అపచారాలనుంచి పరిష్కారం ఏమిటి?
తిరుప్పావై 5వ పద్యం విశేషాలు: ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్
మాయల అంతర్యామి ఉత్తర మధురలో కృష్ణుడై పుట్టినట్టి
దేవకీ వసుదేవ పూర్వపున్నములు నిండిన పసిడి పంట,
మలయానిలముల తిరిగి సోలెడు యమునా విహారి వేణుధరుడు
యాదవకులరత్న దీపకుండు, గోపాలవీర యదు నందనుండు
యశోద గోరుముద్దలగోరు నవనీతచోరు విష్ణుమూర్తి
రాగరంజితమనోసుమాల నర్చించ పునీతమై వచ్చినాము
చీకట్లు తొలగించు కృష్ణలీల, కట్లు తెంచు కృష్ణ ధ్యానము
పాపాల దూదిరాశిని బూదిచేయుకృష్ణనామమే మాకు శరణు
(మూలం: గోదాదేవి, అనువాదం: మాడభూషి శ్రీధర్)
వ్రతాలకు ఆటంకాలు వస్తే శ్రీకృష్ణుని కీర్తన చాలంటుంది గోదమ్మ
మాయ అంటే ఆశ్చర్య చేష్టలు శ్రీ కృష్ణునివి. యమునా తీరంలో మధుర గొల్లకులలో గొప్ప గోవిందుడు అవతరించారు. కనుక ఎట్లాగైనా వ్రతం పూర్తి చేయాలి. ఆటంకాలు కూడా వస్తాయి. అవతార పురుషుడైన రామునికి కూడా కష్టాలు వచ్చాయి. శ్రీరామ పట్టాభిషేకం అందరికీ ఇష్ఠమైనవే అయినా ఎందుకు ఆగిపోయింది. ఒక గూనె దాసి నాలుగు మాటలతో ముగ్గురు సీతారామ లక్ష్మణులు 14 సంవత్సరాలకోసం అడవికి పోవలసి వచ్చింది.
శ్రీకృష్ణుని గురువుగారు సాందీపుడికి కోసం గొప్ప గురుదక్షిణ ఇచ్చినాడు. మరణించిన గురు పుత్రుడిని యమునినుంచి బయటకు తీసుకుని బ్రతికిస్తాడు. ఆశ్చర్యం కాదా.
ఎంతో ఫుణ్యవతి అయిన దేవకీ దేవి ఆరుగురు పిల్లలు పుట్టిన పుట్టగానే కంసుడి కత్తికి బలి కావలసి వచ్చింది. శ్రీకృష్ణుడు పెద్దయిన తరువాత ఆ అరుగురిని చూపించాలని దేవకీ దేవి కోరుకున్నారు. చనిపోయిన ఆ ఆరుగురు సుతల లోకంలో బలి రాజ్యంలో ఉన్నారు. ఆ ఆరుగురి తండ్రిని షడ్భర్గులు అంటారు. హిరణ్యకశిపుడు మనవడు కూడా గొప్ప తపస్సు చేస్తాడు. ఈ ఘోర తపస్సుతో విచిత్ర వరం కోరుతాడు. నాకు ఏ సందర్భంలోనైనా ఎవరైనా శాపాలు ఇస్తే అవన్నీ వరాలుగా మారాలని వరం కోరుతాడు. ఓ దశలో తపోనిదుడైన ఒక మునిని పరిహరించినందుకు నీ తండ్రిచేతే ఆరుగురు కుమారులు చంపేస్తారని శాపం ఇస్తాడు. హిరణ్య కశిపుడి తాత ఈ శాపం తరువాత కంసుడై పుడతాడు. వారి ఆరుగురు పిల్లలు సుతలంలో నుంచి తీసుకు వెళ్లి శ్రీకృష్ణునికి చూపుతారు. ఆ ఆరుగురు శాపం వల్ల కంసుడి చేతనే వధింపజేస్తారు. మరి ఈ శాపం ఏ విధంగా ముగిస్తుంది? ఈ ఆరుగురు దేవకీదేవి స్తన్యం త్రాగితే అదే శాపం పోతుంది. కనుక శ్రీ కృష్ణుడు సుతలం నుంచి వారిని తీసుకు వచ్చి, దేవకీదేవిని ఇచ్చి, వారిని చిన్న శిశువులా మార్చి, వారిచేత స్తన్యపానం చేయించడం ద్వారా శాప విమోచనం చేస్తారు. దేవకీ దేవి ఆశ్చర్యపోతారు. అటువంటి మాయ అంటే విచిత్రమేన లీల అని వివరిస్తారు.
