‘అణ్వాయుధాలతో బదులిస్తాం’

భారత్‌ను హెచ్చరించిన రష్యాలోని పాక్ రాయబారి జమాలీ;

Update: 2025-05-04 10:15 GMT
Muhammad Khalid Jamali

రష్యాలోని పాకిస్తాన్(Pakistan) రాయబారి ముహమ్మద్ ఖాలిద్ జమాలీ(Muhammad Khalid Jamali) భారత్‌కు తీవ్ర హెచ్చరిక చేశారు. పాకిస్థాన్‌పై భారత్ దాడి చేసినా లేక సింధు జలాలను శాశ్వతంగా నిలిపేయాలని చూసినా.. అణ్వాయుధాలు ప్రయోగించాల్సి వస్తుందని హెచ్చరించారు. రష్యన్ ప్రసార సంస్థ RTకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. పాకిస్తాన్‌పై భారత్ దాడి చేయబోతున్నట్టు తమకు సమాచారముందని చెప్పారు.

పహల్గామ్‌(Pahalgam)లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడి(Terror attack)లో 26 మంది పర్యాటకులు మరణించారు. ఈ ఘటనలో ఉగ్రమూకల ఎరివేతకు భారత్ సంకల్పించింది. ముందుగా జమ్ము కశ్మీర్ ప్రాంతంలోని అనుమానిత టెర్రరిస్టుల ఇళ్లను పేల్చేసింది. సానుభూతి పరులు ఇళ్లతో సోదాలు నిర్వహించింది.

ఇక పాక్‌తో కఠిన వైఖల అవలంభిస్తోంది. పాక్‌లో పంట పొలాలను నీరందించే సింధు జలాలను తాత్కాలికంగా నిలిపేసింది. పోస్టల్, కొరియర్ సేవలను రద్దు చేసింది. దిగుమతులను బహిష్కరించింది. ముఖ్యంగా పాక్ దేశీయులను వారి దేశానికి పంపించేసింది. పాక్ జెండాలను ఓడలను అనుమతించడం లేదు.

కాగా సింధూ జలాలను మళ్లించేందుకు నిర్మించే ఏ నిర్మాణాన్నయినా ధ్వంసం చేస్తామని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖాజా ఆసిఫ్ ఇటీవల అన్నారు.

మిసైల్ పరీక్ష:

ఇరు దేశాల మధ్య ఉదిక్ర పరిస్థితులు నెలకొన్న క్రమంలో పాకిస్తాన్ శనివారం అబ్దాలి మిసైల్‌ను పరీక్షించింది. ఇది 450 కిలోమీటర్లు దూరం వెళ్లగలదు. "ఆపరేషనల్ రెడినెస్" పరీక్షలో భాగంగా దీన్ని పరీక్షించాలని పాక్ ఆర్మీ బలగాలు చెప్పాయి. 

Tags:    

Similar News