భీమిలి గత చరిత్ర జ్ఞాపకాలను వెంటాడే కథలు

అందాల జాబిలీ... భీమిలి పుసక్తం సమీక్ష

By :  Admin
Update: 2024-11-19 07:23 GMT

-పి ఎస్ ఎస్ పాంచజన్య

ఊర్ల పేర్లతో అనేక మంది కథలు వెలువరించి కథా సంకలనాలు తీసుకుని వచ్చా రు. వాటిలో చాలా పుస్తకాలు ఆదరణ పొందాయి. తమ ప్రాంతాల మీద మక్కువ. అభిమానం ప్రేమ కలిగిన వారు వాటి ఆధారంగా కథలు రాస్తున్నారు

వంశీ పసలపూడి కథలు , జగన్నాధ శర్మ అగ్రహారం కథలు , సత్యనారాయణమూ ర్తి పెనుగోండ కథలు ప్రకాష్ శర్మ గట్టు కథలు వంటివి కొన్ని. ఈ విధంగా తమ గ్రామాలపై అభిమానంతో అక్కడ జరిగిన సంఘటనల నేపద్యంలో అనేకమంది రచయితలు కథలు వెలువరించారు.

కానీ విశా ఖజిల్లా భీమిలి పేరుతో ఈ గ్రామానికి చెందిన రచయిత.కవి జర్నలిస్టు పొత్తూరు రాజేంద్రప్రసాద్ వర్మ వెలువరించిన ‘అందాల జాబిలి భీమిలి’ అనే చారిత్రక కథలు వి భిన్నంగా అనిపిస్తాయి. ఒకప్పుడు డెచ్చివారు ప్రెంచివారు నివశించిన ప్రాంతంగా ప్ర సిద్ది చెందిన భీమిలి అనేగ్రామంలో వారి ఆనవాళ్లు..భవనాలు అనేకం సజీవ సాక్ష్యం ఉన్నాయి. వీటి చుట్టూ అల్లుకున్న ఈ కథలు చదువుతుంటే గిలిగింతలు పెడతాయి. చరిత్రలో మరుగున పడిపోయిన అనేక అంశాలు..సంఘటనలు కదారూపంలోకి వచ్చి మనల్ని పలకరిస్తాయి.. కొన్ని ఆ కాలానికి తీసుకునిపోతాయి. మూడువందల ఏళ్ల నాటి అనేక చారిత్రక అంశాలను చక్కని కథలు గస్ తీసుకుని వచ్చి 21 కథలతో వెలువరించిన కధా సంకలనం చరిత్ర అధ్యయనం చేసిన వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సముద్రంలో గోస్తనీ నది కలిసే ముఖ చిత్రం పుస్తకం పేజీలను తిప్పాలని అనిపిస్తుంది

 

ఈ కథలకు సంబంధించిన వాస్తవ విషయాలకు రికార్డులు డాక్యుమెంటు సంపాదించి వాటికి సృజనాత్మకతను జోడించి రాశానని కదా రచయిత ముందు మాటలో చెబుతారు. అయితే వీటిని చదువుతుంటే ఆ కాలం నాటి అనేక వెలుగు చూడని అంశాలు మనకి కనిపిస్తాయి.ప్రతి కథకు అలనాటి వెలుగు చూడని అనేక చిత్రాలను సేకరించి రచయిత పొందుపరచడం వల్ల ఈ కధా సంకలనానికి నిండుదనం వచ్చింది.

కథల విషయానికి వస్తే భీమిలి మున్సిపాలిటీలో కొంతకాలం కమీషనర్ గా పని చేసి ఇక్కడ నివశించిన కవి గుంటూరు శేషేంద్రశర్మ జ్ఞాపకాలు , చక్కగా ఉన్నాయి. నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది అని ముత్యాల ముగ్గు సినిమాలో రాసిన ఓకే ఒక పాట రాసిన కవిగా ఆయన ప్రస్థానం ఎలా సాగిందో కధా రూపంలో వివరించారు. సినీ నటి వహీదా రహమాన్ చిన్నతనంలో భీమిలి లో చదువుకున్నారన్న విషయం చాలామందికి తెలియదు. ఆమె నడ యాడిన ప్రాంతాలు. ఆనాటి ఆమె ఇల్లు చదివిన స్కూల్ ఫొటోలు తో రాసిన కథ చివరలో వహీదా కోసం భీమిలీ ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉంటుందని ముగించారు