శ్రీకృష్ణార్జునుల కథ
ఒక బ్రాహ్మణుడు తన కుమారుడు చనిపొవడానికి శ్రీకృష్ణుని పాలనే కారణమని నిందించాడు. అప్పుడు శ్రీకృష్ణుని వెంటనే ఉన్న అర్జునుడు ఆగ్రహించి నిన్ను బతికిస్తాను. ఒకవేళ లేకపోతే ప్రాయోపదేశం చేస్తానంటాడు (అంటే ఆత్మహత్య చేసుకుంటానని). ఎందుకీ ప్రతిజ్ఞ అని శ్రీకృష్ణుడు బాధ పడతాడు. నీవే నన్ను రక్షించాలని అర్థిస్తాడు అర్జునుడు. సరే పదండి అంటూ పైలోకాలకో తీసుకువెళుతూ ఉంటాడు. ఆ దట్టమైన చీకటి లోనే రథంతో నడపడం సాధ్యం కాదు. శ్రీకృష్ణుని చక్ర వెలుతురులో వైకుంఠం దాకా చేరుకుంటాడు. అక్కడ లక్ష్మీనారాయణుల ముందు ఈ బ్రాహ్మణ కుమారుడు ఉంటాడు, తీసుకువెళ్లండి అని లక్ష్మీదేవి అంటారు. అర్జునుడు ఆశ్చర్యపోతాడు. ఈ లీల కారణం ఏమిటి అని అర్జునుడే అడుగుతాడు. శ్రీకృష్ణుని రూపాన్ని దర్శించాలని లక్ష్మీదేవి కోరుకున్నారట. అందుకుని ఈ కథ సాగుతుంది. అఘటిత సఘటనా సమర్థుడు శ్రీకృష్ణుడు అనడానికి గోదాదేవి తన 5వ పాశురం (పద్యం)లో మాయానై అని వివరిస్తారు.
ఎదురుగా ఉన్నాడు శ్రీకృష్ణుడు అతను బాలుడా? పరమ పురుషుడై పశుల కాపలియట, వేదాలకు అర్థంకాదు కానివెన్న దొంగతనం చేసాడట. ఆదిమూలమితడట కాని అల్లరి చేస్తూ ఉంటాడట. ఆ మహానుభావుడికొడుకు బ్రహ్మనే అట, కాని యశోదకుడికి శిశువుయట అని అన్నమయ్య ఈ కీర్తనలో రాస్తాడు.
