మరోసారి మునీర్ ను కలవబోతున్న ట్రంప్

పాక్ ప్రధాని షహబాజ్ షరీప్ కూడా ఉండే అవకాశం, ఈ ఏడాదిలో ఇంతకుముందే ఒకసారి కలిసిన మునీర్- ట్రంప్;

Update: 2025-09-16 12:37 GMT
పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్

పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్, వచ్చేవారం సెప్టెంబర్ 25న ఐరాస జనరల్ అసెంబ్లీ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో సమావేశం కానున్నారు. పాకిస్తాన్ వార్తా సంస్థ ఖైబర్ న్యూస్ లోని ఒక నివేదిక ప్రకారం.. పాకిస్తాన్ ప్రధాని, ట్రంప్ మధ్య జరగబోయే సమావేశానికి ఖతార్, సౌదీ అరేబియా మద్దతు ఇచ్చాయి.

పాక్ ధ్రువీకరణ..
ట్రంప్ తో జరగబోయే సమావేశంలో భారత్- పాకిస్తాన్ సంబంధాలు, ఖతార్ పై ఇజ్రాయెల్ దాడి, పాకిస్తాన్ లో తీవ్ర వరదలు ఎజెండాలో ఉన్నాయని నివేదిక పేర్కొంది. అయితే మంగళవారం నాటి నివేదిక ప్రకారం.. ఈ విషయంలో అమెరికాలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయం నుంచి ఎటువంటి నిర్ధారణ లేదా తిరస్కరణ బయటకు రాలేదు. వాషింగ్టన్ సంవత్సరాల తరబడి దౌత్యపరంగా పాక్ పై నిర్లక్ష్యంగా వహించిన తరువాత అమెరికా- పాకిస్తాన్ సంబంధాలు పురోగమిస్తున్న తరుణంలో ఈ పరిణామం జరిగింది.
మునీర్ కు ఆతిథ్యం..
జూన్ లో ట్రంప్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ ను వైట్ హౌజ్ లో ఆతిథ్యం ఇచ్చారు. సమావేశం తరువాత కొన్ని రోజుల్లోనే ట్రంప్ పరిపాలన పాకిస్తాన్ తో వాణిజ్య ఒప్పందం ప్రకటించడమే కాకుండా ఆ దేశం తన భారీ చమురు నిల్వలను కనుగొనడంలో సాయపడుతుందని కూడా ప్రకటించింది.
భారత్ తో కాల్పులు విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నందుకు ఇస్లామాబాద్ ట్రంప్ కు క్రెడిట్ ఇచ్చింది. రెండు అణ్వాయుధ దేశాల మధ్య అణు యుద్ధం జరగకుండా తాను స్వయంగా నిరోధించానని అమెరికా అధ్యక్షుడు చేసిన వాదనకు మద్దతు ఇచ్చిన తరువాత రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడినట్లు కనిపిస్తోంది.
ట్రంప్ కు వ్యక్తిగతంగా కోపం.. సుంకాలు..
భారత్ ఈ వాదనను చాలాసార్లు ఖండించింది. పాకిస్తాన్ డీజీఎంఓ ప్రతిపాదనతో కాల్పుల విరమణ కుదిరిందని తేల్చి చెప్పింది. మొదట్లో ఇస్లామాబాద్ కూడా ఇదే విషయాన్ని చెప్పింది. కానీ తరువాత ట్రంప్ తమ మధ్య మధ్యవర్తిత్వం కుదిర్చారని క్రెడిట్ ఇచ్చింది. అంతే కాకుండా ఆయనను నోబెట్ పీస్ బహుమతికి నామినేట్ చేసింది.
‘‘అమెరికా మల్టీనేషనల్ బ్యాంకు అయిన జెఫరీస్ ఒక నివేదికలో భారత్ - పాకిస్తాన్ మధ్య సైనిక వివాదంలో మధ్యవర్తిత్వం వహించడానికి అనుమతించకపోవడం వల్ల ట్రంప్ భారత్ పై 50 శాతం సుంకాలు విధించాలనే నిర్ణయం తీసుకున్నారు, అది అతని వ్యక్తిగత కోప ఫలితం’’ అని పేర్కొంది.
‘‘భారత్- పాకిస్తాన్ సంబంధాలు దీర్ఘకాలంగా వైరం మధ్య కొనసాగుతున్నాయి. దీనిని అంతం చేయడానికి అమెరికా అధ్యక్షుడు చేసిన ప్రయత్నాలను భారత్ అంగీకరించలేదని అందుకే సుంకాలు విధించాడని వివరించింది’’ అని హిందూస్తాన్ టైమ్స్ ఉటంకించింది.


Tags:    

Similar News