ఏసీపీ స్థాయి అధికారికి రేణుకాస్వామి హత్య కేసు విచారణ..

కర్ణాటకలో రేణుకాస్వామి హత్య కేసులో ఇప్పటికే పోలీసులు నటుడు దర్శన్, ఆయన స్నేహితురాలు పవిత్ర గౌడను అరెస్టు చేశారు. ఇప్పుడు కేసు దర్యాప్తును ఏసీపీకి అప్పగించారు.

Update: 2024-06-18 11:29 GMT

రేణుకాస్వామి హత్య కేసులో మృతుడి కుటుంబానికి న్యాయం చేస్తామని బెంగళూరు నగర పోలీసు కమిషనర్ బి దయానంద హామీ ఇచ్చారు. కేసు ప్రాధాన్యత దృష్ట్యా తనకు ఈ కేసు అప్పగించినట్లు ఆయన మీడియాకు చెప్పారు.

‘‘రేణుకాస్వామి హత్యకేసులో ఇప్పటికే నటుడు దర్శన్ తూగుదీప, ఆయన స్నేహితురాలు పవిత్ర గౌడ సహా 17 మందిని అరెస్టు చేశాం. దర్యాప్తు వేగంగా జరుగుతోంది. ఇప్పటికే అన్ని ఆధారాలను సేకరించాం.త్వరలో వాటిని కోర్టుకు సమర్పిస్తాం.’’ అని పేర్కొన్నారు.

గతంలో ఈ కేసు విచారణాధికారిగా ఉన్నకామాక్షిపాల్య పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్‌ను ఇప్పుడు చెన్నమ్మనకెరె అచ్చుకట్టు పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయ్యారు. బదిలీ అయిన కూడా ఆయన నుంచి కేసు వివరాలు అడిగి తెలుసుకుంటామని చెప్పారు. ఇన్‌స్పెక్టర్లు, సిబ్బంది దర్యాప్తులో నిమగ్నమై ఉన్నారని తెలిపారు.

హత్య ఎందుకు జరిగింది?

నటుడు దర్శన్‌‌కు దాదాపు 20 ఏళ్ల క్రితమే విజయలక్ష్మితో పెళైంది. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నారు. మోడల్‌, బుల్లితెర, సినీ నటి అయిన పవిత్ర గౌడతో దర్శన్‌ కొన్నేళ్లుగా కలిసి ఉంటున్నారు దర్శన్. ఈ బంధం వల్ల విజయలక్ష్మికి అన్యాయం జరుగుతుందన్న బాధతో చిత్రదుర్గ జిల్లా కేంద్రానికి చెందిన రేణుకాస్వామి అనే యువకుడు తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పవిత్రను లక్ష్యంగా చేసుకుని ఆమెకు అశ్లీల సందేశాల పంపారు. దర్శన్‌ నుంచి దూరంగా ఉండాలని హెచ్చరించినట్లు పోలీసులు గుర్తించారు. అదే అతడి హత్యకు దారితీసింది.

Tags:    

Similar News