ఎదుటనున్నాడు వీడె ఈ బాలుడు
మదిదెలియమమ్మ ఏమరులోగాని ||
పరమ పురుషుడట పసులగాచెనట
సరవులెంచిన విన సంగతా యిది
హరియె తానట ముద్దులందరికి జేసెనట
యిరవాయ నమ్మ సుద్దులేటివోగాని ||
వేదాల కొడయడట వెన్నలు దొమ్గిలెనట
నాదాన్ని విన్నవారికి నమ్మికాయిది
ఆదిమూల మితడట ఆడికెల చాతలట
కాదమ్మ యీ సుద్దులెట్టికతలో గాని ||
అల బ్రహ్మ తండ్రియట యశోదకు బిడ్డడట
కొలదొకరికి చెప్ప కూడునా యిది
తెలిసి శ్రీ వేంకటాద్రి దేవుడై నిలిచెనట
కలదమ్మ తనకెంత కరుణోగాని
ఈ మాటలు నమ్ముతారా ఎవరైనా అంటూ అన్నమయ్య శ్రీ వేంకటాద్రి దేవుడై నిలిచినట, మనకు ఎంత కరుణ చూపుతున్నాడో అని కీర్తన అంటున్నారు. ఎన్నో పాపాలు చేసిన వారం కదా. శ్రీరామ కృష్ణాది అవతారాలను తలుచుకుంటే తప్పులు పోతాయి. అపచారాలు పారిపోతాయి. మనం తలుచుకుంటే చాలు, కొన్ని పూవులు ఇస్తే చాలు, నోరారా కీర్తన చేస్తే చాలు, అదీ ఎందుకు నమస్కరిస్తే సరిపోతుంది, నీ పాపాలన్నీ నిప్పులో దూదియై క్షణాల్లో కాలిపోతాయట. ఇదీ నామకీర్తన గొప్పదనం అని గోదమ్మ గోపికలకు వివరిస్తున్నారు.
సముద్రంలో వాన
తిరుప్పావైలో అంతకు ముందు నాలుగో పద్యంలో చుట్టూ వర్షం పై కవితల ద్వారా ప్రకృతిని విష్ణు మాయను వర్ణిస్తున్నది. వర్షానికి అధిదేవుడు రావాలని వానలు రావాలని గోపికలు వ్రతంలో ఆరాధన చేస్తున్నారు. మామూలుగా వానలు వస్తే చాలదు. వర్షాలు సముద్రంలో కురిసే ఏం లాభం. సస్య శ్యామలమైన పైరులు రావాలంటే ప్రాణం ఎక్కడ వస్తుంది? వాన సమగ్రంగా పడాలి. ఏ విధంగా పడాలో కూడా గోదమ్మ వివరిస్తున్నది. నేలనుంచి మేఘం ప్రయాణం చేసి సముద్రం మధ్యకు చేరి కడుపునిండా నీళ్లు తాగి, అక్కడనించి మళ్లీ ప్రయాణం చేసి మేఘం అంతటా పంటలలో కురిసి రావలసిందే అంటున్నారు గోదమ్మ. అక్కడ కొన్ని వర్షం వచ్చి మరికొన్న కనీసం నేల కూడా తడిపి పోతే ఎందుకు? నల్లని మేఘంలో, నీలశ్యాముని దయతో ఎంతో వర్షాన్ని కడుపునుంచి దాచుకుని ప్రజలకు అందించే మహావర్ష సృష్టి కావాలని గోపికలు అడుగుతున్నారు. అన్ని చోట్ల వాన కురియాలని అంటున్నారు. ఓవైపు శ్రీకృష్ణుని సుదర్శమై కిరణాలవంటి వానలు, రాముని శార్ఞమై బాణాలవంటి వర్షాలు ఉరుములు మెరుపులతో, తన ఎడమ శంఖం నుంచి గుండెలదిరించే ధ్వనించే వానల పరంపరాలు విసురుతున్నాయి. యమునను పూర్తిగా నింపుతున్నాయి.
అపచారాలనుంచి పరిష్కారం ఏమిటి?
అయితే సమస్యలనుంచి బయటడడానికి చేయవలసిందేమిటి? అవి మూడు. 1. అందరూ దేవతలను ఆశ్రయించాలి. 2. దేవతలకు లొంగి ఉండాలి. 3. పరమార్థం గురించి, ఇతరులందరినీ సహాయం చేసే ఆలోచన ఉండాలి.
అపచారాలు మూడు రకంగా ఉంటాయి. 1. భగవంతుడి పట్ల అపచారాలు కూడదు, 2 భాగవతుల పట్ల తీవ్రమైన అపచారాలు చేస్తే పరిష్కారం ఉండదు. కేవలం మనసుతో ప్రార్థించి మా తప్పులు మన్నించండి అని క్షమాపణం కోరడం దప్ప మరో దారిలేదు. 3. అసహ్య అపచరాలు అంటే భయంకరమైన తప్పులు చేయడానికి సాహసం కుదరదు.