 

మహాత్మా

గాంధీ పాదయాత్ర కోసం భీమిలి వచ్చి రామాలయంలో సహపంక్తి భోజనాలు చేసిన సంగతులనుఆయన మాటలతో మద్యం ముట్టని మత్స్య కారులు. తనకి మేకపాలు.. వేరు సేనగ పలుకులు ఇచ్చిన సీతారామ స్వామికి తను ఇచ్చిన మొల గడియారం ఫొటోలు ఈ కథకు ఆకర్షణ కలిగించాయి. వాస్తవ సంఘటనలు వార్తలుగా బాగుంటాయి కానీ రచయిత వర్మ వీటి కథలుగా మలిచిన తీరు పాఠకుల్ని ఆకట్టుకుంటుంది.

వీటిలో ఆనాటి చిత్రాలతో పాటు వారితో సంచరించిన వారి పేర్లు వివరాలు కథల్లో పొందుపరచడం విశేషం ఈ కథలు మినహా మిగిలిన 18 కథలు రెండుమూడు వందల సంవత్సరా ల క్రితం జరిగినవిగా చెప్పవచ్చు. మిగిలిన కథల్లో డచ్చి గవర్నర్ బంగళా కథ చదువుతుంటే కళ్ల వెంబడి నీళ్లువస్తాయి. సముద్ర తీరంలో గవర్నరు కోసం బంగ్లా కట్టడానికి వచ్చి భీమిలి లో చనిపోయేంత వరకు ఉండిపోయిన డెన్మార్కు ఇంజనీర్ ఫెడరిక్ జీవితం ఆతని సమాధి ఆనాటి జ్ఞాపకాలను తట్టి లేపుతుంది. గవర్నర్ వచ్చినప్పుడు కిరోసిన్ దీపాలు వెలిగించడం. గుర్రాలు పై ప్రయాణం ఎన్నో ఈ కథలో కనిపిస్తాయి. ఆనాటి బంగాళా.ఇంజనీర్ సమాధి వంటి చిత్రాలు ఈ కథ లో హైలెట్ గా నిలుస్తాయి

 

వెయ్యి ఏళ్ల అతి పురాతన నర్సింహ స్వామి దేవాలయ భూముల కోసం అప్పటి బ్రిటిష్ అధికారులు అర్చకుని

హత్య అతని ఆనాటి నివాసం. పూజారి హత్యకు నిరసనగా 150 సంవత్సరాల క్రితం పూజారులంతా భీమిలిలో ప్రదర్శన చేసిన అరుదైన ఫొటోలు లండన్ నుంచి సేకరించి రచయిత ప్రచురించారు. భీమిలి లో రక్త చరిత్ర పేరుతో ఉన్న ఈ కథలో ఇవన్నీ చోటు చేసుకున్నాయి. మరో కథ సెంటుపీడర్సు చర్చి లో దీనిని ప్రత్యేక పద్దతిలో నిర్మించిన విధానం అ క్కడ కాపలాదారుగా ఉన్న కీతన్న పేరుతో ఓ కుగ్రామం ఏర్పడటం వంటి విషయాల తో రాసిన కథలో అప్పటి అరుదైన చిత్రాలు ఈ కథలల్లో రచయిత వాడుకోవడం ఈ కథకు నిండుతనం చేకూర్చింది.

