‘‘ఆ పర్యటనకు ఎంపిక కాకపోవడం నన్ను తీవ్రంగా కలిచివేసింది‘‘
టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్;
Translated by : Praveen Chepyala
Update: 2025-05-01 12:17 GMT
నాలుగు సంవత్సరాల క్రితం ఆసీస్ లో పర్యటించిన భారత జట్టుకు ఎంపిక కాకపోవడం తనను తీవ్రంగా బాధించిందని సూర్యకుమార్ యాదవ్ గుర్తు చేసుకున్నారు. ఆ ఉదంతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో తన ఉత్తమ ఆటతీరును బయటకు తీయడానికి ఉపయోగపడిందని అన్నారు.
అబుదాబిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ తో జరిగిన ఉత్కంఠభరితమైన ఛేజింగ్ లో సూర్యకుమార్ యాదవ్ 43 బంతుల్లోనే 79 పరుగులు చేసి ముంబై ఇండియన్స్ కు ఐదు వికెట్ల తేడాతో గెలుపు అందించడంలో కీలకపాత్ర పోషించారు. ఇది ఐపీఎల్ లో సూర్యకుమార్ కు అత్యంత చిరస్మరణీయ ఇన్నింగ్స్ లలో ఒకటిగా నిలిచింది.
ఐపీఎల్ 2020 లో ఇది కేవలం లీగ్ మ్యాచే అయినప్పటికీ ఈ మ్యాచ్ లో ఆర్సీబీ భారత కెప్టెన్ విరాట్ కోహ్లి తమ జట్టు ఓడిపోతున్నప్పుడూ మైదానంలో గొడకు దిగారు. కోహ్లి పెద్దగా మాట్లాడకపోయినా డెలీవరీల మధ్య బంతిని అందుకున్న అతను సూర్యకుమార్ బ్యాటింగ్ చేస్తున్న స్టైకర్ ఎండ్ వరకూ నడిచి స్కైమ్యాన్ కాన్ సన్ ట్రేషన్ దెబ్బతీసే ప్రయత్నం చేశాడు.
‘‘నేను ఇలాంటి ఆటను ఆడటానికి ముందు ఆస్ట్రేలియా పర్యటనకు జట్టును ప్రకటించారు. ఇది ఒక భావోద్వేగ మలుపు’’ అని ముంబై ఇండియన్స్ బ్యాట్స్ మెన్ జియో హాట్ స్టార్ లో సూర్యకుమార్ యాదవ్ ఎక్స్ పీరియన్స్ షోలో గుర్తు చేసుకున్నారు.
ప్రస్తుతం టీ20 కెప్టెన్ అయిన సూర్యకుమార్ యాదవ్, తరువాత భారత జట్టుకు ఎంపికై మంచి ప్రదర్శన కనపరిచారు. ‘‘గత కొన్ని సంవత్సరాలుగా నేను దీనికోసం సన్నాహాలు చేస్తున్నాను. నా దేశవాళీ సీజన్, ఐపీఎల్ నిజంగా బాగా జరుగుతున్నాయి.
ఈ సీజన్ కోసం నేను నన్ను బాగా సిద్ధం చేసుకున్నాను. కోవిడ్ విరామ సమయంలో కూడా నా శరీరం, మానసిక ఆరోగ్యంపై పనిచేయడానికి సమయం తీసుకున్నాను. నేను టీ20 జట్టులో ఉంటానని ఆశించాను’’ అని అతను చెప్పాడు.
‘‘నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ కొంతమంది సహచరులు నేను ఆసీస్ పర్యటనకు వెళ్తానని అనుకున్నారు. నేను ఇప్పటికే మానసికంగా ఆ విమానంలో ఉన్నాను. కానీ నేను ఎంపిక కానప్పుడు, అది నన్ను తీవ్రంగా దెబ్బతీసింది. ఏమి జరిగిందో నాకు అర్థం కాలేదు. ’’ అని సూర్యకుమార్ యాదవ్ అన్నారు. తనను తాను రిఫ్రెష్ చేసుకోవడానికి విరామం తీసుకున్నానని చెప్పాడు.
‘‘నేను వ్యతిరేక దిశలో ఆలోచించడం ప్రారంభించాను. ఎక్కడ తప్పు జరిగిందో నేను ఆలోచించాను. తరువాత 2-3 రోజుల్లో నేను ఎవరితో మాట్లాడలేదు’’ అని టీ20 కెప్టెన్ చెప్పారు.
‘‘నేను మంచి విరామం తీసుకున్నాను. ప్రాక్టీస్ కూడా చేయలేదు. నా మనస్సు, హృదయం సరైన స్థానంలో లేవని నాకు తెలుసు. కాబట్టి నేను విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. నేను మైదానంలోకి తిరిగి వచ్చినప్పుడూ ఆటకు దూరంగా ఉన్నానని ప్రజలు గమనించారు. మహేలా జయవర్థనే, జహీర్ ఖాన్ కూడా దానిని చూడగలిగారు.’’ అని చెప్పారు.
‘‘ఆ రోజు మ్యాచ్ జరిగే సమయంలో నేను ముందుగా ఫీల్డింగ్ చేసాము. నెమ్మదిగా నేను ఆటలో పాల్గొనడం ప్రారంభించాను. బ్యాటింగ్ చేసే వంతు వచ్చేసరికి మేము రెండు వికెట్లు కోల్పోయాము’’ అని అతను చెప్పాడు.
‘‘నేను లోపలికి వెళ్లే ముందు పాలీ(పొలార్డ్) వచ్చి నా పక్కన కూర్చుని, ఇది సరైన దశ అని నేను అనుకుంటున్నాను. కెప్టెన్ కూడా ప్రత్యర్థి జట్టులో ఉన్నాడు. అతనికి చూపించడానికి కాదు. మీరు ఇక్కడికి చెందినవారని చెప్పడానికి ఇది సరైన సమయం’’ అని అతను చెప్పాడు.
‘‘గత కొన్ని సంవత్సరాలుగా టీ20 ఫార్మాట్ చాలా మారిపోయింది. స్కోరింగ్ రేట్లు, స్ట్రైక్ రేట్లు ప్రతిదీ, గతంలో నేను 140- 150 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేసే వాడిని. కానీ 2020 తరువాత ఉత్తమంగా ఉండాలంటే నేను అభివృద్ధి చెందాలని గ్రహించాను’’ అని అతను చెప్పాడు.
చాలాసార్లు నేను షాట్ల ఎంపికలో కొత్త పంథాను అనుసరించాను. ఇప్పుడు మ్యాచ్ లలో చేసే ప్రతిదాన్ని నేను ఇప్పటికే సాధన చేసాను. నేను ఆ సెషన్ లను సరిగ్గా పునరావృతం చేయడానికి ప్రయత్నిస్తానని సూర్య చెప్పాడు.