సీఎస్కే కెప్టెన్ గా మళ్లీ ధోనికే బాధ్యతలు

రుతురాజ్ గైక్వాడ్ కు గాయంతో మిగిలిన మ్యాచ్ లకు దూరం;

Update: 2025-04-10 13:18 GMT
ఎంఎస్ ధోని

భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని మరోసారి సీఎస్కే జట్టుకు ఈ సీజన్ లో మిగిలిన మ్యాచ్ లకు నాయకత్వం వహించబోతున్నాడు. రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా ఐపీఎల్ నుంచి వైదొలగడంతో ఈ సీజన్ లో మిగిలిన మ్యాచ్ లకు సీఎస్కే పగ్గాలను ధోని అందుకోబోతున్నాడని యాజమాన్యం ప్రకటించింది.

‘‘గాయం కారణంగా రుతురాజ్ గైక్వాడ్ మొత్తం ఐపీఎల్ సీజన్ కు దూరం కాబోతున్నాడు. మిగిలిన ఆటకు ధోని కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరిస్తాడు’’ అని కేకేఆర్ తో మ్యాచ్ ముందు మీడియాతో మాట్లాడిన కోచ్ స్టీఫెన్ ప్లెమింగ్ అన్నారు.
వరుసగా ఓడిపోతున్న సీఎస్కే
ఈ సీజన్ లో సీఎస్కే జట్టు అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోతోంది. జట్టు బ్యాట్స్ మెన్లు కనీస పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతుండగా, బౌలర్లు ధారళంగా పరుగులు ఇచ్చేస్తున్నారు.
ఇప్పటి దాకా సీఎస్కే ఆడిన ఐదు మ్యాచుల్లో నాలుగు ఓడిపోయింది. ముంబై తో జరిగిన మ్యాచ్ లో మాత్రమే గెలుపు సాధించింది. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. కేకేఆర్ ఆడిన ఐదు మ్యాచ్ లలో రెండు విజయాలు, నాలుగు ఓటములతో ఆరో స్థానంలో ఉంది.
43 ఏళ్ల ధోని చివరిసారిగా 2023 ఐపీఎల్ ఫైనల్లో సీఎస్కేకి నాయకత్వం వహించాడు. అహ్మాదాబాద్ లో జరిగిన ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ ను ఓడించి సీఎస్కేని విజేతగా నిలిపాడు. ఆ సీజన్ తరువాత ధోని కెప్టెన్ గా తప్పుకున్నాడు. గైక్వాడ్ ను కొత్త కెప్టెన్ సీఎస్కే నియమించింది.
తమ బ్యాట్స్ మెన్లపై కోచ్ ప్లెమింగ్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు. ఈ సీజన్ తమకు అనుకూలంగా లేదని వివరించాడు. వికెట్ల వెనక ధోని అద్బుతంగా కదలుతున్నాడని ప్రశంసలు కురిపిస్తున్నాడు.
ఈ సీజన్ తరువాత ధోని ఐపీఎల్ నుంచి తప్పుకుంటాడని ఊహగానాలు చెలరేగుతున్నాయి. గత మ్యాచ్ లో ధోని తల్లిదండ్రులు చిదంబరం స్టేడియంలోకి వచ్చారు. దీనితో ఈ లెజెండరీ క్రికెటర్ ఇక మైదానంలోకి కనిపించరని వార్తలు వచ్చాయి. ప్రస్తుతానికి ధోని ఈ వార్తలు ఖండించిన, అవి త్వరలోనే నిజం అవుతాయని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.
సీఎస్కే జట్టు: ఎంఎస్ ధోని(కెప్టెన్), రవీంద్ర జడేజా, శివమ్ దూబే, మతీషా పతిరణ, నూర్ అహ్మద్, రవిచంద్రన్ అశ్విన్, డెవాన్ కాన్వే, సయ్యద్ ఖలీల్ అహ్మద్, రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్, సామ్ కుర్రాన్, షేక్ రషీద్, ముఖేష్ కంబోద్, దీపాక్ రషీద్, గుర్జన్ ప్రీత్ సింగ్, నాథన్ ఎల్లిస్, జామీ ఓవర్టన్, కమలేష్ నాగర్ కోటి, రామకృష్ణన్ ఘోష్, శ్రేయాస్ గోపాల్, వంశ్ బేడీ, ఆండ్రీ సిద్దార్థ్.


Tags:    

Similar News