భీమిలి పోర్టు భీమిలి నుంచి తరలిపోయి విశాఖ పట్నం వెళిపోయిన సమయంలో ఆ బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్న పోర్టు కన్సర్వేటరు రామమూర్తి కథ కూడా కన్నీళ్లు తెప్పిస్తుంది. భీమిలిలో ఓ చర్చి కోసం ఓడలో లండన్ నుంచి రప్పి ంచిన గంట ఎలా రూపాంతరం చెంది హిందూ దేవాలయంలో ఉందొ తెలియజెప్సే పరిశోధనాత్మాక కథ కూడా పాఠకుల్ని ఆక ట్టుకుంటుంది. సమాధుల్లో చైతన్యం పేరుతో ఉన్న కథ లో ఈజిప్టు పిరమిడ్ ల మాదిరిగా ఉన్న సమాధుల్లో నిధి నిక్షేపాలు ఉంటాయని వాటిని తవ్వి తీసిన దండగుల ఉదంతం కూడా ఒక కథలో చెప్పారు.

300 ఏళ్ల క్రితం నాణాలు పై రాముడు.ఆంజనేయుడు.వేంకటేశ్వరుడు వంటి చిత్రాలు నాటి రాణి చిత్రాలు బదులు వేయడానికి కారణమైన ఇంపీరియల్ బాంక్ ఉద్యోగి ఉదంతం సీతా సమేత రామ అనే కథలో రచయిత వివరించారు.ఆనాటి దేముడి చితాలున్న నాణాలు ని కూడా కథకి అనుగుణంగా ప్రచురించారు. భీమిలి లో ఓకే దగ్గర ఉన్న చోళుల కాలం నాటి దేవాలయ సముదాయం. సిపాయిల తిరుగుబాటు కన్నా ముందుగా 1797 లో జరిగిన విజయ నగర రాజుల తిరుగుబాటు కథ కూడా ఇందులో ఉంది. లార్డ్ రిప్పన్ భీమిలి లో కట్టించిన సత్రాలు నాటి చిత్రాలు కూడా చూస్తే ఈ పుస్తకం దాచుకోవాలని అనిపిస్తుంది. కొండమీద నివసించిన దొర కథ..పేదలకు సేవ చేసిన మిలట్రీ డాక్టర్ కథ. డచ్ వేలేజీ కోసం డెన్మార్క్ దేశస్తులు చేసిన ప్రయత్నాలు. బౌద్ధులు నివసించిన ఆనవాళ్ళు వంటి చరిత్ర అంశాలు ఈ కథల్లో ఎన్నో వున్నాయి

వీటితో పాటు అలనాటి డచ్చి వారికి చెందిన రెండు ప్రేమ కథలు కూడా ఈ పుస్తకంలో పాఠకుల్ని ఆకట్టుకుంటాయి

భీమిలికి చెందిన సుబ్రమణ్యం అనే వ్యక్తిని ప్రేమించిన మున్సిపల్ కమీషనర్ కుమార్తె మారిటీనా లూసీ జీవితం ఈ ఏవిధంగా చిద్రం అయిపోయిందో తెలియ జేసేదే ‘ఆమె ప్రేమ అజరామరం’. తాను ప్రేమించిన వ్యక్తి కోసం లండన్ నుంచి భీమిలీ వచ్చి 59 ఏళ్ళు పిచ్చిదానిలా భీమిలీ బీచ్ లో చనిపోయిన ఆమె ప్రేమ గురించి చదువుతుంటే కన్నీళ్ళు వస్తాయి. ఆనాటి ఆమె సమాధి చిత్రం కూడా ఈ పుస్తకంలో చోటు చేసుకుంది.

భీమిలిలో అమర ప్రేమికులు అనే కథలో నాటి రిప్లయి కంపెనీలో పనిచేసే వ్యక్తి ని పెళ్లి చేసుకున్న లండన్ అమ్మాయి సెలెనా జీవన చిత్రం ఆమె భీమిలిని కాదనుకుని లండను వెలిపోయి తిరిగి రావడం చక్కగా చూపించారు. అప్పటి చిత్రాలు కూడా ఇందులో రచయిత పొందుపరిచారు. ప్రతి కథలో చారిత్రక అంశాలను జోడించి రాయడంతో చరిత్రను అద్య యనం చేయాలనుకున్న వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది

పుస్తకం వెల 150 రూపాయాలు కావల్సినవారు పుస్తక రచయిత పొత్తూరు రాజేంద్రప్రసాద్ వర్మ సెల్ నంబరు 94405 27387 ను సంప్రదించగలరు

Tags:    

Similar News