సుగ్రీవుడి తప్పునకు క్షమాపణ
దేవతలకు ఆరాధనం చేసే కాపాడిస్తారు. అప్పుడు రాక్షసులు కూడా ఏమీ చేయలేదు. వాలి వధ తరువాత సీతను వెతికేందుకు ప్రయత్నాలు ప్రారంభించాలని వాగ్దానం చేసిన సుగ్రీవుడు తన మాటను మరిచిపోతాడు. రాముడు తన సోదరుడు లక్ష్మణుడికి ఓ మాట చెబుతాడు. వాలి నిష్క్రమించిన దారి ఇంకా మూతబడిపోలేదని గుర్తు చేయి అని రాముడు గుర్తు చేస్తాడు. లక్ష్మణుడు కిష్కింధ రాజు ధనుష్కారానికి గుండెలు అదిరిపోతాయి. కోపాన్ని ఉపశమనం చేయానికి తార కొంతవరకు ప్రయత్నిస్తుంది. అర్థం చేసుకున్న తరువాత సుగ్రీవుడు రామునికికలిసి తప్పు జరిగిందని, మీరు నా మిత్రులు కనుక క్షమించాలని కోరుకుంటాడు. సీతన్వేషానికి ఆలస్యం చేసిందుకు రాముడు బాధపడినా క్షమిస్తాడు. ఆయన భగవంతుడు క్షమిస్తాడు. కాని భాగవతుడైన లక్ష్మణుడు క్షమించడు. తన తప్పు తెలుసుకుని మన్నించమని కోరడం ద్వారా భాగవత అపచారాన్ని సహిస్తారు.
భక్తి అంబరీశుడి పట్ల దుర్వాసుడి అపచారం
మరో సంఘటనలో పరమ భక్తుడైన అంబరీశుడిపైన ఆగ్రహించిన దుర్వాసుడు మంత్ర శక్తితో రాక్షసిని ప్రయోగిస్తాడు. ఇది భాగవతాపచారం. అందుకని సుదర్శనునికే కోపం వస్తుంది. చంపేస్తానని బయలుదేరాడు. బ్రహ్మ రుద్రులను వెళ్లినా దారి దొరకదు. చివరకు విష్ణునికి వేడ్కొంటూ ఉంటే క్షమించాలని అడుగుతాడు. కాని విష్ణువు ‘‘నాకు అపచారం చేస్తే ఫరవాలేదు. కాని భాగవత అపచారానికి క్షమాపణలేదు అని విష్ణువు వదిలేస్తాడు. భక్తుడై అంబరీశుడు క్షమిస్తే తప్ప దుర్వాసునికి నాకే సమస్యాలేదని విష్ణువు అంటారు. వెంటనే అంబరీశుడని శరణు శరణు అంటాడు. ఆయన ప్రార్థిస్తే సుదర్శనుడు వదిలస్తాడు. నిజానికి విష్ణువు చక్రాయుధం వాడలేదు. తమ భగవంతుడి పట్ల అపచారం చేస్తాడా అని తనం తానే సుదర్శనుడు వెంటపడతాడు. కారణం అది భాగవత అపచారాన్ని సహించడు. కాని దానికి కూడా పరిష్కారం ఒక్కటే ఉంది, అది ప్రార్థించడం క్షమించమని కోరడం మాత్రమే.
భరించలేని అపచారాలు
అంతే కాని అసహ్య అపచారాలనుచేస్తే వదలరు. యముడు కూడా వదలడు. కాని తన పనులు భగవంతుడికి అర్పణం చేస్తే భగవత్ కైంకర్య చేస్తే వ్యవసాయాలు చేసినా, ఇతర వృత్తి కార్యక్రమాలేమయినా సరే కేవలం భగవత్ కోసమని భావిస్తే కృష్ణార్పణం అని భావిస్తే పరిష్కారం ఇదే అని గోపికలకు గోదమ్మ వివరిస్తున్నారు.
