తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం దగ్గిర వసతులు ఏవీ

అమ్మవారి ఆలయాన్ని విస్మరించడం న్యాయం కాదు;

Update: 2025-08-29 07:26 GMT

తిరుమల శ్రీవారి ఆలయం పై ఉన్న "మమకారం" తిరపతి పక్కనే ఉన్న తిరుచానూరు అమ్మవారి ఆలయం పై కూడా చూపాలి!

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులతో పాటు తిరుచానూరు పద్మావతి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించకపోవడం శోచనీయం!

తిరుమల శ్రీవారి దర్శనానికి ముందు తరువాత అనేకమంది భక్తులు పద్మావతి అమ్మవారిని దర్శించుకోవడం సాంప్రదాయంగా మారింది.  రద్దీ సమయంలో సుమారు 30 వేల మంది భక్తులు ప్రతిరోజు అమ్మవారిని దర్శించుకుంటున్నారు, మామూలు రోజులలో 22 నుంచి 25 వేల మంది వచ్చే అమ్మవారి ఆలయ పరిసర ప్రాంతాలలో కనీస మౌలిక సదుపాయాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు!

  తిరుచానూరులో టిటిడి వెంటనే చేపట్టాల్సిన పనులలో ప్రధానమైనటువంటివి.

1) పద్మావతి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ తరహాలో 15,000 మంది భక్తులకు సరిపడ్డ "పద్మావతి క్యూ కాంప్లెక్స్" నిర్మాణం చేపట్టాలి 

2) అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తుల వాహనాల కోసం ప్రత్యేక "పార్కింగ్" సదుపాయం ఏర్పాటు చేయాలి!

3) అమ్మవారి ఆలయానికి ప్రతినిత్యం వచ్చే భక్తుల సౌకర్యార్థం కనీసం ఆ పరిసర ప్రాంతాలలో "మరుగుదొడ్లు" లేకపోవడంతో భక్తులు ముఖ్యంగా మహిళలు వృద్ధులు చిన్నపిల్లలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే మరుగుదొడ్ల ఏర్పాటుపై సత్వర చర్యలు చేపట్టాలి.

4) తిరుచానూరు అమ్మవారి ఆలయానికి వాహనాల ద్వారా భక్తులు వెళ్లే మార్గాలు ఇరుకుగా ఉండడంతో ప్రతినిత్యం ట్రాఫిక్ జామ్ తో స్థానికులు భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. "రోడ్ల విస్తరణ" పై టీటీడీ దృష్టి సారించాలి.

5) తిరుచానూరు ఆలయానికి వెళ్లే మార్గాల రోడ్డు విస్తరణలో ల్యాండ్ అక్విజేషన్ కారణంగా స్థలాలు కోల్పోయిన ప్రతి ఒక్క కుటుంబానికి ఒక ఉద్యోగం,ప్రభుత్వ రేటు ప్రకారం భూమి ధర చెల్లించేలా వారిని ఒప్పించే బాధ్యత టిటిడి ధర్మకర్తల మండలి తీసుకోవాలి.

6)తిరుచానూరు అమ్మవారి ఆలయానికి ప్రతినిత్యం దేశం నలుమూలల నుంచి వీవీఐపీలు, రాజకీయ ప్రముఖులు,స్థానికులు భక్తులు వస్తుంటారు.  అందరిని దృష్టిలో పెట్టుకొని తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయ ముఖ ద్వారం నుంచి ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడేలా చర్యలు చేపట్టాలి. 

-నవీన్ కుమార్ రెడ్డి

యాక్టివిస్టు, తిరుపతి


Tags:    

Similar News