లక్షల వీసాలను పున: సమీక్షించబోతున్న యూఎస్ఏ

ట్రక్కు డ్రైవర్ల వర్క్ వీసాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన మార్కో రూబియో;

Update: 2025-08-22 05:15 GMT
అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాద దృశ్యం

అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం మరోసారి 55 మిలియన్లకు పైగా వీసాలను సమీక్షిస్తున్నట్లు ప్రకటించింది. వీరిని దేశం నుంచి బహిష్కరించే ఉల్లంఘనలు ఏమైనా ఉల్లంఘించారా అని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

‘‘వీసా గడువు ముగిసిన తరువాత కూడా అమెరికాలో ఉండటం, నేరాలలో పాల్గొనడం, ప్రజా భద్రతకు ముప్పు తెప్పించడం, ఏదైనా రకమైన ఉగ్రవాద కార్యకలాపాలలో పాల్గొనడం లేదా ఉగ్రవాద సంస్థకు మద్దతు ఇవ్వడం వంటివి చేసినట్లు అయితే’’ అమెరికాలో ఉండటానికి వీసా రద్దు చేస్తామని విదేశాంగ శాఖ తెలిపింది.
వాణిజ్య ట్రక్ డ్రైవర్లకు వర్క్ వీసా ఇవ్వం..
వాణిజ్య ట్రక్ డ్రైవర్లకు వర్కర్ వీసాలు జారీ చేయడాన్ని అమెరికా నిలిపివేస్తుందని విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో తెలిపారు. నిన్న సాయంత్రం ఎక్స్ లో ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఈ చర్య తక్షణమే అమెరికాలో అమల్లోకి వస్తుందని ప్రకటించారు.
‘‘అమెరికా రోడ్లపై పెద్ద ట్రాక్టర్- ట్రైలర్ ట్రక్కులను నడుపుతున్న విదేశీ డ్రైవర్ల సంఖ్య పెరగడం, సగటు అమెరికన్ జీవితాలను దుర్బర పరిస్థితుల్లోకి నెట్టివేస్తోంది. అమెరికన్ ట్రక్కు డ్రైవర్ల జీవనోపాధిని దెబ్బతీస్తోంది’’ అని రూబియో పోస్ట్ చేశారు. అమెరికాలో పనిచేస్తున్న విదేశీ ట్రక్ డ్రైవర్ల సంఖ్య గురించి అడిగిన ప్రశ్నకు ఆ విభాగం స్పందించలేదు.
భారత సంతతి డ్రైవర్ పై..
ఫ్లోరిడాలో భారత సంతతికి చెందిన ట్రక్ డ్రైవర్ హర్జిందర్ సింగ్ అక్రమంగా యూ టర్న్ తీసుకుంటూ ముగ్గురు వ్యక్తుల మృతికి కారణమైన ఘోర ప్రమాదానికి కారణమైన తరువాత వాణిజ్య ట్రక్ డ్రైవర్లకు వర్కర్ వీసాలు జారీ చేయడాన్ని తక్షణమే నిలిపివేయాలని రూబియో ఆదేశించారు. ఈ ఘోర ప్రమాదం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులలో ఆగ్రహాన్ని రేకెత్తించింది.
హర్జిందర్ సింగ్ అక్రమంగా మెక్సికో నుంచి అమెరికాలో ప్రవేశించాడని, ప్రమాదం తరువాత అతనికి నిర్వహించిన ఇంగ్లీష్ పరీక్షలో విఫలం అయ్యాడని ఫెడరల్ అధికారులు తెలిపారు.
ఇంగ్లీష్ కచ్చితంగా మాట్లాడాలి..
గతనెలలో ట్రంప్ పరిపాలన విభాగ ట్రక్కర్లు ఇంగ్లీష్ మాట్లాడటం, చదవడం ప్రావీణ్యం కలిగి ఉండాలనే నిబంధనను అమలు చేయడానికి చర్యలు తీసుకుంది. డ్రైవర్లు సంకేతాలను చదవలేకపోవడం లేదా ఇంగ్లీష్ మాట్లాడలేకపోవడం వల్ల ట్రాఫిక్ మరణాలు సంభవించిన సంఘటనల నేపథ్యంలో రోడ్డు భద్రతను మెరుగుపరచడమే ఈ లక్ష్యమని రవాణా శాఖ తెలిపింది. ఇప్పటికే యూఎస్ లో చదువుకుంటున్న వందలాది మంది విద్యార్థులను యూనివర్శిటీలో చదువుకోకుండా ఉద్యమాలు చేస్తున్నారిని వారిని డీపోర్ట్ చేస్తోంది.


Tags:    

Similar News