త్రికరణశుద్ధి - అన్నమయ్య
అన్నమయ్య ‘‘త్రికరణశుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్ఛును లోకము మెచ్చును |
ఒకటికోటి గుణితంబగు మార్గములుండగ ప్రయాస పడనేల, తనమనసే పరిపూర్ణమైన గోదావరిగంగాకావేరి, ...కనకబిందు యమునాగయాది ముఖ్యక్షేత్రంబుల సంతతమున్ ... దినకరసోమగ్రహణకాలముల తీర్థాచరణలు చేసిన ఫలములు, తనుతానే సిద్ధించును ఊరకె దవ్వును తిరుగగ మరియేల...
‘‘హరియను రెండక్షరములు నుడివిన అఖిలవేదములు మంత్రములు’’ అంటారు. ‘‘మొదల శ్రీవేంకటపతికిని చేయెత్తి మొక్కినమాత్రము లోపలనే’’ అని వివరిస్తారు. అవే ‘‘పదిలపు షోడశదాన యాగములు పంచమహా యజ్నంబులును’’ అవుతాయి అని చెప్పారు. ‘‘వదలక సాంగంబులుగా చేసిన వాడేకాడా పలుమారు, మదిమది నుండే కాయక్లేశము మాటికి మాటికి తనకేల’’ అనీ ప్రశ్నిస్తారు.
పద్మనాభుడంటే..
గోదాదేవి ఇక్కడ శ్రీకృష్ణుని ‘పద్మనాభుడు’ అని సంభోదిస్తారు. సృష్టి ప్రారంభంలో విష్ణువు నాభినుంచి బ్రహ్మ ఆవిర్భవిస్తారు. ఆయన తరువాత ఏం చేయాలో తెలియదు. ఈ విష్ణువు ఎవరో తెలియదు. ఆ కమలం నాళంలో కొన్ని ఉండి చూస్తూ ఉంటాడు. అప్పుడు ‘‘తప.. తప’’ అనే మాట వినిపిస్తుంది. ఆమాట విష్ణువు అన్నారని కూడా తెలియదు. తపస్సు చేయమన్నారుకనుక యుగకోటి సహస్ర సంవత్సరాలదాకా తపస్సు చేస్తూ ఉండిపోతారు. అప్పుడు బ్రహ్మ సృష్టికార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. కనుక పద్మనాభుడు అనే మాటను ఆండాళమ్మ వర్ణించారు.
గురువే మేఘం
వర్ష నిర్వాహకుడు గంభీర స్వభావం కలిగిన వాడు. ఏ మొహమాటలు లేకుండా కాస్త ఔదార్యంతో వర్షం కురిపించండి. గంభీరమైన సముద్రం మధ్యదాకా వచ్చి సముద్ర జలాన్ని త్రాగి, గర్జించి, నారాయణుడైన శ్యామల మూర్తివై కుడి భుజంపై చక్రమై మెరిసి, ఎడమ భుజంలో శంఖమై ఉరిమి, శార్ఙమై విడిచే బాణాలై లోకాన్ని సంతోషించే విధంగా మేము అందరం స్నానం చేసేందుకు వర్షించాలని అంటున్నారు గోదమ్మ.
ఇక్కడ మేఘమంటే గురువు (ఆచార్యుడు). ఉప్పునీరు గ్రహించి మధురమైన త్రాగునీటిని వర్షించడం ఆచార్యుని దయ. అర్థం కాని శ్రుతిసాగాల నీటిని త్రాగి సులభశైలిలో బోధిస్తారు. ఆచార్యుని జ్ఞానమే తెలియడం. ఆచరించడే మెరుపు, శంఖ ధ్వనియే వేదఘోష, ఆచార్యుడు మేఘమై భగవంతుడిని పాపాలను కడిగే వర్షం ఇస్తాడు. (తిరుప్పావైలో శ్రీ రామ కృష్ణుల కథలలో, కె ఇ లక్ష్మీనరసింహన్ ప్రవచనంలో కొన్ని కథల ఆధారంగా)