ఉగ్రవాదుల అత్యక్రియలకు వచ్చిన ఆర్మీ అధికారులు, పోలీసులు ఎవరంటే?

వివరాలు వెల్లడించిన భారత ప్రభుత్వం;

Update: 2025-05-12 06:20 GMT
ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాల్గొన్న పాక్ ఆర్మీ, పోలీసుల ఫొటో చూపిస్తున్న విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ

ఆపరేషన్ సిందూర్ సమయంలో జరిగిన క్షిపణి, వైమానిక దాడుల్లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మరణించారు. ఈ ఉగ్రవాదుల అంత్యక్రియలకు పంజాబ్ ప్రావిన్స్ కు చెందిన కీలకమైన పాకిస్తాన్ ఆర్మీ సిబ్బంది, పోలీసు అధికారులు హజరమైన సంగతి అప్పట్లో సోషల్ మీడియాలో వచ్చాయి. ఈ పోలీస్, ఆర్మీ అధికారుల పేర్లను భారత్ అధికారికంగా విడుదల చేసింది.

ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాక్ అధికారులు హజరు కావడంపై విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వారి ఫొటోలను మీడియా సమావేశంలో కూడా ప్రదర్శించారు. ఈ ఫొటోలో హతమైన ఉగ్రవాదుల శవపేటికల వెనక యూనిఫాం ధరించిన పాకిస్తాన్ సైన్యం, పోలీస్ సిబ్బంది కనిపించారు.
కీలక అధికారులు..
లెప్టినెంట్ జనరల్ ఫయాజ్ హుస్సేన్ షా- లాహోర్ ఫోర్త్ కార్ప్స్ కమాండర్, మేజర్ జనరల్ రావ్ ఇమ్రాన్ సర్తాజ్- లాహోర్ 11వ పదాతిదళ విభాగం, బ్రిగేడియర్ మహ్మద్ ఫుర్కాన్ షబ్బీర్, డాక్టర్ ఉస్మాన్ అన్వర్, పంజాబ్ పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్, పంజాబ్ ప్రావిన్షియల్ అసెంబ్లీ సభ్యుడు మాలిక్ సోహైబ్ అహ్మద్ భెర్త్ అని వెల్లడించింది.
పాకిస్తాన్ తిరస్కరణలు..
పాకిస్తాన్ తన భూభాగంలో ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వడం లేదని ఎప్పుడూ చెబుతూనే ఉంది. అయితే ఆపరేషన్ సిందూర్ తరువాత ఆ దేశ ఉన్నతాధికారులు చాలామంది ఉగ్రవాదుల బహిరంగ అంత్యక్రియలకు హజరయ్యారు.
మురిద్కేలోని ఉగ్రవాద శిబిరంపై జరిగిన దాడిలో మరణించిన ముగ్గురు ఉగ్రవాదుల అంత్యక్రియల ప్రార్థనలకు నాయకత్వం వహించిన వ్యక్తి లష్కరే తోయిబా(ఎల్ఈటీ) ఉగ్రవాది హఫీజ్ అబ్ధుల్ రవూఫ్ అని తెలుస్తోంది. రవూఫ్ ను అమెరికా ట్రెజరీ ప్రపంచ ఉగ్రవాదిగా గుర్తించింది.
అంత్యక్రియల తరువాత పాకిస్తాన్ జెండాతో కప్పబడిన ఉగ్రవాదుల శవపేటికలను పాకిస్తాన్ ఆర్మీ సిబ్బంది మోస్తున్నట్లు మరోక వీడియో కనిపిస్తుంది.
తీవ్రంగా ఖండించిన భారత్..
ఉగ్రవాదులకు ప్రభుత్వ అంత్యక్రియలు నిర్వహించడాన్ని భారత్ మే 8న ఖండించింది. ఇది ఆ దేశంలో ఒక ఆచారంగా మారి ఉండవచ్చని వ్యాఖ్యానించింది.
భారత దాడుల్లో పౌరులు మరణించారని పాకిస్తాన్ అబద్దం చెబుతోందని మిస్రీ చెప్పారు. పౌరుల అంత్యక్రియలు శవపేటికలపై పాకిస్తాన్ జెండా కప్పి, ప్రభుత్వ గౌరవాలు ఇవ్వడం వింతగా ఉందని అన్నారు.
హతమైన ఉగ్రవాదులు..
ఆదివారం సాయంత్రం భారత సైన్యం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆపరేషన్ సిందూర్ సమయంలో మరణించిన కొన్ని కరుడగట్టిన ఉగ్రవాదుల పేర్లను, మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ లెప్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ ధృవీకరించారు.
తొమ్మిది ఉగ్రవాద లక్ష్యాలపై దాడులు చేయడంతో వందమందికి పైగా ఉగ్రవాదులు మరణించారని ఘాయ్ చెప్పారు. హతమైన కరుడుగట్టిన ఉగ్రవాదుల్లో జైష్ ఏ మహ్మద్ ఉగ్రవాది మౌలానా మసూద్ అజార్ బావమరిది యూసుప్ అజార్, ఎల్ ఈటీ కమాండర్ అబ్దుల్ మాలిక్ రవూఫ్, పుల్వామా దాడిలో ప్రమేయం ఉందని భావిస్తున్న ముదాసిర్ అహ్మద్ ఉన్నారని ఆయన అన్నారు.


Tags:    

Similar News