పహల్గామ్ దాడికి భారత్ ‘ఆపరేషన్ సిందూర్’తో ప్రతీకారం తీర్చుకుంది. ఉగ్రవాద స్థావరాలపై దాడులను తమపై దాడులుగా భావించిన పాక్.. భారత్‌పై డ్రోన్లు, మిస్సైల్స్‌తో తీవ్ర దాడులకు పాల్పడింది. వాటన్నింటిని భారత్ తిప్పి కొట్టడమే కాకుండా.. పాక్‌కు భారీ నష్టాన్ని మిగిల్చింది. ఇదే విషయాన్ని భారత త్రివిధ దళాధిపతులు ఆదివారం వెల్లడించారు. అంతేకాకుండా తాము చేసిన ‘ఆపరేషన్ సిందూర్’ స్ట్రైక్స్‌కు సంబంధించిన ఫొటోలను, వీడియోలను కూడా షేర్ చేసుకున్నారు. పరిస్థితులను తీవ్రతరం చేయొద్దని, తాము ఉగ్రస్థావరాలనే టార్గెట్ చేస్తున్నట్లు కూడా పాక్‌కు ముందుగానే సమాచారం ఇచ్చామని, కానీ వారు కావాలని ఎదురుదాడులు చేశారని భారత సైనికాధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే శనివారం రెండు దేశాల మధ్య అమెరికా మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంపై భారత్, పాకిస్థాన్‌ల మిలటరీ డైరెక్టర్ జనరల్స్ అధికారులు ఈరోజు సమావేశం కానున్నారు. అందులో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయమే ప్రధాని నరేంద్ర మోదీ.. తన అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఆపరేషన్ సిందూర్‌ను పర్యవేక్షించిన సైనికాధికారులు, కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా మరికొందరు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఐదుగురు హీరోలను భారత్ కోల్పోయింది.. పాక్‌తో జరిగిన దాడుల్లో భారత్ ఐదుగురు వీర జవాన్తలను, దేశ హీరోలను కోల్పోయిందని ఇండియా ఎయిర్ మార్షన్ భారతి పేర్కొన్నారు. ‘‘యుద్ధంలో ఉన్నప్పుడు చిన్నచిన్న నష్టాలు కూడా అందులో భాగమే. నేనొక్కటే చెప్పగలను మేము మా లక్ష్యాలను విజయవంతంగా అందుకున్నాం. మన పైలట్స్ అంతా తిరిగి వచ్చారు’’ అని ఆయన చెప్పారు. ఈ సందర్భంగానే ఆపరేషన్ సిందూర్ సమయంలో ప్రాణాలు కోల్పోయిన భారత మిలటరీ హీరోలకు, సామాన్య ప్రజలకు భారతి.. తన ప్రగాఢ సంతాపం తెలిపారు. కాళ్లబేరానికి పాక్ సరిహద్దులో దాడులను ముగించడానికి మార్గాన్ని చూద్దామంటూ పాకిస్థాన్ మిలటరీ డైరెక్టర్ జనరల్ తనకు ఫోన్ చేశారని భారత డీజీఎంఓ చెప్పారు. శనివారం సాయంత్రం ఇరు దేశాల మిలటరీ డైరెక్టర్ జనరల్స్ మి.. మిలటరీ యాక్షన్, కాల్పులను ఆపాలని డిసైడ్ అయ్యాం. సాయంత్రం 5గంటల నుంచి అది అమలయింది. పాకిస్థాన్‌లోని పలు ఎయిర్‌బేస్‌లపై భారత వైమానిక దళాలు విరుచుకుపడటంతో బెంబేలెత్తిపోయి పాక్ కాళ్లబేరానికి వచ్చిందని ఆయన వెల్లడించారు. ఈ దాడుల్లో పాకిస్థాన్‌కు చెందిన జవాన్లు 35-40 మంది మరణించారని ఆయన అంచనా వేశారు.