఇలా కూడా జరుగుతాయా అనిపిస్తుంది. సర్లే సీరిస్ ని అప్పటి కాలంలోనే జరిగినట్లు చూపించారు కాబట్టి సర్దుకుపోవచ్చు కానీ కొత్తగా ఏమీ జరిగినట్లు ఉండదు.

ఆరు ఎపిసోడ్స్ లో వచ్చే మలుపులు ప్రెడిక్టబుల్ గానే అనిపిస్తుంది. ఈక్యారక్టర్ ఇలాగే ప్రేమలో పడుతుంది. ఈ క్యారక్టర్ విలన్ కాబట్టి ఇలాంటి పనే చేస్తాడని ఊహకు అందేస్తుంది. అయితే ఉన్నంతలో ప్లస్ పాయింట్ ఏమిటి అంటే మేకింగ్ రా అండ్ రస్టిక్ గా డిజైన్ చేయటమే. అలాగే సీరిస్ కు మరో ప్లస్ పాయింట్ సింపుల్ డైలాగ్స్‌. సీరిస్ లో పాటలు పెట్టకుండా ఉండాల్సింది. టెక్నికల్గా గా మంచి స్టాండర్డ్స్ మెయింటైన్ చేసారు. సిద్ధార్థ్ స‌దాశివుని బ్యాంక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. కెమెరా వర్క్ కూడ నీట్ గా ఉంది. ఎడిటింగ్ కూడా స్లో నేరేషన్ అయినా ఇంట్రస్టింగ్ కట్స్ తో ముందుకు వెళ్లింది.

చూడచ్చా

ఓ లుక్కేయచ్చు. అయితే అంజలి ఉంది కదా అని మరీ ఎక్సపెక్టేషన్స్ పెట్టుకోకుండా ఉంటే మేలు. ఫ్యామిలీ అంతాకాకుండా విడిగా చూడటమే మేలు.

ఏ ఓటిటిలో ఉంది

జీ5 ఓటీటీ లో తెలుగులో ఉంది. మొత్తం ఆరు ఎపిసోడ్స్ ఉన్నాయి.

Tags:    

Similar News