మార్వెల్‌కి పౌరాణిక జవాబు
ఇండియా మొత్తం కదిలించేసిన మహావతార్!;
మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) అనే మాట వినగానే, హాలీవుడ్ పాన్-గ్లోబల్ స్టాండర్డ్స్ గుర్తుకు వస్తాయి. ఐరన్ మాన్, థోర్, కాప్టెన్ అమెరికా లాంటి పాత్రలు — ఒకే విశ్వంలో కలసి, సినిమాల పరంపరలో కథలు పుట్టించడమే కాక, ప్రేక్షకుల్లో ఒక కొత్త తరహా ఆలోచలను, దిశను సృష్టించాయి. 2008లో ప్రారంభమైన MCU ప్రయాణం, ప్రపంచ సినీ చరిత్రలో అతిపెద్ద ఫ్రాంచైజీలలో ఒకటిగా నిలిచింది. అదే స్థాయిలో భారతదేశంలోనూ అలాంటి ఓ ఇంటిగ్రేటెడ్, డీప్ నారేటివ్ యూనివర్స్ అవసరం అనిపించినా అది సాధ్యమా అని అందరు అనుకున్నారు. కానీ , దక్షిణాదిలోని ఒక చిన్న పరిశ్రమ నుంచి వచ్చిన నిర్మాతలు అది అసాధ్యమే కాదు అని రుజువు చేశారు.
ఇప్పుడు కన్నడ పరిశ్రమ నుంచి Marvel స్థాయి ప్రణాళిక!
హొంబలే ఫిలిమ్స్ ఆధ్వర్యంలో, 'మహావతార్ యూనివర్స్' అనే భారతీయ సూపర్‌స్టోరీకు శ్రీకారం చుట్టబడింది. ఇది కేవలం సినిమా కాదు — ఇది విశ్వం. ఇది కేవలం విజువల్స్ కాదు — ఇది భావాల సంగమం. హిందూ పురాణాల్లోని విష్ణు మార్తి అవతారాల ఆధారంగా ఒక ఫ్రాంచైజీ నిర్మించడం ద్వారా, భారతీయ డివోషనల్ థీమ్స్‌ను మోడర్న్ సినిమా లాంగ్వేజ్‌లో అద్భుతంగా ట్రాన్స్‌ఫర్మ్ చేస్తున్నారు.
"మహావతార్ యూనివర్స్!"
కన్నడ నుంచి వచ్చిన ఈ సింహగర్జన ఇప్పుడు దేశం మొత్తం వినిపిస్తోంది. హొంబలే ఫిలిమ్స్ తెచ్చిన కేజీఎఫ్ ఒక కల్ట్. కాంతారా ఒక సంస్కృతి. సలార్ ఒక సిగ్నల్. కానీ మహావతార్ నరసింహ? అది ఓ యుద్ధ భేరి!
ఈ సినిమా ఒక పాన్-ఇండియా హిట్ మాత్రమే కాదు...
ఇది ఒక యూనివర్స్‌కి గేటు
ఇది ఒక గాడ్ లెవల్ సిరీస్‌కి స్టార్ట్
2037 వరకు సాగే డివోషనల్ ఫ్రాంచైజ్!
హొంబలే ప్లాన్ లెవలే వేరు. ఇది ఒక సినిమా కోసం కాదు – ఒక తరం కోసం. 2037 వరకూ ప్లాన్ చేసిన ఈ యూనివర్స్‌లో... ప్రతి సినిమాలో ఒక అవతారం, ఒక పోరాటం, ఒక డైలాగ్, ఒక డెవలప్మెంట్. ఇది భారతీయ చారిత్రికత, పౌరాణికత, మోడర్న్ యాక్షన్ అన్నింటినీ కలిపిన డివోషనల్ సినిమా బూస్ట్.
"ఇది సినిమా కాదు సద్గతి – ఇది యాక్షన్ కాదు అవతారం!"
ఇక్కడ ప్రతి పాత్ర దేవతలా ఉంటుంది, ప్రతి ఫైట్ యజ్ఞంలా ఉంటుంది, ప్రతి షాట్‌లో శక్తి ఉంటుంది. ఇలాంటి యూనివర్స్‌ను ఇప్పటి వరకు ఇండియన్ సినిమాల్లో ఎవరూ ట్రై చేయలేదు అని నిర్మాతలు ధీమాగా చెప్తున్నారు.
కన్నడ ఇండస్ట్రీ నుంచి పుట్టిన ఈ యూనివర్స్, దేశాన్ని ఊపేసే పనిలో పడింది. ఇది మాస్ + మైథాలజీ మిక్స్ చేసిన మాస్టర్ ప్లాన్. Marvel కి మాములు రిప్లై కాదు – ఇది భారతీయ భవిష్యత్తు సినిమాటిక్ యుద్ధం!
దక్షిణాది నుంచి మార్వెల్ స్థాయి యూనివర్స్
‘మహావతార్ నరసింహ’ను Marvel Cinematic Universe తో పోల్చడం ఊహ కాదు. కథా వ్యూహం, క్రియాశీల నిర్మాణం, సినిమాల పరస్పర సంబంధం – అన్నీ కలిపి ఇది ఒక భారతీయ సూపర్ యూనివర్స్. కానీ ఇది సైన్స్ ఫిక్షన్ కాదు, మన ఇతిహాసిక/ధార్మిక మూర్ఛిత సామర్థ్యాన్ని ఆధారంగా చేసుకున్న భక్తి-యాక్షన్ యూనివర్స్.
హొంబలే దృష్టిలో పాన్-ఇండియా కాదు, పాన్-కాల్చర్
సామాన్యంగా పాన్-ఇండియా సినిమాలు అనగానే అన్ని భాషల్లో రిలీజ్ అవడమే గుర్తొస్తుంది. కానీ హొంబలే దృష్టిలో పాన్-ఇండియా అంటే భాషలకతీతంగా భావాల్ని కలుపుకోవడం. మహావతార్ నరసింహ లో భక్తి, పురాణం, యాక్షన్, విజువల్ గ్రాండియర్ అన్నీ కలిసి వస్తాయి – అదే దీని USP.
ఫైనల్ గా ...
మార్వెల్ తమ కల్పిత విశ్వాన్ని గ్లోబల్ ఆడియన్స్‌కు చేరువ చేస్తే , మహావతార్ యూనివర్స్ మన పురాణ శక్తిని ఆధునిక రూపంలో ప్రపంచం ముందు ప్రెజెంట్ చేయబోతుంది. ఇది కేవలం సినిమా కాదు, భారతీయ భావజాలానికి సినీ రూపం. కన్నడ సినిమాకు ఇది ఒక విజన్ రివల్యూషన్, దేశీయ సినిమాకు ఇది ఒక గర్వకారణం.